హైదరాబాద్

ప్రజావాణి విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 28: ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి సత్వరమే పరిష్కారం చేసే దిశగా అధికారులు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ అన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో ఇందిరమ్మ ఇళ్ల పేమెంట్, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్ల కేటాయింపులు, పెన్షన్‌లు, భూ సమస్యలు, ఆహార భద్రత కార్డులు, రుణ మంజూరు తదితర అంశాల పై 27 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణిలో జిల్లా రెవెన్యూ అధికారి భవాని శంకర్, జిల్లా పరిషత్ సిఇఓ రమణారెడ్డి, సిపిఓ వైవి శర్మ, వివిధ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అర్హులకు పథక మొత్తాలు చెల్లించండి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంకు నిధులు మంజూరు చేసినందున అర్హులైన వారికి వెంటనే చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అన్నారు. సోమవారం జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకంకు నిధులు మంజూరు చేసినందున దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వారికి ఈ వారంలోపు చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశించారు. మూడవ విడతగా మంజూరైన రైతుల రుణమాఫీ డబ్బులు వారి ఖాతాలలో జమ అయ్యేటట్లు చూడాలని మండల వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. గత మంగళవారం ఓఎస్‌డిలు నిర్వహించిన మండల మీటింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. చెరువులకు చేయవలసిన జియో ట్యాగింగ్ వివరాలను ఇరిగేషన్ ఇఇని అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు సంబంధించి 2,200 ట్యాంకులకు శనివారం లోపల జియో ట్యాగింగ్ చేస్తారని ఇరిగేషన్ ఇఇ తెలిపారు. గ్రామాలలో ఎంపి ల్యాడ్స్, సిడిఎఫ్, ఎస్‌డిఎఫ్ మొదలగు నిధులతో చేపట్టిన పనులు ఒక్కొక్క పని ఏ దశలో ఉన్నాయో పరిశీలించాలని ఓఎస్‌డిలను ఆదేశించారు. మిషన్ కాకతీయ మొదటి రెండవ విడతల కింద మంజూరైన పనులు, ఇప్పటి వరకు పూర్తయినని, ఇంకా పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలు తెలపాలని సూచించారు. ప్రతి మండలంలో రైతులకు పాలి హౌస్ క్రింద మంజూరు చేసిన నిధుల వివరాలు తెలపాలని జిల్లా ఉద్యానవన శాఖాధికారికి సూచించారు. అంగన్‌వాడి బిల్డింగ్‌లు, పాఠశాల భవనాల పనులు ఏ దశలో ఉన్నవి అన్న విషయాల పై సమగ్ర నివేదిక అందించాలని పంచాయతీరాజ్ ఇఇకి సూచించారు. అదేవిధంగా హరితహారంలో నాటేందుకు కావాల్సిన మొక్కలకు నర్సరీల పెంపకం, నాటిన మొక్కలు, వాటి సంరక్షణ వివరాలు తెలియచేయాలని అటవీ శాఖ అధికారికి చెప్పారు. రైతులకు విద్యుత్ కనెక్షన్‌లు ఇవ్వదలచినందున సంబంధిత తహసీల్దార్‌లు, ట్రాన్స్‌కో ఎఇలు సర్ట్ఫికెట్‌లు జారీ చేసి వారికి కనెక్షన్‌లు త్వరగా ఇవ్వాలని సూచించారు. ఆసరా పెన్షన్‌లు బ్యాంకులు, పోస్ట్ఫాసులు మరియు ముఖ్యంగా మన్వూల్ ద్వారా చేసే చెల్లింపులు సక్రమంగా జరిగేలా చూడాలని ఓఎస్‌డిలకు సూచించారు. సమావేశంలో జెడ్‌పి సిఇఓ రమణారెడ్డి, సిపిఓ వైవి శర్మ, జిల్లా వ్యవసాయశాఖాధికారి జగదీశ్, డిపిఓ పద్మజా, ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీరాజ్ ఇఇలు, జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.