హైదరాబాద్

ఎమ్మెల్యే కృష్ణారావుపై కలెక్టర్‌కు ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బి కాలనీ, నవంబర్ 17: కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని కోర్టు వివాదంలో ఉన్న ఓ కాలనీని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దత్తత తీసుకున్న వ్యవహారంపై యువజన కాంగ్రెస్ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ డివిజన్‌లోని సర్వేనెంబర్.908 రాఘవేంద్ర సొసైటీని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గతంలో దత్తత తీసుకున్నారు. అయితే దీనిపై మల్కాజ్‌గిరి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎం.డి.మోయిజ్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ నాయకులు గురువారం కూకట్‌పల్లి మండల కార్యాలయానికి వచ్చిన కలెక్టర్ ఎం.వి.రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉన్న రాఘవేంద్ర సోసైటీ వ్యవహారం కోర్టులో కేసు నడుస్తోంది. కోర్టులో కేసు నడుస్తుండగా నిబంధనలకు విరుద్ధంగా రాఘవేంద్ర సొసైటీని కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు దత్తత ఎలా తీసుకుంటాడని ఎం.డి.మోయిజ్ ప్రశ్నించాడు. అనంతరం మోయిజ్ మాట్లాడుతూ తాను అభివృద్ధికి వ్యతిరేకం కాదని ఓ ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే కోర్టులో ఉన్న వివాదాస్పద స్థలాన్ని దత్తత తీసుకోవడం ఏ మేరకు సబబన్నారు. గతంలో అనేకమార్లు ఎఫ్‌టిఎల్ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టవద్దని ఉన్నత న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని గుర్తు చేశారు. దత్తతను సాకుగా తీసుకొని టిఆర్‌ఎస్ నాయకులు కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని కాజేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. దీనిపై తక్షణం విచారణ చేపట్టి కాముని చెరువును కాపాడేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.