హైదరాబాద్

‘తెరమీద బోధించే పాఠాలు సులువుగా అర్థమవుతాయి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: తెరమీద బోధించే పాఠశాలు విద్యార్థులకు మిరంత బాగా అర్థమవుతాయన్న ఉద్దేశ్యంతో విద్యారంగంలో డిజిటల్ తరగతులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 7లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం డిజిటల్ తరగతులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి, రాష్టవ్య్రాప్తంగా మన ఈటివి, ఆఫ్ లైన్ తదితర మార్గాల ద్వారా మొత్తం 3352 పాఠశాలల్లో బుధవారం నుంచి డిజిటల్ క్లాసులు ప్రాంరభిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులకు భోధనలో ఈ తరహా క్లాసులు ఎంతగానో దోహదపడుతాయని తెలిపారు. డిజిటల్ తరగతులు కేవలం ఆచీప్‌వెంట్ స్థాయి పెరిగే అవకాశం ఉంటుందన్నారు. డిజిటల్ తరగతులు టీచర్లకు సహాయకారిగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ప్రారంభించినవే గానీ వారిని రిప్లేస్ చేయటానికి కాదని ఆయన స్పష్టం చేవారు. టెక్నాలజీ వినియోగం ద్వారా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సిస్టమ్ నెలకొల్పేందుకు విశేషంగా కృషి చేసిన విద్యాశాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి అభినందించారు. డిజిటల్ తరగతులు ప్రారంభించిన అనంతరం క్లాస్‌రూంలో కూర్చోని పాఠాలు చెబుతున్న విధానం, వసతుల కల్పన వంటి అంశాలపై విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. టీచరు డిజిటల్ క్లాస్ సహాయంతో జీర్ణవ్యవస్థ, దంత వ్యవస్థపై పాఠాలు భోధించగా, మంత్రి కూడా ఆలకించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్సీ సి. జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ కవితారెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, విద్యాశాఖ కమిషనర్ కిషన్, జాయింట్ డైరెక్టర్ రమణకుమార్ పాల్గొన్నారు.