హైదరాబాద్

నగరానికి పూర్వవైభవాన్ని తెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: నగర ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు అధిక సంఖ్యలో పార్కులను అభివృద్ధిలోకి తెచ్చి, గార్డెన్ సిటీ, సరస్సుల నగరంగా పేరుగాంచిన సిటీకి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలియజేశారు. రాజేంద్రనగర్ హైదర్‌నగర్‌లో రూ. 63లక్షల వ్యయంతో నిర్మించిన పెద్దతాళ్లకుంట చెరువు పార్కును మేయర్ బొంతు రామ్మోహన్ కమిషనర్ జనార్దన్‌రెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం ప్రారంభించారు.
నగరంలో చెరువులు, పార్కులు ఆక్రమణలకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులను పరిరక్షించి నగరాన్ని పూర్వవైభవాన్ని సంతరింపజేసేంకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన వివరించారు. హుస్సేన్‌సాగర్ సహా అన్ని చెరువులను కాలుష్యం నుంచి రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇందుకు గాను గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక కొలనులను నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
నగరంలో ప్రస్తుతం సంప్రదాయక విద్యుత్ దీపాల స్థానంలో ఎల్‌ఇడి లైట్లను ప్రవేశపెట్టామని తెలిపారు. వీటి వినియోగం వల్ల ప్రస్తుతం చెల్లిస్తున్న విద్యుత్ బిల్లులు 50 శాతానికి పైగా తగ్గుతాయని ఆయన వివరించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాలను పోల్చిచూస్తే రాజేంద్రనగర్ నియోజకవర్గం అన్ని రకాలుగా వెనుకబడి ఉందని, తమ నియోజకవర్గంలో వార్డుల్లో పార్కులు, క్రీడామైదాలు, ఈ లైబ్రరీలు తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు.
జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో పార్కుల నిర్వాహణను స్థానిక సంక్షేమ సంఘాలు చేపట్టాలని పేర్కొన్నారు. నగరాన్ని మరింత పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు అన్న రకాల చర్యలు చేపట్టామని తెలిపారు. ఓపెన్ గ్యార్బెజ్ పాయింట్ల తొలగింపు, తడి,పొడి చెత్తలను వేర్వేరుగ సేకరించటం, బహిరంగ మల,మూత్ర విసర్జనలను నివారించటం వంటి చర్యలు చేపట్టాలని, ఇందుకు ప్రజలు కూడా సహకారం అందించాలని కోరారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ మాట్లాడుతూ దేశంలోని మరే నగరంలో లేని విధంగా హైదరాబాద్ నగరంలో 22లక్షల ఇళ్లకు రెండు డస్ట్‌బిన్లను ఉచితంగా అందించటంతో పాటు 2వేల ఆటో టిప్పర్లను కూడా చెత్త సేకరించేందుకు కేటాయించామని గుర్తుచేశార. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ కమిషనర్ దశరధ్ తదితరులు పాల్గొన్నారు.

కూకట్‌పల్లి జాతీయ రహదారిపై గొయ్యి

కెపిహెచ్‌బికాలనీ, నవంబర్ 23: కూకట్‌పల్లి జాతీయ రహదారి సమీపంలోని ఉషాముళ్లపుడి కమాన్ ఎదురుగా రోడ్డుపై ఆకస్మాత్తుగా గొయ్యి ఏర్పడింది. దీంతో కొంత సేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రోడ్డు కింది భాగంలో ఏర్పాటు చేసిన మంచినీటి పైపులైన్ లీకేజి కారణంగా నీరు అధిక ప్రెషర్‌తో రోడ్డుపై ప్రవహించడంతో పూర్తిగా కుంగిపోయింది.
దీంతో బుధవారం మధ్యాహ్నం సమయంలో ఆకస్మాత్తుగా రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడింది.
విషయాన్ని తెలుసుకున్న వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ వెంటనే సంఘటన ప్రాంతానికి చేరుకొని గొయ్యిని పరిశీలించారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో గుంత చుట్టు వలయాలు ఏర్పాటు చేశారు. 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన నాలుగు ఇంచుల నీటి పైపులైన్ లీకేజీతో రోడ్డుపై గుంత ఏర్పడిందని అన్నారు.
వాటర్ వర్క్స్, ప్రాజెక్ట్ అధికారులతో మాట్లాడి రెండు మూడు రోజుల్లో కొత్త పైపులైన్ ఏర్పాటు చేస్తామని అప్పటి వరకు వాటర్ లైన్ డమ్మి చేస్తామని తెలిపారు. విషయాన్ని తెలుసుకున్న వివేకానందనగర్ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీబాయి.గొయ్యి ఏర్పడిన ప్రాంతాన్ని పరిశీలించి మరమ్మతు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

