హైదరాబాద్

తెలుగు సంప్రదాయాలు ప్రతిబింబించే చిత్రాలు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: సినీ నిర్మాణం కేవలం డబ్బు సంపాదన కోసమే కాకుండా సందేశాత్మకంగా కథలు వుండాలని, తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే మంచి చిత్రాలు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ జూనియర్ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘తెలుగు సినిమా స్క్రీన్‌ప్లే’ పుస్తకాన్ని బుధవారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో ఈటెల రాజేందర్ ఆవిష్కరించారు. డిస్కో నృత్యాలకు స్వస్తి చెప్పాలని, పాత శాస్ర్తియ నృత్య సంప్రదాయాలను కాపాడుకుంటూ పాత తరహా కుటుంబ కథ చిత్రాలకు ప్రాధాన్యత కల్పించండి సినీ వర్గానికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో విశిష్ఠ అతిధిగా సంకసాల మల్లేష్ పాల్గొనగా ఉస్మానియా తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు తంగెడ కిషన్‌రావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొ. వెంకటేశ్వరరావు, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఎస్వీ సత్యనారాయణ, మరుధూరి రాజా పాల్గొన్నారు.