హైదరాబాద్

ఆగిన అభివృద్ధి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: జంటనగరాల్లోని సుమారు కోటి మంది జనాభాకు అత్యవసర, అతి ముఖ్యమైన సేవలందించే జిహెచ్‌ఎంసిలో స్తబ్దత నెలకొంది. ముఖ్యంగా జిహెచ్‌ఎంసిని గత కొంతకాలంగా నిధులు, సిబ్బంది కొరత పట్టి పీడిస్తుండటంతో ఇప్పటికే ప్రతిపాదించిన, కొత్తగా రూపకల్పన చేసిన అభివృద్ధి పనుల ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కేవలం నిరంతరంగా అందించే పౌరసేవలు, స్వచ్ఛ భారత్ పనులు మినహా పెద్దగా ప్రాజెక్టు పనులు కొనసాగటం లేదు. ఇందులో భాగంగా పౌరసేవల నిర్వహణతో పాటు సమాజసేవలో తనవంతు పాత్ర పోషిస్తూ జిహెచ్‌ఎంసి ప్రతిరోజు మధ్యాహ్నం పంపిణీ చేస్తున్న రూ. 5 సబ్సిడీ ఆహార పథకం కూడా కాలక్రమేనా ఆర్థికంగా భారమవుతోంది. పరిపాలన సౌలభ్యం సర్కిళ్లను 30కి పెంచుకున్నా, ఇంకా చాలా సర్కిళ్లలో సిబ్బంది కొరత కారణంగా పరిపాలన గాడీన పడలేదు. కేవలం కార్పొరేషన్‌కు ఆదాయాన్ని సమకూర్చే పనిలో అధికారులున్నారని చెప్పవచ్చు. అందుకే రెవెన్యూ వచ్చే ప్రతి మార్గాన్ని ఎంతో చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ ఇటీవలే చేపట్టిన ఎస్‌ఆర్‌డిపి పనులు, అలాగే చెత్త రవాణా వికేంద్రీకరణ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ప్రతి రూ. 281 కోట్లు ఆర్టీసికి చెల్లిస్తూ వస్తుండటంతో ప్రస్తుతం ఖజానా ఖాళీ అయ్యింది. కేవలం మెయింటనైన్ పనులు మినహా పెద్దగా అభివృద్ది పనులు కూడా ముందుకు సాగటం లేదు. ఉన్న నిధులతో చేపట్టదలిచిన స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి) కింద నిర్మించనున్న మల్టీలేవెల్ ఫ్లై ఓవర్లు, స్కైవేలు, గ్రేడ్ సపరేటర్లకు సైతం ప్రతిపాదనల స్థాయి నుంచే అడ్డంకులెదురవుతున్నాయి. కెబిఆర్ పార్కు చుట్టూ చేపట్టాల్సిన పనులకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు పెండింగ్‌లో ఉండగా, ఇదే ప్రాజెక్టులో భాగంగా ఓవైసీ ఆసుపత్రి వద్ద చేపట్టనున్న పనులకు మజ్లిస్ పార్టీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తంచ చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు కారణంగా ఈ నెల 9వ తేదీ నుంచి 24వ తేదీ అర్థరాత్రి వరకు జిహెచ్‌ఎంసికి సుమారు రూ. 240 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఇందులోనూ అధికారులు ఆశించిన స్థాయిలో లే అవుట్ రెగ్యులరైజేషన్ ఛార్జీలు చెల్లించేందుకు దరఖాస్తుదారులు ముందుకు రాలేదు. వసూళ్లలో సింహభాగం ఆస్తిపన్ను వసూలు, అందులో వర్తమాన సంవత్సరానికి సంబంధించిన బకాయిలే ఉన్నట్లు సమాచారం. అంటే రానున్న ఫిబ్రవరి, మార్చి మాసాల్లో చేయాల్సిన ఆస్తిపన్ను కలెక్షన్ కొంత వరకు తగ్గుతుందని చెప్పవచ్చు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో రూ. 1500 కోట్ల ఆస్తిపన్ను కలెక్షన్‌ను వసూలుగా పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ. 575 కోట్ల వరకు ఆస్తిపన్ను వసూలైంది. మిగిలిన మరో నాలుగు నెలల్లో లక్ష్యానికి తగిన విధంగా రూ. 925 కోట్ల ఆస్తిపన్ను వసూలవుతుందా? అన్న అనుమానం నెలకొంది.