మేడ్చల్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ సరెండర్

మేడ్చల్, నవంబర్ 23: మేడ్చల్ ప్రభుత్వ పౌర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సనత్‌కుమారిని ప్రభుత్వానికి సరెండర్ చేసినట్టు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డిఎంఅండ్‌హెచ్‌ఓ) భానుప్రకాశ్ బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న సనత్‌కుమారి మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిలో 2010 నుండి పని చేస్తున్నారని తన పని తీరు మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో చర్యలు తప్పలేదని పేర్కొన్నారు. ప్రజల నుండి ప్రభుత్వాసుపత్రి పనితీరుపై ఎన్నో ఫిర్యాదులు అందాయని, గతంలో కూడా ఎమ్మేల్యేలు, కలెక్టర్‌లు, డిఎంఅండ్‌హెచ్‌ఓలు చెప్పినా ఆమె పని తీరు మారలేదని వివరించారు. మేడ్చల్ జిల్లాగా ఏర్పడ్డాక కూడా ఆమె వ్యవహరశైలిలో ఎలాంటి మార్పురాలేదని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో ఆమె అందుబాటులో లేకపోవడం ఆసుపత్రిని, పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచడం, పోస్టుమార్టం వ్యవహరం పట్టించుకోకపోవడం, ప్రజల నుండి అనేక ఫిర్యాదులు వెరసి ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేసినట్లు పేర్కొన్నారు. సనత్‌కుమారిపై కలెక్టర్‌కు నివేదించగా ఆమె సేవలు మన జిల్లాకే అవసరం లేదని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ ఎంవి రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
కాగా, మేడ్చల్ ప్రభుత్వ సూపరిండెంట్ సనత్‌కుమారి అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని పలువురు ఆరోపించారు. ఆసుపత్రికి కేటాయించిన నిధులలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. డ్యూటీ డాక్టర్ల విషయంలో అమె డిమాండ్ చేసినంతా ముట్టజెబితే రాత్రి డ్యూటీలకు రాకున్నా ఎలాంటి చర్యలు తీసుకునేది కాదని తెలిసింది. ఒకటి కాదు రెండు కాదు సనత్‌కుమారిపై చాలా పెద్ద సంఖ్యలో అవినీతి ఆరోణలు ఉన్నాయి. అధికారులు లోతుగా పరిశీలిస్తే అవి వెలుగులోకి వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జిల్లాలో తొలి వేటు
మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి తాను పలు సందర్భాల్లో అధికారులు జారీ చేసిన హెచ్చరికలు కార్యరూపం దాలుస్తున్నాయని చెప్పవచ్చు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటిస్తూ పని తీరు సరిగాలేని అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు. పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని(మిగతా 4వ పేజీలో)
కూడా హెచ్చరిస్తూ వస్తున్నారు. మేడ్చల్ ప్రభుత్వ పౌర ఆసుపత్రి సూపరిండెంట్ సనత్‌కుమారిని కూడా హెచ్చరించారు. షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. రెండు మాసాలు ఆమె పని తీరును పరిగణలోకి తీసుకున్నారు. అయిన ఆమె మారలేదు. ఇంతలోనే ప్రజల నుండి మరెన్నో ఫిర్యాదు అందాయి. దీంతో డిఎంఅండ్‌హెచ్‌ఓకి సనత్‌కుమారిపై నివేదిక సిద్ధం చేయాలని ఆదేశాలు అందడం ఆయన హుటహుటిన సిద్ధం చేసి కలెక్టర్ అందించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. బుధవారం రాత్రిఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. ఈ దెబ్బతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తమ పని తీరు మార్చుకుంటారో లేక కలెక్టర్ ఆగ్రహానికి గురవుతారో సమయం చెబుతుంది. సనత్‌కుమారి సరెండర్ అధికారులకు ఓ హెచ్చరిక అని మాత్రం చెప్పక తప్పదు.
కొండాపూర్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య

