హైదరాబాద్

తక్షణ సహాయంగా రూ.300 కోట్లు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: గుంతలమయమైన రోడ్లకు మరమ్మతులు, అసలు పనికిరాకుండా పోయిన రోడ్ల పునరుద్దరణ వంటి పనులకు తక్షణ సహాయంగా జిహెచ్‌ఎంసికి రూ. 300 కోట్లను కేటాయించాలని జిహెచ్‌ఎంసి అధికారులు కేంద్ర బృందాన్ని కోరారు. గత సెప్టెంబర్ మాసంలో 21వ తేదీ నుంచి అయిదురోజుల పాటు కురిసిన అతి భారీ నుంచి భారీ వర్షాలకు నగరం అతలాకుతలమైన సంగతి తెలిసిందే! ఈ వర్షానికి జరిగిన నష్టాన్ని కేంద్రానికి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున జిహెచ్‌ఎంసి ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో కేంద్ర బృందం సోమవారం నగరానికి విచ్చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి రోడ్ల పరిస్థితి పర్యవేక్షించి నష్టాన్ని అంచనా వేసింది. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ దిలీప్‌కుమార్, రోడ్లు, జాతీయ రహదార్లు రవాణా శాఖ రీజినల్ ఆఫీసర్ ఎ. కృష్ణప్రసాద్, ఆర్‌బి కేల్‌లతో కూడిన బృందం, జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ సుభాష్‌సింగ్‌లు కలిసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అత్యధికంగా దెబ్బతిన్న రోడ్ల వివరాలను కమిషనర్ జనార్దన్‌రెడ్డి, సిఇ సుభాష్ సింగ్‌ల కేంద్ర బృందానికి వెల్లడించటంతో పాటు క్షేత్ర స్థాయిలో వాటి పరిస్థితిని కూడా చూపించారు. అంతేగాక, వర్షంతో జరిగిన నివేదికను మరోసారి బృందానికి అందజేశారు. ఈ బృందం సెక్రటెరియట్, ఎన్టీఆర్ మార్గ్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, షేక్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మినిష్టర్ రోడ్డు తదితర ప్రాంతాల్లోని పర్యటించి మెయిన్ రోడ్లను పరిశీలించింది. నష్టాలకు సంబంధించిన పలు ఫొటోలను, పత్రికా క్లిప్పింగ్‌లను కేంద్ర బృందానికి అధికారులు అందజేశారు. నగరంలో రోడ్లకు మరమ్మతులు కొనసాగుతున్నా, అవి వాహనదారులకు అనుకూలంగా లేని పరిస్థితులున్నందున తక్షణ సహాయంగా రూ. 300లు అందజేయాలని కేంద్ర బృందాన్ని కోరినట్లు జిహెచ్‌ఎంసి అధికారులు వెల్లడించారు.
సికిందరాబాద్ కంటోనె్మంట్ బోర్డు ఆధీనంలో ఉన్న 700 ఎకరాల్లో నిరుపయోగంగా ఉన్న భూమిని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి సోమవారం కంటోనె్మంట్ సిఇవో సుజాతగుప్తాతో కలిసి పరిశీలించారు. బోయిన్‌పల్లి నుంచి సుచిత్ర వెళ్లే మార్గంలో ఉన్న ఉన్న ఈ 700 ఎకరాల భూమిని సైన్యం షూటింగ్ రేంజ్‌గా గతంలో ఉపయోగించేది ప్రస్తుతం షూటింగ్‌కు కూడా ఉపయోగించకపోవటంతో అది నిరుపయోగంగా పడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ స్థలాన్ని ప్రభుత్వానికి కేటాయించాలని మున్సిపల్ మంత్రి కెటిఆర్ కోరిన నేపథ్యంలో కమిషనర్ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. కమిషనర్‌తో పాటు జోనల్ కమిషనర్ శంకరయ్య కూడా ఉన్నారు.