హైదరాబాద్

త్వరలో రూ. 5 కోట్లతో మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 26: సనత్‌నగర్ నియోజకవర్గంలోని ప్రజల కోరిక మేరకు సనత్‌నగర్ వెల్ఫేర్ కేంద్రం ప్రాంగణంలో మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్సును నిర్మించనున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. ఇందుకు రూ. 5 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిందని కూడా ఆయన తెలిపారు.
నియోజకవర్గంలోని సనత్‌నగర్ వెల్ఫేర్ సెంటర్, దాసరంబస్తీ, రాజరాజేశ్వరినగర్, బల్కంటపేట తదితర ప్రాంతాల్లో మంత్రి పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెల్సుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ వెల్ఫేర్ సెంటర్‌కు సంబంధించిన ఖాళీ స్థలంలో అత్యాధునిక క్రీడా సదుపాయాలతో కూడిన స్పోర్ట్స్ కాంప్లెక్సును నిర్మించేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకై మైదానంలో గల శిథిల భవనాన్ని పూర్తిగా తొలగించేందుకు కార్మిక శాఖ మంత్రితో త్వరలోనే చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. సనత్‌నగర్ వాసులు ముఖ్యంగా యువత పలు క్రీడాంశాల్లో శిక్షణ పొంది, తద్వారా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా ఈ క్రీడా కాంప్లెక్సును తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వెల్ఫేర్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో గల రాజరాజేశ్వరినగర్ బస్తీని క్రమబద్దీకరించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత దాసరం బస్తీని సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెల్సుకున్నారు.
అక్కడ తాగునీరు, టాయిలెట్ల సమస్యలపై జిహెచ్‌ఎంసి, వాటర్ బోర్డు అధికారులతో చర్చించారు. బస్తీలోని ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
ఈ ఇళ్లలో కొద్దిపాటి స్థలాన్ని కేటాయిస్తే వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించేందుకు జిహెచ్‌ఎంసి ముందుకొస్తుందని ఆయన వివరించారు. బల్కంపేట స్మశానవాటికను సందర్శించి, అందులోని వసతులపై సమీక్షించారు. ఈ స్మశానవాటికను మహాప్రస్థానం మాదిరిగా అత్యాధునికంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన కార్యచరణను సిద్దం చేయాలని జిహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఫతేనగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద నుంచి వైట్ టాపింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికను రూపొందించాలన్నారు. ముఖ్యంగా సనత్‌నగర్‌లోని దాసరం, అల్లాద్దిన్, జెట్‌కాలనీ తదితర బస్తీలో వాసులు సులువుగా, త్వరితగతిన గమ్యస్థానం చేరుకునేందుకు వీలుగా ఫ్లైఓవర్ కింద బాగాన గల రోడ్డును విస్త్రృత పరిచేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ ప్రక్రియలో అవసరమైతే నష్టపరిహారం కూడా చెల్లిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కార్పొరేటర్లు శేషుకుమారి, లక్ష్మిబాల్‌రెడ్డి, కార్మిక శాఖ కమిషనర్ మదీమ్ నాయక్, జాయింట్ కమిషనర్ గంగాధర్, జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ రవికిరణ్, జలమండలి ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.