హైదరాబాద్

వంద నోట్లు ..వెయ్యి పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: బ్యాంకు ఖతాల్లో మూలుగుతున్న సొంత డబ్బు... అవసరానికి తగినంత డ్రా చేసుకునే అవకాశం లేదు. ఏటిఎం ద్వారా రోజుకి కేవలం రూ. 2వేలు మాత్రమే డ్రా చేసుకునే అవకాశముండటంతో ఖాతాదారులు వంద నోటు కోసం కోటి కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా పధ్నాలుగు రోజుల క్రితం ఈ నెల 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంలో విఫలం కావటంతో సామాన్యులకు తిప్పలు తప్పటం లేదు. వెయ్యి, 500 నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా రూ. 500 కొత్త నోటును అందుబాటులోకి తేకపోవటం, గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 2వేల నోటును మాత్రమే ఏటిఎంలలో అందుబాటులో ఉంచటం వల్లే చిల్లర కష్టాలు తప్పటం లేదని ఖాతాదారులు వాపోతున్నారు. ఆ నోటు పట్టుకుని బడా సూపర్‌మార్కెట్ వెళ్లినా కనీసం రూ. 1500 కొనుగోలు చేస్తే తప్ప, చిల్లర ఇచ్చేది లేదని తేల్చి చెబుతుండటంతో కొత్తనోటుతో కష్టాలు మరింత అధిగమయ్యాయి. ముఖ్యంగా రోజుకు విత్‌డ్రాకు రెండువేలు మాత్రమే పరిమితి విధించటంతో చిన్నా చితక ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వారు పది శాతం కమీషన్లు ఇచ్చి కొత్త రెండు వేల నోటుకు 19 వంద నోట్లను తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు బ్యాంకుల్లో నిల్వ ఉంచిన రూ. వంద నోట్లన్నీ ప్రజలకు పంపిణీ చేసిన తర్వాత అవి తిరిగి జమ కావటం లేదు. ఉన్న వారు వాటిని భద్రంగా దాచుకుని మళ్లీ చిల్లర కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో మార్కెట్‌లో వంద నోట్ల కొరత తీవ్ర స్థాయిలో ఉంది. మరికొందరు వ్యాపారులు కావాలనే వంద, యాభై నోట్లను దాచుకుంటూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. కొత్త వంద కరెన్సీ నోట్లను ప్రింట్ చేసి బ్యాంకులకు అందించినా అవి సరిపోవటం లేదు. నగరంలో కొందరు ప్రభుత్వోద్యోగులు, చిరుద్యోగులు, వ్యాపారుల్లో ఎక్కువ మంది తమ అసరాలకు తగిన విధంగా రోజుకి వెయ్యిలోపు డ్రా చేసుకునే వారే ఎక్కువ మంది ఉన్నా, వారి అవసరాలకు తగిన విధంగా వంద నోట్లు అందుబాటులో లేవు. కొన్ని ఏటిఎంలలో ఉదయం పది నుంచి పదిన్నర గంటల లోపు సుమారు రూ. 4 నుంచి రూ. 5లక్షల విలువైన వంద నోట్లను లోడ్‌చేస్తున్నా, అవి గంటల వ్యవధిలోనే అయిపోతున్నాయి. దీంతో ఖాతాదారులు తెల్లవారుఝము అయిదారు గంటల నుంచి చలిని సైతం లెక్కచేయకుండా ఏటిఎంల ముందు క్యూ కడుతున్నారు. అంతేగాక, ఏటిఎంలలో అందుబాటులో ఉన్న రూ. 2వేల నోటుకు చిల్లర దొరక్క ప్రజలు అనేక ఇబ్బందులెదుర్కొంటున్నారన్న విషయాన్ని గుర్తించిన ఎస్‌బిఐ వంటి జాతీయ బ్యాంకు పాయింట్ ఆఫ్ సేల్(పివోఎస్) మొబైల్ వ్యాన్లను అందుబాటులోకి తెచ్చింది. డెబిట్ కార్డును స్వైప్ చేసుకుని ప్రతిరోజు రెండువేల విలువైన ఇరవై వంద నోట్లను పంపిణీ చేస్తున్నారు. కానీ ఈ వ్యాన్లలో కూడా ఉదయం వచ్చిన గంట గంటన్నర వ్యవధిలోపే నోట్లు అయిపోతున్నాయి. ఉదయం పదకొండు నుంచి మెహిదీపట్నం రైతుబజార్‌కు వచ్చిన ఈ వ్యాన్‌లో కేవలం రెండు గంటల వ్యవధిలో రూ. 5లక్షల విలువైన వంద నోట్లు అయిపోయాయి. ఆ తర్వాత మిషన్ బ్యాటరీ డిశ్చార్జ్ కావటంతో దాన్ని మళ్లీ సమీపంలోని బ్యాంకులో ఛార్జింగ్‌కు పెట్టి, సాయంత్రం మళ్లీ పివోఎస్‌ను అందుబాటులోకి తెచ్చారు.