హైదరాబాద్

తెరాస సర్కార్‌కు మందు మీద ఉన్న ఆసక్తి మందిపై లేదు:టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, నవంబర్ 16: కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నల్లధనం ఉన్నవారిలో గుబులు రేగుతుందని టిడిపి నగర కన్వీనర్ ఎంఎన్.శ్రీనివాస్, కోకన్వీనర్ మేకల సారంగపాణి పేర్కొన్నారు. బుధవారం నగర టిడిపి కార్యాలయంలో త్రిసభ్య కమిటీ, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్దనోట్ల రద్దుతో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ తాజాగా నమోదు కార్యక్రమం పుంజుకుందని నేతలు కన్వీనర్‌కు వివరించారు. ఆయా నియోజకవర్గాలో ఉన్న సభ్యత్వ నమోదు సమస్యలను చర్చించారు. రాష్ట్ర పార్టీ ఇచ్చిన లక్ష్యాలను అధిగమించి సభ్యత్వ నమోదులో నగరం నుంచి రికార్డు సృష్టించాలని కన్వీనర్ పిలుపునిచ్చారు. పెద్దనోట్ల రద్దును కేంద్రానికి సూచించింది చంద్రబాబునాయుడేనని అన్నారు. నల్లధనాన్ని అసాంఘికశక్తులకు ఊతం ఇస్తున్న నకిలీ కరెన్సీను కట్టడి చేయడానికి ఇదొక మార్గమని చెప్పారు. ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని, కొద్దిగా చిల్లర కోసం ఇబ్బందులు ఉన్నప్పటికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సామాన్యులు తప్పుపట్టడం లేదన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ, గరీబీ హటావ్ అంటూ అందుకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీలకు మాత్రం ఇదొక తొందరపాటు నిర్ణయంగా కనిపిస్తుందని అన్నారు. రాష్ట్రప్రభుత్వం నగరంలో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఎక్కడ పడితే అక్కడ మద్యం ఏరులై పారుతున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారని చెప్పారు. కల్లు దుకాణాలు, మద్యం షాపులు, పర్మిట్‌రూమ్‌ల వద్ద బారులు తీరి వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేసి మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నా అడిగేవారు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ మద్యం దుకాణాలకు తాజాగా అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి మందు మీద ఉన్న ఆసక్తి ప్రజల ఇబ్బందుల మీద లేకుండా పోయిందని, సంక్షేమన్ని అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించారని అన్నారు. కేవలం ప్రకటనలకే పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను పరిమితం చేసిన కెసిఆర్ సర్కార్.. ప్రజలను ఘోరంగా మోసం చేస్తుందని అన్నారు. ఎంతో కాలం ప్రజలను నమ్మించి మోసం చేయలేరని, ఈ ప్రభుత్వ పనితీరుతో అన్ని వర్గాల ప్రజలు విసిగివేశారి పోయారని వివరించారు. ప్రజల సమస్యలపై తెలుగుదేశం పార్టీ తిరుగులేని పోరాటం చేయడానికి సన్నద్ధం అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కూన వెంకటేశ్‌గౌడ్, పి.సాయిబాబ, వనం రమేశ్, భజరంగ్‌శర్మ, కిశోర్ పాల్గొన్నారు.