హైదరాబాద్

నేటి నుంచి ‘నగదు మార్పిడి’కి బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: కేంద్రం రద్దు చేసిన రూ. వెయ్యి, 500 నోట్లకు సంబంధించి నగదు మార్పిడిని బ్యాంకులు,పోస్ట్ఫాసులు నిలిపివేయనున్నాయి. కానీ ఇదే రద్దయిన పాత నోట్లతో ఆస్తిపన్ను బకాయిలు, కరెంటు, వాటర్ బిల్లులతో పాటు రెగ్యులరైజేషన్ ఛార్జీలు, ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్‌లు, ట్రేడ్ లైసెన్సు, బిల్డింగ్ పర్మిషన్ అనుమతల ఛార్జీల స్వీకరణ గురువారం అర్థరాత్రి వరకు కొనసాగింది. ఇకపై వెయ్యి నోటు కేవలం బ్యాంకుల్లో జమకే పరిమితం కాగా, రూ. 500 పాత నోటుతో కరెంటు, వాటర్ బిల్లులు మాత్రమే చెల్లించుకోవచ్చునని, అందుకు వచ్చే నెల 15 వరకు కేంద్రం గడువును పెంచింది. ఈ నెల 9వ తేదీ నుంచి గురువారం అర్థరాత్రి వరకు పాతనోట్లతో వివిధ రకాల పన్ను, ఛార్జీలను స్వీకరించిన ఒక్క జిహెచ్‌ఎంసికే ఈ పాత నోట్ల చెల్లింపులతో సుమారు రూ. 237 కోట్ల వరకు ఆదాయం సమకూరి, దేశంలోనే అత్యంత ఎక్కువగా కలెక్షన్ సాధించింది. ఇదిలా ఉండగా, రద్దయిన నోట్ల మార్పిడికి గురువారం చివరి రోజు కావటంతో నగరంలోని అన్ని బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో ఖాతాదారులు ఉదయం ఏడు గంటల నుంచే బారులు తీరారు. రద్దయిన పాట నోట్లను ఇక శనివారం నుంచి బ్యాంకులు కేవలం డిపాజిట్ మాత్రమే చేసుకోనున్నాయి. ఇందులోను రూ. రెండున్నర లక్షల వరకు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా జమ చేసుకుంటున్న బ్యాంకులు పాత నోట్లతో డిపాజిట్లకు పరిమితి అంటూ ఏమీ పెట్టలేదు. కానీ విత్‌డ్రా సమయంలో ఇన్‌కం ఫ్రూఫ్ చూపించాల్సి ఉంటుందన్ననిబంధన ఉండటంతో పెద్ద మొత్తంలో పోగు చేసుకున్న పాత నోట్లను బ్యాంకుల్లోనూ జమ చేసేందుకు నల్లకుబేరాలు, అక్రమంగా సంపాదించిన వారు వెనకంజ వేస్తున్నారు. ఇలాంటి వారే కమీషన్లు ఇస్తూ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నారు. ఈ ప్రక్రియలో డబ్బు ఆశతో మధ్యవర్తులుగా వ్యవహారిస్తూ ఇప్పటికే కొందరు యువకులు పోలీసులకు చిక్కిన సంఘటనలున్నాయి. ఈ క్రమంలో పాత నోట్లకు సంబంధించి నేటి నుంచి బ్యాంకులు కేవలం డిపాజిట్లను మాత్రమే స్వీకరించనున్నందున ఇలాంటి కాలా దందా మరింత పెరిగే అవకాశముంది.