హైదరాబాద్

పెద్ద నోట్ల రద్దుపై సామాజిక మాధ్యమాల వదంతులను నమ్మవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: పెద్ద నోట్ల రద్దు, అశ్లీలత, మనోభావలను కించపరచే విధంగా కార్టూన్లపై సామాజిక మాద్యమాలలో వస్తున్న పోస్టింగ్‌లను వదంతులను నమ్మవద్దని, సోషల్ మీడియాపై గట్టి నిఘా పెట్టామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొందరు ఆకతాయిలు చేస్తున్న ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రూ. 30 కోట్లతో సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేశామని చెప్పారు. ఆదివారం నుంచి మిషన్ ఆన్ సోషల్ మీడియా పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని కమిషనర్ వెల్లడించారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూ ట్యూబ్‌లో సుమారు 5వేల అనుమానాస్పద లింకులను తొలగించామని కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

1న షిర్డీ సాయిబాబా దేవాలయాల నిర్వాహకులతో సదస్సు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 19: శ్రీ షిర్డీ సాయిబాబా మహా సమాధి శతాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి వచ్చే నెల 1న షిర్డీ భక్త నివాస్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని షిర్డీ సాయి బాబా దేవాలయాల నిర్వాహకులతో సదస్సు నిర్వహించనున్నట్లు శ్రీషిర్డి సాయిబాబా సంస్థాన్ చైర్మన్ సురేష్ హావరే తెలిపారు. 1918 అక్టోబర్ 18న షిర్డీ సాయిబాబా మహాసమాధి చెందారని వివరించారు. 2018 అక్టోబర్ 18వ తేదీకి వంద సంవత్సరాలు పూర్తి కానున్నందున శ్రీ సాయిబాబా ‘నూరు సంవత్సరాల మహా సమాధి’ ఉత్సవాలను వచ్చే ఏడాది (2017) అక్టోబర్ 1నుంచి 2018 అక్టోబర్ 18వ తేదీ వరకు నిర్వహించాలని శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ నిర్ణయించిందని తెలిపారు. వివరాలకు 02423 0258956 లేదా 7720077203 సంప్రదించవచ్చని సురేష్ హపరే భక్తులకు విజ్ఞప్తి చేశారని సంస్థాన్ పిఆర్‌వో మోహన్ యాదవ్ పేర్కొన్నారు.