హైదరాబాద్

నగర శివారు ప్రాజెక్ట్‌లపై జలమండలి సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 28: నగరశివారు ప్రాంతాల్లో చేపడుతున్న తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ పనులను సకాలంలో పూర్తి చేయాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ అదేశించారు.
నగరశివారు ప్రాంతంలో మంచినీటి వ్యవస్థను మెరుగు పర్చేందుకు ప్రభుత్వం రూ.1900 కోట్ల హడ్కో నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై జలమండలి ఎండి సోమవారం సాయంత్రం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ప్రాజెక్ట్, మెయింటనెన్స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శివారు ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలని జనరల్ మేనేజర్లను ఎండి అదేశించారు. రిజర్వాయర్ ఇన్‌లెట్, ఔట్‌లెట్ పనులతో పాటు 2500 కి.మీటర్ల పైప్‌లైన్ విస్తరణ పనులు, రోడ్ల తవ్వకాలకు అనుమతులు, రోట్ల మరమ్మతు పనులు నిర్దేశిత సమయం లోపు పూర్తి చేయాలని సూచించారు. భారీ నిర్మాణ పనులు పురోగతిని రోజూ వారీగా సమీక్షించి, పనులు వేగంగా జరిగేందుకు ప్రణాళికలు రూపొందించాలని జనరల్ మేనేజర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎమ్.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.ఎల్లస్వామి, రెవెన్యూ డైరెక్టర్ డి.శ్రీ్ధర్‌బాబు, మెయింటనెన్స్, ప్రాజెక్ట్ విభాగం సిజిఎం, జిఎంలు పాల్గొన్నారు.

ధర్మయుద్ధం దళితుల సభ కాదు : పిడమర్తి

సికిందరాబాద్, నవంబర్ 28: ఎమ్మార్పీఎస్ నిర్వహించింది మాదిగల సభ కాదని అది కేవలం అగ్రకులాల సభ మాత్రమేనని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మయుద్ధం మహాసభను ఉద్దేశించి సోమవారం పిడమర్తి రవి విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందక్రిష్ణ మాదిగ చేస్తున్న ఆందోళన వర్గీకరణ వల్ల తెలంగాణ మాదిగలకు ఒరిగేది ఒనగూరేది ఏమీ లేదని దీనివల్ల కేవలం ఆంధ్ర ప్రాంతానికి చెందిన మాదిగలకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అదేవిధంగా వెంకయ్యనాయుడు కొత్తగా ఈ సభలో చెప్పింది ఏమీ లేదని, ఢిల్లీ జంతర్‌మంతర్ దగ్గర చెప్పిన హామీనే మరోసారి చెప్పారని అన్నారు. ఇందుకు ధర్మయుద్ధం దేనికని అన్నారు. ఒకవేళ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వర్గీకరణ బిల్లుకు ఆమోదం ప్రకటిస్తే ఆచరణలో పెడితే సరిపోతుందని, కాని మరోసారి యుద్ధం చేసి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అదే సమయంలో సభా వేదికపై ఉన్నవారిలో ఉద్యమంలో పాలుపంచుకున్న దళితులు ఎంతమంది ఉన్నారో వివరించాలన్నారు. కేవలం తెరాస ప్రభుత్వంపై అక్కసును వెళ్లగక్కడానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వ వ్యతిరేక సభగా ఉందన్నారు. వచ్చిన అగ్రకుల నేతలు వర్గీకరణకు తాము ఏమిచేస్తున్నామో చెప్పకుండా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం వారిలోని అసహనానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో తమ ఉనికిని కోల్పోతున్నామన్న ఆక్కసులో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సందర్భం లేకుండానే ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం పరిపాటిగా మారిందన్నారు. తెలంగాణలో వర్గీకరణతో ఒరిగేది ఏమీలేదని పిడమర్తి తెలిపారు. దేశంలో దళితులపై పెరిగిపోతున్న దాడులను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దళితులకు తాము దగ్గర అన్నట్లు ఒక మాదిగనేతను దగ్గర పెట్టుకుని ఆడుతున్న నాటకాల్లో భాగమే తప్ప దళితులపై ప్రేమకాదని అన్నారు. ముందు దళితులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులను అరికట్టడానికి ఏమి చర్యలు తీసుకుంటున్నారో వివరించలేదని తెలిపారు. ఈ ధర్మయుద్ధం సభ కేవలం అగ్రకులాల సభ మాత్రమేనని, దీనివల్ల దళితులకు జరిగే లాభం ఏమీలేదని, దళితులను మభ్యపెట్టే కార్యక్రమంలో భాగమేతప్ప మరోటికాదని పిడమర్తిరవి పేర్కొన్నారు.