హైదరాబాద్

లెక్క తేలేందుకు మూడు గంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: జిహెచ్‌ఎంసి కార్యకలాపాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు చేపట్టిన వార్డు కమిటీ సభ్యుల నియామకానికి సంబంధించి తాము ప్రతిపాదించిన పేర్లు రాలేదంటూ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పరస్పరం ప్రశ్నించుకున్నారు. ఫలితంగా ఉదయం పది గంటలకు ప్రారంభం కావల్సిన కౌన్సిల్ సమావేశం మూడు గంటలు ఆలస్యమైంది. ఆ మూడు గంటల పాటు మేయర్ ఛాంబర్‌లో ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వార్డు కమిటీ సభ్యుడి స్థానం కోసం మే మాసంలోనే నామినేషన్లను స్వీకరించిన అధికారులు అందులో అర్హత కల్గినవి మాత్రమే ఎన్నికకు సిద్దం చేశామని ప్రకటించారు. కానీ ఈ జాబితాతో ఉదయం కౌన్సిల్ నిర్వహించేందుకు మేయర్ రాగానే టిఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీల కార్పొరేటర్లు తాము ప్రతిపాదించిన వారి పేర్లు లేవని ఆయనకు మొరబెట్టుకున్నారు. దీంతో ఆయన వెంటనే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను తన చాంబర్‌కు పిలిపించుకుని చర్చించారు. అయితే శనివారం కౌన్సిల్ ఆమోదించాలనుకున్న జాబితాలో చర్చలు జరిగిన మూడు గంటల పాటు ఎలాంటి మార్పులు జరిగాయి? తమవారి పేర్లు లేవని చెప్పుకున్న కార్పొరేటర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పేర్లు చేర్చినట్లు సమాచారం. అయినా అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. డివిజన్ కార్పొరేటర్‌గా తాము ప్రతిపాదించిన పేర్లను మార్చే అధికారం మీకెక్కదిదంటూ పలువురు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలను ఘాటుగా ప్రశ్నించటం, కొందరు వాగ్వాదానికి దిగటంతో మేయర్ ఛాంబర్‌కు లోపలి నుంచి గడి వేసుకుని మరీ చర్చలు కొనసాగించారు. 144 డివిజన్లకు సంబంధించిన 1433 సభ్యుల పేర్లను సభలో ప్రతిపాదించి, ఆమోదించుకున్నారు.
13లో అసంపూర్తి..4లో వాయిదా
పత్తర్‌గట్టి, నవాబ్‌సాబ్‌కుంట, టోలీచౌకీ, జాంబాగ్, గన్‌ఫౌండ్రి, అమీర్‌పేటల్లో మహిళా రిజర్వేషన్ల కింద ఒక్కో నామినేషన్, అలాగే ఎర్రగడ్డ, అడ్డగుట్టలో రెండు చొప్పున, సనత్‌నగర్, రెహ్మత్‌నగర్‌లో మూడు చొప్పున, బన్సీలాల్‌పేట, బేగంపేటలో నాలుగు మహిళా నామినేషన్లు అందకపోవటంతో అక్కడి వార్డు కమిటీల ఎన్నిక అసంపూర్తిగానే జరిగింది. ఇక ఖైరతాబాద్‌లో ఎమ్మెల్యే చింతలరామచంద్రారెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డిల మధ్య, మైలార్‌దేవులపల్లిలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి, వెంగళ్‌రావునగర్, మియాపూర్ డివిజన్లకు సంబంధించి ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాధ్, గాంధీ, కార్పొరేటర్ల మధ్య వార్డు కమిటీల నియామకం పట్ల సమన్వయం కుదరకపోవటంతో వీటి ఎన్నికను వాయిదా వేశారు.