హైదరాబాద్

నారాయణగూడలో రూ.90లక్షలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, కాచిగూడ, డిసెంబర్ 1: ఓ వైపు సామాన్యులు రూ.2వేల కోసం గంటల తరబడి ఏటీఎంల వద్ద క్యూలో నిలబడి వేచివుంటే. అక్రమార్కులు మాత్రం దొడ్డిదారిలో నోట్ల కట్టలు తరలిస్తున్నారు. పోలీసులు ఎక్కడ తనిఖీలు చేపట్టిన లక్షల్లో రూపాయలు నగదు రూపంలో బయటపడుతోంది. తాజాగా గురువారం రాత్రి హైదరాబాద్ నారాయణగూడలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో తరలిస్తున్న రూ.90లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మొత్తం కొత్త రెండు వేల నోట్లు కావడంతో పోలీసులు అవాక్కయ్యారు. నగదు తరలిస్తున్న కారుతో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకుని నారాయణగూడ పోలీసులు విచారిస్తున్నారు. నారాయణగూడ చౌరస్తాలో పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో కారులో వెళుతున్నవారిపై అనుమానం కలిగి సోదాలు చేయడంతో అసలు విషయం బయటపడింది. ప్రకాశం జిల్లా కందుకూరు గ్రామానికి చెందిన నాలుగురు ముఠా సభ్యులు నగరంలోని రామంతపూర్‌కు చెందిన ఓ మహిళతో 15 శాతం కమీషన్ మేరకు నోట్ల మార్పును కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో రెండు వేల కోత్త నోట్లు కలిగిన రూ.90లక్షల 13వేలు నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు కారును సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రకాశం జిల్లాకు చెందిన నాలుగురు ముఠా సభ్యులతో పాటు రామంతపూర్ ప్రాంతానికి చెందిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించ లేదు. విచారణ అనంతరం అన్ని విషయాలు తెలుపుతామని పోలీసులు బదులిస్తున్నారు.