హైదరాబాద్

నిధులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో జిహెచ్‌ఎంసికి కనీసం రూ. 2వేల కోట్ల నుంచి రూ. 3వేల కోట్ల మేరకు నిధులు కేటాయించాలని జిహెచ్‌ఎంసి పాలక మండలి, అధికార యంత్రాంగం ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే ఏటా ఆర్టీసికి చెల్లిస్తున్న రూ. 281 కోట్ల ఆర్థిక భారం నుంచి కూడా తమకు విముక్తి కలిగించాలని కోరినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. అయితే ఇప్పటికే పలు సార్లు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని నూటికి నూరు శాతం చెల్లించిన జిహెచ్‌ఎంసి మున్ముందు అప్పులు తీసుకునేందుకు అనుమతిని కూడా కోరింది. జిహెచ్‌ఎంసికి ఉన్న రేటింగ్‌పై ఇప్పటికే అధ్యయనం చేసినట్లు అవసరమైతే బాండ్ల ద్వారా పెట్టుబడులను ఆహ్వానించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. దీనికి తోడు ప్రతి ఏటా సర్కారు నుంచి జిహెచ్‌ఎంసికి రావల్సిన రోడ్డు ట్యాక్సు, ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్సు, ఆస్తిపన్ను వంటివి సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఇటీవలే ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరినట్లు మేయర్ రామ్మోహన్ తెలిపారు. ఏటా సర్కారు నుంచి సుమారు రూ. 360 కోట్ల వరకు జిహెచ్‌ఎంసికి నిధులొస్తున్నాయని, ఈ సంవత్సరం ఇప్పటికే రూ. వంద కోట్ల వరకు మంజూరు కాగా, మిగిలిన నిధులు కూడా ఖచ్చితంగా వస్తాయని, ప్రస్తుతమున్న పరిస్థితులను అధిగమించేందుకు గాను వీలైనంత త్వరగా తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రూ. 2వేల కోట్ల అప్పుతో శివార్లకు తాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు, దీంతో ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించారు.
ఆదాయమార్గాలన్నీ
వినియోగించుకుంటాం:కమిషనర్
నగరంలో వౌలిక వసతులను మెరుగుపరిచేందుకు, ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్‌ఆర్‌డిపి, డబుల్ బెడ్ రూం వంటి స్కీంలను విజయవంతం చేసేందుకు గాను జిహెచ్‌ఎంసికి ఉన్న అన్ని ఆదాయమార్గాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటామని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. పన్ను ఏ మాత్రం పెంచకుండానే వసూళ్లను పెంచుకునే వ్యూహంతో ముందుకెళ్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ట్రేడ్ లైసెన్సుల రీ సర్వే చేపడుతామని, ఇందుకు సంబంధించి ఇప్పటికే కమర్షియల్ ట్యాక్సు, ఎలక్ట్రిసిటీ విభాగం వద్ధనున్న డేటాను తమ వద్దనున్న డేటాతో ట్యాలీ చేసి ట్రేడ్‌లైసెన్సుల ఛార్జీలను సవరిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన జాబితా ఇప్పటికే అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లకు పంపినట్లు కమిషనర్ తెలిపారు.