హైదరాబాద్

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: నగదరు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలు, భూసేకరణ, హరితహారంపై వీడియో కాన్ఫరెన్స్‌ను మంగళవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్లతో సమీక్షిస్తూ బ్యాంకులలో అవసరం మేరకు డబ్బు లేనందున ప్రజలు ఇబ్బందులు పడకుండా వారికి నగదు రహిత లావాదేవీలు నిర్వహించేలా అవగాహన కల్పించాలని సూచించారు. స్మార్ట్ ఫోన్లు, పేటిఎంలు, మీ-సేవా కేంద్రా ద్వారా ఆన్‌లైన్ నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ బ్యాంకుల్లో డబ్బు కొరతతో ఉపాధి హమీ కూలీలకు, ఆసరా పెన్షన్లు చెల్లించడం కష్టతరమవుతుందని అన్నారు. ప్రజలు ఇబ్బందుల పడకుండా అవసరమైన డబ్బు ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హరితహారం సంబంధించి కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం నాటాల్సిన మొక్కలకు నర్సరీ పెంచామని, నాటిన మొక్కలను జియో ట్యాగింగ్ చేయడం, వాటి సంరక్షణ చర్యలు చేపట్టామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్, హరితహారం ప్రత్యేక అధికారి శోభ, జిల్లా అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్ అండర్-16 స్టేట్ క్రికెట్ జట్టుకు ఎంపికైన స్కూలు విద్యార్థులు

హైదరాబాద్, నవంబర్ 29: కర్నాటకలోని షీమోగలో జరుగనున్న అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న హైదరాబాద్ జట్టుకు రిజయసత్‌నగర్‌లోని క్రిసెంట్ మోడల్ స్కూల్ విద్యార్థులు ఎన్.్ఠకుర్‌తిలక్ వర్మ, టి.రోహన్ ఎంపికయ్యారు. డిసెంబర్ 1నుంచి 22వరకు జరుగనున్న విజయ్ మర్చంట్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే అండర్-16 హైదరాబాద్ క్రికెట్ జట్టును హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రకటించింది. హైదరాబాద్ జట్టుకు ఎంపికైన ఠాకూర్‌తిలక్ వర్మ, రోహన్‌ను క్రిసెంట్ మోడల్ ఇంగ్లీష్ స్కూల్‌లో ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా క్రిసెంట్ మోడల్ స్కూల్ డైరెక్టర్ షామ్స్‌జాబీన్ విచ్చేసి విద్యార్థులను సత్కరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఫహిముద్దిన్ ఖాజా, క్రికెట్ కోచ్ సలామ్‌బాష్ పాల్గొన్నారు. ఇటీవల కాలంలో జరిగిన హైదరాబాద్ క్రికెట్ సీజన్‌లో ఠాకుర్‌తిలక్ వర్మ, రోహన్ అద్భుతంగా రాణించి పలువురిని ఆకట్టుకున్నారు. రోహన్ 14 ఏళ్ల ప్రాయంలోనే అండర్-19 హెచ్‌సిఎ ఎడ్డీఅయిబారా టోర్నమెంట్, అండర్-16 దయానంద్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొని ఏడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలతో మొత్తం 1431 పరుగులు చేసి ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. హెచ్‌సి ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్‌లో బ్రదర్స్ ఎలెవెన్ జట్టు తరపున పాల్గొన్నాడు. దక్షిణ మండలం ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్‌లో 2014-15, 2015-16 సంవత్సరానికి హైదరాబాద్ స్టేట్ అండర్-14 జట్టుకు ఠాకుర్‌తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు. దక్షిణ మండలం ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఉత్తమ కెప్టెన్, ఉత్తమ ఫిల్డర్‌తో పాటు బ్యాట్స్‌మెన్ అవార్డులు అందుకున్నాడు. టి.రోహన్.. సీజన్‌లో 28 వికెట్లు తీసుకోవడంతో పాటు బ్యాటింగ్‌లో రాణించి 507 పరుగులు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు.