హైదరాబాద్

సిఎం కెసిఆర్ పేరున 1998 డిఎస్‌సి అభ్యర్ధుల పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, నవంబర్ 20: ఉపాధ్యాయ నియామకం కోసం జరిగిన పరీక్షలో అర్హత సాధించిన 1998 బ్యాచ్ డిఎస్‌సి అభ్యర్ధులు ఆదివారం పెద్దమ్మతల్లి దేవాలయంలో ముఖ్యమంత్రి పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1998 డిఎస్‌సి సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11:45 ప్రాంతంలో ర్యాలీగా జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయానికి చేరుకున్న అభ్యర్ధులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేరన అర్చన, అభిషేకాన్ని నిర్వహించారు. 1998లో ఉపాధ్యాయ నియామకం కోసం జరిగిన అర్హత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులు సుమారు 18 ఏళ్లుగా తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాలను కోరుతూ వస్తున్నారు. రాష్ట్ర విభజన పూర్తి అయిన అనంతరం అయినా తమ సమస్య పరిష్కారం అవుతుందని భావించినా కాకపోవడంతో పలుమార్లు ప్రభుత్వ పెద్దలను కలిశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 3వ తేదీన స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మీ బాధలు మాకు తెలుసునంటూ ఉద్యోగాలు కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. దీనిని నిలబెట్టుకొని తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ఆదివారం తాము ఆయన పేరున అభిషేకం, అర్చన నిర్వహించామని సాధన సమితి నేతలు శ్రీనివాస్, రఘురామరాజు తెలిపారు. కెసిఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటున్నారని, వారి తరహాలోనే తమ బాధను అర్ధం చేసుకొని ఉద్యోగాలు కల్పిస్తారన్న ఆశాభావం తమకు ఉందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో తమకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్టు తెలిపారు. పెద్దమ్మతల్లి ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి పంపుతామని వారు వివరించారు.