కృష్ణ

వెయ్యి కోట్లతో ఎస్సీ గురుకులాల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 30: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన ఉత్తమ విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలన చేపట్టి రూ. 1000 కోట్లతో గురుకుల భవనాలను నిర్మిస్తూ ముందుకు సాగుతోందని సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్ తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఎపిఇడబ్ల్యుఐడిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి సచివాలయంలో తన కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆలోచనల మేరకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిని మించిన నాణ్యమైన విద్యను అందించేందుకు పలు ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళుతున్నామని అందులో భాగంగా వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులను దశలవారీగా గురుకులాల్లోకి మార్చే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని మంత్రి తెలిపారు. గురుకులాల్లోకి మార్చాలంటే ఉన్న గురుకులాల్లో అదనపు తరగతిగదులు, అదనపు సౌకర్యాలు మరికొన్ని కొత్త గురుకులాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్న దృష్ట్యా నాబార్డు సాయంతో కొత్తగా 5 గురుకులాలను రూ.21కోట్ల ఖర్చుతో రూ.1000 మంది విద్యార్థులు చదువుకునే వీలుగా నిర్మాణాలు చేపట్టడం జరిగిందని వాటిని గుంటూరు జిల్లా యడ్లపాడు, ప్రకాశం జిల్లా కురిచేడు, కడప జిల్లా బి మఠం, పశ్చిమగోదావరి జిల్లా అరుగోలను, అనంతపురం జిల్లా రొల్లలో నిర్మిస్తున్నామని మరో 3 గురుకులాలను తుని, హిందుపురం, సత్తెనపల్లిలోనూ నిర్మించేందుకు అనుమతులు మంజూరు అయ్యాయని మంత్రి తెలిపారు. అంతేగాక రూ. 25 కోట్ల ఖర్చుతో ఆదర్శమోడల్ స్కూల్‌ను గతంలో ఎన్నడూలేని విధంగా కుప్పం నియోజకవర్గంలో నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉన్న 138 గురుకులాల్లో అదనపు వౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ 71 గురుకులాల్లో అదనపు తరగతులు, డార్మెటరీలు నిర్మిస్తున్నామని మరో 20 రెసిడెన్షియల్ స్కూళ్లు సబ్‌ప్లాన్ నిధులతో నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఈ విధంగా గురుకులాలను నిర్మించి ఎస్సీ విద్యార్థులకు మంచి భవనాలు, మంచి మంచి సదుపాయాలతోపాటు కంప్యూటర్ విద్య, ఆడిటోరియం, సుశిక్షుతులైన అధ్యాపకులచే బోధన, శిక్షణలతో కూడిన పాటు పర్యవేక్షణ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న గురుకుల భవనాలను మూస పద్ధతిలో కాకుండా ఆధునిక టెక్నాలజీతో త్వరితగతిన నాణ్యతతో నిర్మించాలని అలా నిర్మించే కాంట్రాక్టర్లకు అవసరమైతే ప్రోత్సాహకాలను ఇవ్వాలని మంత్రి కోరారు. నిర్మాణంలో ఉన్న భవనాలను వచ్చే విద్యా సంవత్సరం మే నెల కల్లా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని లేకుంటే మరో సంవత్సరం పాటు విద్యార్థులు ప్రైవేట్ భవనాల్లో సౌకర్యాల లేమితో చదువుకోవాల్సి వస్తుందని దాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. మరమ్మతులున్న భవనాలను వాటిని పూర్తి చేసి భవనాలను రంగులు వేయించి వచ్చే విద్యా సంవత్సరం నాటికి కొత్త రూపురేఖలు తేవాలని, విద్యార్థులు ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునేలా సౌకర్యాలు పూర్తి స్థాయిలో మెరుగుపరచాలని కోరారు. భవన నిర్మాణాలతోపాటే అంతర్గత రోడ్లు, ప్రహరీగోడలు నిర్మించాలని తెలిపామన్నారు.