హైదరాబాద్

శరవేగంగా రోడ్ల నిర్మాణ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న నగరంలోని రోడ్లను పునఃనిర్మించేందుకు జిహెచ్‌ఎంసి చేపట్టిన కార్యాచరణ శరవేగంగా ముందుకు సాగుతుంది. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలతో గ్రేటర్ పరిధిలో సుమారు 180 కిలో మీటర్ల రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోడ్ల పునఃనిర్మాణ పనులకు జిహెచ్‌ఎంసి రూ.75కోట్లను ప్రత్యేకంగా కేటాయించింది. ఈ నిధులతో ప్రస్తుతం 33.93కోట్ల వ్యయంతో 251 పనులు పూర్తి అయ్యాయి. రూ.11.32కోట్ల వ్యయంతో మరో 55 రోడ్ల పునఃనిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 489 రోడ్ల నిర్మాణ పనుల్లో 404 బీటీ రోడ్లు, 69 సీసీ రోడ్లు, 16 పవర్ బ్లాక్ రోడ్లు ఉన్నాయి. రోడ్ల నిర్మాణ పనుల నాణ్యత ప్రమాణాలను జిహెచ్‌ఎంసి క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లతో పాటు థర్డ్‌పార్టీ ఇంజనీర్లు, ఓయూ, జెఎన్‌టియూ, ఐఐఐటి ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన సీనియర్ ప్రొఫెసర్లచే జిహెచ్‌ఎంసి ఆకస్మిక తనిఖీలను కూడా నిర్వహిస్తుంది. రోడ్ల నిర్మాణ పనులు అధిక శాతం రాత్రివేళల్లోనే చేపట్టాల్సి ఉన్నందున ప్రతీ రోజు అదనపు లేబర్, యంత్రాలతో ముమ్మరంగా పనులను కొనసాగిస్తున్నారు. ప్రధాన రహదారులను ముందుగా చేపట్టి అనంతరం అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు జిహెచ్‌ఎంసి ప్రాధాన్యతనిస్తుంది. గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జిహెచ్‌ఎంసి కమిషనర్ డాక్టర్ బి.జనార్ధన్ రెడ్డి.. రోడ్ల నిర్మాణ పనుల నాణ్యతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు, నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.