హైదరాబాద్

హైదరాబాద్ అభివృద్ధి ఘనత ఎన్‌డిఏదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, జనవరి 30: హైదరాబాద్ నగరం అభివృద్ధిలో నాటి ఎన్‌డిఏ ప్రభుత్వ సహాయం ఉందని, విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే ప్రస్తుతం కేంద్రం సహాయం అవసరమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అల్వాల్ మన్సిపల్ పరిధిలోని కానాజిగూడ ఎన్నికలప్రచారంలో మాట్లాడారు. హైదారాబాద్ నగర అభివృద్ధిలో ఎన్‌డిఏ ప్రభుత్వం భాగస్వామ్యం ఉందని, ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణం, మెట్రోరైల్ ఏర్పాటు, బిజినెస్ స్కూల్, ఫ్లైఓవర్ల నిర్మాణం, రింగ్ రోడ్డుల ఏర్పాటు, శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేశారన్నారు. 60 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏమీ లేదని, ఎన్‌డిఏ ప్రభుత్వంలో ఎన్నో రకాల సంస్కరణలు తీసుకువచ్చామని, తర్వాత ప్రస్తుతం నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అతివేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచదేశాలు భారతదేశం వైపుచూస్తున్నాయని ఆయన చెప్పారు. దేశాన్ని ముందుకు తీసుకుపోవటానికి 100 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చెయ్యాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిర్ణయించారని, అందులో 20 నగరాలను ఎంపిక చేశామని, నేషనల్ హైవేలు దేశం అంతటా ఏర్పాటు చేశామని చెప్పారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని దారులన్నీ నాలుగు లైన్‌ల రోడ్లు వేయటానికి 49వేల కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసిందని వివరించారు. ఎప్‌డిఐల ద్వారా దేశంలో కొత్తకొత్త పరిశ్రమలు వస్తున్నాయని, ప్రపంచదేశాల్లోని వ్యాపారవేత్తలు భారతదేశం వైపు చూస్తున్నారని తెలిపారు. కొత్త పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఐటి పరిశ్రమలు వస్తేబ్యూటీ తర్వాత మైటీ వస్తుందని వెంకయ్యనాయుడు చమత్కరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతోందని, అందులో భాగంగా ప్రతి వ్యక్తి అత్మగౌరవంతోబతకాలని వారికి అటల్ పెన్‌షన్ పథకం, జన్‌ధన్ యోజన ద్వారా ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు తెరిచి రికార్డు సృష్టించారని, వారికి తిరిగి వారికి ముద్ర పథకం ద్వారా 50 వేల రూపాయల రుణం మంజూరు చేస్తున్నారని వివరించారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి - దేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అల్వాల్ వెంకటాపురం డివిజన్‌లో ఎంసి జగదీష్, అల్వాల్‌లో సౌజన్య, మచ్చబొల్లారంలో చిట్టిబాబులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు చామకూర మల్లారెడ్డి, హైదరాబాద్ శాసనమండలి సభ్యుడు రాంచందర్‌రావు, బిజెపి నాయకులు అరుల్‌రాజ్, స్వచ్ఛ్భారత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామనాథ్, మాజీ శాసనసభ్యుడు ఏండల లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్‌లు మాధవ్, కృష్ణారెడ్డి, రంగారెడ్డిజిల్లా అర్బన్ కార్యదర్శి దండుగుల వెంకటేష్ తోపాటు బిజెపి, తెలుగు దేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్‌ది కుటుంబ పాలన: రేవంత్‌రెడ్డి
వనస్థలిపురం, జనవరి 30: తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీ కుటుంబ పాలనను కొనసాగిస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తుందని టిడిపి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఎల్‌బి.నగర్ నియోజకవర్గంలో రోడ్డు షో నిర్వహించారు. నాగోలు అభ్యర్ధి చింతల అరుణా సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నాగోలు, ఆనంద్‌నగర్ చౌరస్తాలో ప్రసంగించగా మహిళలు రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. మన్సురాబాద్ డివిజన్‌లో టిడిపి అభ్యర్ధి కె.నర్సింహారెడ్డి, హయత్‌నగర్ డివిజన్‌లో బిజెపి అభ్యర్ధి కె.రవీందర్‌రెడ్డికి, బిఎన్.రెడ్డినగర్ డివిజన్ టిడిపి అభ్యర్ధి కె.అరవిందరెడ్డి, వనస్థలిపురం డివిజన్ టిడిపి అభ్యర్ధి సామ ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ఆయా డివిజన్‌లలో జరిగిన సభల్లో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. దొరలపాలన చేస్తున్న టిఆర్‌ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా వున్నారని అన్నారు. ఎల్‌బినగర్ నియోజకవర్గంలో టిడిపి-బిజెపి 11 సీట్లు దక్కించుకుని మేయర్ పదవిని పొందడం ఖాయమన్నారు. టిడిపి సమన్వయకర్త సామ రంగారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.
