హైదరాబాద్

ఆశలు చిగురింపజేసిన రూ.500 నోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయటంతో నగరవాసులు చిల్లర కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నెల 8వ తేదీన వెయ్యి, రూ. 500 నోట్లను రద్దు చేస్తూ ప్రకటించిన ప్రభుత్వం వెంటనే రూ. 500, రూ. 2వేల కొత్త కరెన్సీ నోట్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ. 2వేల నోటును అందుబాటులోకి తేవటంతో ఉన్న నోట్లు చెల్లకపోయే, ఉన్న రూ. 2వేల నోటుకు చిల్లర దొరక్క సామాన్యులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. పెద్ద నోట్లు రద్దయి చిల్లర కోసం ప్రజలు అనేక కష్టాలు పడుతున్న 17 రోజుల తర్వాత గురువారం నగరంలోని పలు ఏటిఎంలలో రూ. 500 నోటు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇక త్వరలోనే తమకున్న చిల్లర కష్టాలు కొంత వరకైనా తగ్గుతాయన్న ఆశలు ప్రజల్లో చిగురించాయి. పెట్రోలు బంకులు, ఆసుపత్రులు, మెడికల్ షాపులు, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో రద్దయిన వెయ్యి, 500నోట్ల చెలామణికి గురువారంతో గడువు ముగియనుండటంతో బ్యాంకుల్లో రికార్డు స్థాయిలో ఖాతాదారులు క్యూ కట్టారు. గురువారం వివిధ బ్యాంకుల్లో జరిగిన లావాదేవీల్లో గురువారం జమా ఖాతాలు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఏటిఎంలలో రూ. 500 కొత్త నోటు అందుబాటులో ఉందన్న సమాచారం తెలియటంతో నిన్నమొన్నటి వరకు ఔట్ ఆఫ్ సర్వీస్ బోర్డులతో దర్శనమిచ్చిన ఎంపిక చేసిన ఏటిఎంల వద్ధ జనం క్యూ కట్టారు. చిల్లర కోసం ప్రజలు పడుతున్న కష్టాలను నివారించేందుకు రూ. వంద కోట్ల విలువైన 500 కరెన్సీ నోట్లు బుధవారం రాత్రి రిజర్వు బ్యాంకు రాగానే, వివిధ జాతీయ బ్యాంకుల అధికారులు వాటిని ఎంపిక చేసిన ఏటిఎంలలో ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఈ కొత్త నోటును విత్ డ్రా చేసుకునేందుకు హిమాయత్‌నగర్, గచ్చిబౌలీ, అమీర్‌పేట, సికిందరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఏటిఎంల ముందు ప్రజలు గంటల తరబడి నిరీక్షించారు. కానీ ఇప్పటికే కేంద్రం అందుబాటులోకి తెచ్చిన రెండు వేల నోటుపై అనుకూలం కన్నా ప్రతికూలంగా ప్రజల్లో అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తం కాగా, కొత్తగా అందుబాటులోకి వచ్చిన రూ. 500 నోటుపై ఖాతాదారులు, సామాన్యులు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చెలామణిలో ఉన్న వంద నోట్లు అవసరానికి తగిన విధంగా అందుబాటులో లేకపోవటం, అలాగే ఇప్పటి వరకు ఏటిఎంలలో రూ. 2వేల నోటు మాత్రమే అందుబాటులో ఉండటంతో చిల్లర కోసం ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయని, ఈ క్రమంలో 500 నోటు అందుబాటులోకి రావటంతో కష్టాలు కొంత మేరకైనా తగ్గుముఖం పడుతాయని ప్రజలు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన ఈ నెల 8వ తేదీ తర్వాత రూ. 2వేల నోటు స్థానంలో రూ. 500 నోటును ప్రజలకు అందుబాటులో ఉంచితే చిల్లర ఇబ్బందులు కొంత వరకు తగ్గేవని కొందరు ఖాతాదారులు వ్యాఖ్యానించారు.