హైదరాబాద్

అవినీతికి పాల్పడేవారి సమాచారం ఏసిబికి ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారుల సమాచారాన్ని ఏసిబి అధికారులకు అందించి అవినీతిని అంతమొందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా పిలుపునిచ్చారు. అవినీతితో సమాజానికి ఎంతో నష్టం జరుగుతుందని, ప్రధానంగా పేద వర్గాల సంక్షేమానికై ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలు అర్హులకు అందకుండా పోతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. అవినీతి నిరోధక వారోత్సవాలను పురస్కరించుకుని ఏసిబి సిటీ రేంజ్ ఆధ్వర్యంలో శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా రేపటి పౌరులైన నేటి విద్యార్థులు చిన్నతనం నుంచే అవినీతిని వ్యతిరేకించాలని, కుటుంబ సభ్యులతో మొదలుకుని దైనందిన జీవితంలో తనకెదురయ్యే వారందరితో అవినీతికి పాల్పడవద్దన్న సందేశాన్ని వ్యాప్తి చేయాలని సూచించారు. వ్యవస్థలో అవినీతిని నిర్మూలించాలంటే విద్యార్థులు అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలన్నారు. కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారులను ఎదురించాలని సూచించారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా అవినీతిపై పోరాడేందుకు ప్రజలను చైతన్యపరించేందుకు వీలుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 3 నుంచి 9వరకు అవినీతి నిరోధక వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 3న ర్యాలీలు, ప్రతిజ్ఞ, 5,6 తేదీల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, 9న అవినీతి నిర్మూలన దినం వంటి రకరకాల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సమాజంలో అవినీతి నిర్మూలించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామని అందిరిచే కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏసిబి సిటీ రేంజ్ డిఎస్పీ అశోక్‌కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ ఎస్.ఎన్.రెడ్డి, డిప్యూటీ డిఇవో మూర్తి, ఏసిబి ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. పలు పాఠశాలల విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, ఎన్‌సిసి క్యాడెట్లు, హైదరాబాద్ జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారధులు పాల్గొన్న ఈ ర్యాలీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి గన్‌పార్కు వరకు సాగింది. అవినీతి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ టిఎస్‌ఎస్ కళాకారులు ఆలపించిన పలు గీతాలు, వివిధ వర్గాలు, విద్యార్థులు విచ్చిన నినాదాలు ఆకట్టుకున్నాయి.