హైదరాబాద్

వణికిస్తున్న చలి పులి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: రాజధాని శివారు ప్రాంతాల్లో గత నాలుగైదు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. పగటిపూట ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. రాత్రిపూట మాత్రం చలి వణికిస్తోంది. పగటిపూట ఉష్ణోగ్రత గరిష్టంగా 31 డిగ్రీలు నమోదవుతుండగా, రాత్రివేల 16 డిగ్రీలుగా నమోదవుతోంది. వారం రోజుల తర్వాత గరిష్ట ఉష్ణోగ్రత 30, కనిష్టంగా 18 డిగ్రీలుగా నమోదు కావచ్చని పరిశీలకుల అంచనా. అనంతగిరి కొండలు, అటవీ ప్రాంతం వికారాబాద్ పట్టణానికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో మామాలు సమయంలోనే చలి ఇక్కడ ఎక్కువగానే ఉంటుంది. దీనికి తోడు ఈ సంవత్సరం వర్షాకాలంలో ఊహించిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. నీటివనరులు సామర్థ్యానికి మించి నిండుగా ఉండటంతో శీతాకాలంలో చలి తీవ్రత పెరిగింది. శీతాకాలం చలి నుండి చర్మాన్ని రక్షించుకునేందుకు ఉన్ని దుస్తులు ధరిస్తున్న ఇక్కడి ప్రజలు వాజులైన్, కోల్డ్‌క్రీం, బాడీలోషన్‌లు వాడుతున్నారు. చలి కారణంగా ఇళ్ళ నుండి ఆలస్యంగా బయటకు వస్తున్న జనం, సూర్యాస్తమయం కాగానే ఇళ్ళకు చేరుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయట తిరిగేవారు వేడివేడి బజ్జీలు, చాట్‌బండ్ల వద్ద, టీస్టాళ్ళ వద్ద బారులుతీరి ఉపశమనం పొందుతున్నారు. శీతలపానీయాలు, ఐస్‌క్రీం పార్లర్లలో వ్యాపార లావాదేవీలు తగ్గాయి.

నోట్ల రద్దును సమర్థిస్తూ భారీ ర్యాలీ

ముషీరాబాద్, నవంబర్ 27: ప్రధాని నరేంద్రమోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న చర్య విప్లవాత్మకమని బిసి సంక్షేమ సంఘం జాతీయ ఆధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. దేశంలో నల్లధనాన్ని, దొంగ నోట్లను అరికట్టడానికి పెద్ద నోట్ల రద్దుతో పాటు మరిన్ని ఇతర చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద నిర్వహించిన ర్యాలీ, ప్రదర్శనకు కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నల్లధనాన్ని, దొంగనోట్లను, అవినీతిని అరికట్టాలని, దేశాన్ని అగ్రదేశంగా తీర్చిదిద్దాలని, ప్రధాని మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఇరుగు, పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్థాన్ విచ్చలవిడిగా దొంగనోట్లను ప్రింట్ చేసి మన దేశంలో వెదజల్లుతూ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారని విమర్శించారు. పైగా తీవ్రవాదం- ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే మన దేశంలో నల్లదనం, దొంగనోట్ల వల్లదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని వాపోయారు. నోట్ల మార్పిడి వల్ల ప్రభుత్వానికి ఆదాయపన్ను రూపంగా వచ్చే ఈ మొత్తాన్ని ప్రజల జన్‌ధన్ ఖాతాలో జమచేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బిసి సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, సి.రాజేందర్, కుల్కచర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.