హైదరాబాద్

కళాకారులలోని ప్రతిభకు అవార్డులు నిదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: కళాకారులలోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ సత్కరించి అవార్డులను ప్రధానం చేయడం ద్వారా కళాకారులలోని ప్రతిభను గుర్తించినట్లేనని ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్టు చైర్‌పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. బాల బాలికలు కళా సాంస్కృతిక రంగాలలో పాల్గొని సాటి కళాకారులతో పోటీ పడినపుడే ఉత్సాహం పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ ఎబిసి ఫౌండేషన్, స్వర్ణ భారతి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం రవీంద్ర భారతిలో బాలల దినోత్సవం ప్రతిభా అవార్డులను ఆమె ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర నిర్మాత దర్శకుడు సాయి వెంకట్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వివిధ కళా సంస్థలకు చెందిన చిన్నారులు నృత్యాన్ని ప్రదర్శించారు. బాల బాలికలతో వచ్చిన నృత్య గురువులను కూడా సన్మానం చేశారు. ప్రముఖ నాట్యాచార్యులు క్రాంతి కిరణ్, ఇతర గురువులకు నాట్య సార్వభౌమ, నాట్య శిరోమణి బిరుదులను ప్రధానం చేశారు. మిస్ ఆసియా రన్నర్ రెష్మి ఠాకూర్, తుమ్మల పాటి రమా సత్యనారాయణ, నాట్యాచార్యులు పసుమర్తి శేషుబాబు పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షుడు లలితా రావు స్వాగతం పలకగా ఎబి ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ కెవి రమణారావు కార్యక్రమాన్ని నిర్వహించారు.