గచ్చిబౌలి, నవంబర్ 23: భార్యభర్తల మధ్య వివాదం కుటుంబాన్ని రోడ్డున పడేసింది. భర్త కొండాపూర్ 8వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మరో మహిళతో అక్రమ సంబంధం కొనపాగిస్తున్నాడని అనుమానంతో నిత్యం గొడవ పడడంతో జీవితంపై విరక్తి చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని కొండాపూర్ 8వ బెటాలియన్‌లో జరిగింది. గచ్చిబౌలి సిఐ జూపల్లి రమేష్ కుమార్ తెలిపిన వివరాలు ఇలావున్నాయి. ప్రకాశం జిల్లా కారంచెడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన పొత్తూరి విజయ కుమార్ (29) కొండాపూర్ 8వ బెటాలియన్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 2011లో భూషమ్మ అలియాస్ సుమతిని వివాహం చేసుకున్నాడు. అతనికి నిషిజే(5) గిఫ్టీ(3) ఇద్దరు అడపిల్లలలతో బెటాలియన్‌లోని సి బ్లాక్-18లో నివాసముంటున్నారు. విజయకుమార్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని అనుమానంతో భార్య భూషమ్మ రోజు గొడవ పడేది. ఈ క్రమంలో చాల కాలంగా భార్యాభర్తలు దూరంగా ఉన్నారు. ఈమధ్య కాలంలోనే భార్య భూషమ్మ కాపురానికి వచ్చినట్టు తెలిసింది. రాత్రి 9గంటలకు నిద్రపోతానని బెడ్‌రూములోకి వెళ్లగా భార్య పిల్లలతో హాల్‌లో నిద్రపోయినట్లు పోలీసులు చెప్పారు. ఉదయం భార్య బెడ్‌రూములోకి వెళ్లిచూడగా ఫ్యాన్ ఉరివేసుకొని కనబడడంతో పెద్ద ఎత్తున ఎడవడంతో పక్క క్వార్టర్స్‌లో నివాసముండే వెంకన్న వచ్చి.. ఫ్యాన్‌కు వెళాడుతున్న విజయకుమార్‌ని కిందికి దింపి చూడగా అప్పటికే మృతిచెంది ఉండడంతో గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. గచ్చిబౌలి ఎస్‌ఐ రామయ్య కేసు నమోదు చేసుకుని దర్యాపు చేస్తున్నారు.

నకిలీ కొబ్బరి నూనె
కేంద్రంపై పోలీసుల దాడి
* నిర్వాహకుడి అరెస్టు
సైదాబాద్, నవంబర్ 23: బ్రాండెడ్ కంపెనీ పేరుతో నకిలీ కొబ్బరి నూనె తయారు చేస్తున్న కేంద్రంపై దాడిచేసిన మలక్‌పేట్ పోలీసులు నిర్వాహకుడిని అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... రాజస్థాన్‌కు చెందిన మహావీర్ జైన్(34) చైతన్యపురిలో నివాసం ఉంటూ మలక్‌పేట్ సలీంనగర్‌లో కొబ్బరినూనె తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. పారాచుట్ కంపెనీకి చెందిన ప్లాస్టిక్ సీసాలను తయారు చేయించి వాటిలో నాసిరకం కొబ్బరినూనె నింపి పాతబస్తీ సహా నగరంలోని పలుప్రాంతాలలోని కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తుంటాడు. తమ కంపెనీ నూనెలు నకిలీకి గురవుతున్న విషయం తెలుసుకున్న మ్యారికో లిమిటెడ్ కంపెనీకి చెందిన ఆపరేషన్స్ మేనేజర్ పి.సదానందం మహవీర్‌జైన్‌పై మలక్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం సలీంనగర్‌లోని మహవీర్‌జైన్‌కు చెందిన తయారీకేంద్రంపై పోలీసులు దాడిచేయగా అక్కడ పెద్దఎత్తున నకిలీ కొబ్బరినూనె తయారు చేస్తుండటాన్ని గుర్తించారు. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొబ్బరినూనెతో నిండిన రెండు ప్లాస్టిక్ డ్రమ్ములు, నకిలీ సీసాలకు ఉపయోగపడే 5బస్తాలలోని ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు, ఒక ఆయిల్ ఫిల్లింగ్ మిషన్, ఒక ప్యాకింగ్ మిషన్, పారాచూట్ కంపెనీకి చెందిన నకిలీ లోగోలను స్వాధీనం చేసుకున్నారు. మలక్‌పేట్ ఏసిపి సుధాకర్, పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై ఏడు కొండల్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.