నాగోలు డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి చెర్కు సంగీత ప్రశాంత్‌గౌడ్ అధిక మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్సీ కె.ప్రభాకర్, మల్లేశం ధీమా వ్యక్తం చేసారు. ప్రభుత్వ పథకాలే పార్టీకి ఓట్లు వేసి గెలిపస్తాయని అన్నారు. టిడిపి, కాంగ్రెస్ పార్టీల డిపాజిట్లు గల్లవంతవడం ఖాయమన్నారు.
బిజెపి టిడిపి మిత్రపక్షాల కూటమి విజయం ఖాయం
బిజెపి టిడిపి మిత్రపక్షాల కూటమి గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమని బిజెపి రాష్ట్ర నేత, మాజీ మంత్రి నాగం జనార్ధర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. శనివారం డివిజన్‌లో బిజెపి అభ్యర్ధి వి.శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో మాట్లాడుతూ, ఉద్యమ నేతలను కాదని ధన బలంతో పక్క పార్టీల నుంచి వచ్చినవారికి టిఆర్‌ఎస్ టికెట్లు ఇచ్చిందన్నారు. ఆచరణలో సాధ్యంకాని హామీలను ఇస్తున్న ఆ పార్టీకి ఓటర్లు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
జిట్టా పాదయాత్ర
వనస్థలిపురం డివిజన్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్ధి జిట్టా రాజశేఖర్‌రెడ్డి మెజారిటీతో గెలిచి మేయర్ పదవి పొందడం ఖాయమని అచ్చంపేట ఎమ్మెల్యే జి.బాల్‌రాజ్ ధీమా వ్యక్తం చేసారు. డివిజన్ పరిధిలోని కాలనీలలో పాదయాత్ర చేసి ప్రచారం చేసారు. సమస్యలు పరిష్కరించే రాజశేఖర్‌రెడ్డిని గెలిపించడానికి సిద్ధంగా వున్నారని అన్నారు.
మన్సురాబాద్ డివిజన్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్ధి కె.విఠల్‌రెడ్డి పలు కాలనీలలో పాదయాత్రలు నిర్వహించి ప్రచారం చేసారు. అనంతరం కెసిఆర్ సభకు నేతలు తరలి వెళ్లారు.
డిసిసి కార్యదర్శి పాదయాత్ర
నాగోలు డివిజన్ కాంగ్రెస్ అభ్యర్ధి ఎ.పుష్పలతారెడ్డిని గెలిపించాలని కోరుతూ డిసిసి కార్యదర్శి ఎ.రాజిరెడ్డి పలు కాలనీలలో పాదయాత్రలు చేసి ప్రచారం చేసారు. డి.సుధీర్‌రెడ్డి అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని, పుష్పలతను గెలిపించాలని కోరారు. పి.చంద్రారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.
వనస్థలిపురం డివిజన్‌లో టిడిపి, టిఆర్‌ఎస్‌లను ఓడించడానికి ఓటర్లు సిద్ధంగా వున్నారని కాంగ్రెస్ అభ్యర్ధి మహేష్ యాదవ్ అన్నారు. డివిజన్‌ను అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.
సిఎంల లోపాయికారి ఒప్పందం: గుత్తా
ఇరు రాష్ట్రాల సిఎంలు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని నల్లగొండ ఎం.పి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు.
శనివారం మన్సురాబాద్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్ధి జె.ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం, ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, ఎల్‌బినగర్‌లో 11 సీట్లు గెలుచుకుని మేయర్ పదవి దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేసారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.