హైదరాబాద్

ఖర్చుపై కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: బడా నేతల రోడ్‌షోలు..బహిరంగ సభలు..అభ్యర్థుల పాదయాత్రలు..ఇంటింటి ప్రచారాలతో అభ్యర్థులు తమ పని తాము చేసుకుపోతూ, ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రోజువారీ ప్రచారం చేసుకుంటూనే ఎన్నికల వ్యయానికి సంబంధించిన లెక్కలను ప్రతిరోజు రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉన్నా, బరిలో ఉన్న మొత్తం 1333 మంది అభ్యర్థుల్లో మూడో వంతు అభ్యర్థులు ఖర్చు లెక్కలు సమర్పించటం లేదని తెలిసింది. ఈ సారి జిహెచ్‌ఎంసి ఎన్నికలు
పారదర్శకంగా ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థుల ఇష్టారాజ్యం ఖర్చులకు కళ్లెం వేసేందుకు 24 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను వ్యయ పరిశీలకులుగా రంగంలో దింపింది. పక్షం రోజుల క్రితం నియమితులైన ఈ అధికారులంతా ప్రచారం ప్రారంభమైన 18వ తేదీ నుంచే క్షేత్ర స్థాయి విధుల్లో నిమగ్నమైనట్లు తెలిసింది. అభ్యర్థులకు గానీ, వారి అనుచరులకు గానీ తెలియకుండా వారు చేస్తున్న ఖర్చులపై డేగ కన్ను వేసి, ప్రచారంలో పాల్గొంటున్న వారి సంఖ్య, వారి టీ, టిఫిన్లు మొదలుకుని రాత్రి భోజనం వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని లెక్కలేస్తున్నారు. పైసా కూడా మిస్ కాకుండా మార్కెట్ విలువకు అనుకూలంగా లెక్కలేస్తూ వారి ఖాతాల్లో జమా చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. అభ్యర్థులు ఓటర్లను మభ్య పెట్టడం, మద్యం, డబ్బు వంటివి పంపిణీని క్షేత్ర స్థాయిలో పూర్తి అడ్డుకోవటమే వీరి ప్రదాన విధి. ఒక్కో సర్కిల్‌కు సాధారణ పరిశీలకుడ్ని నియమించటంతో పాటు ప్రత్యేకించి వ్యయాన్ని అంచనాలు వేసి, అభ్యర్థుల ఖాతాల్లో వేసేందుకు సర్కిల్‌కు ఒకరు చొప్పున ఈ వ్యయ పరిశీలకులు రహస్యంగా అభ్యర్థుల ఖర్చులపై కన్ను పెట్టారు. వీరు క్షేత్ర స్థాయిలో సక్రమంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించేందుకు వీలుగా తగిన సెక్యూరిటీతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించారు. కానీ అభ్యర్థులు ఇష్టారాజ్యంగా పరిమితికి మించి ఖర్చులు పెడుతూ, వాటిని రిటర్నింగ్ అధికారులకు తక్కువగా సమర్పిస్తున్నట్లు తెలిసింది. పార్టీలు పెట్టే ఖర్చులకు పరిమితి లేకపోవటంతో కొందరు ప్రధాన పార్టీ అభ్యర్థులు తమ ఖర్చులను పార్టీల ఖాతాల్లోకి మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
సర్కిల్ నెం. వ్యయ పరిశీలకుడు ఫోన్ నెం.
1టి.వెంకటేశ్వర్‌రావు 9100024996
2పి.ప్రభాకర్ 9100024997
3ఏఎస్.గోవర్దన్ 9100024998
3బి శ్యాంసుందర్ 9100025102
4ఏపి.పాండురంగారావు 9100025103
4బిఎం.పద్మజ 9100025104
5డి.ప్రవీణ్ ప్రభ 9100025104
6పి.సుధాకర్ 9100025106
7బిఎం.శ్రీనివాస్ 9100025107
7ఏఎం.రేవతి దేదీప్య 9100025108
8జె.ప్రభాకర్‌రెడ్డి 9100025110
9బి బి.యాదగిరి 9100025112
9ఏ జి. దీప్తి 9100025113
10బి జి.వాణి 9100025114
10ఏ జె.జగన్మోహన్‌గౌడ్ 9100025115
11 ఎ.నాగరాజు 9100025116
12 కె. పార్వతిదేవి 9100025117
13 సిహెచ్.విజయ్‌కుమార్ 9100025118
14ఏ టి.కె. జయశ్రీ 9100025119
14బి లాల్‌సింగ్ 9100025120
15 కె.ఏ.ఘాన్నీశోభన్ 9100025121
16 డి.విజయలక్ష్మీ 9100025122
17 ఎ.సుక్కయ్య 9100025123
18 షాజహన్ బేగం 9100025124