హైదరాబాద్

అడ్డంకులు తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: నగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు ఇప్పటికే విస్తరించిన రోడ్లపై తొలగించకుండా ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఓ ప్రధాన కారణమని గుర్తించింది సమన్వయ కమిటీ. వీటిని వెంటనే తొలగించటంతో పాటు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు గాను ప్రత్యామ్నాయ రోడ్లను గుర్తించే అంశాన్ని ప్రాధాన్యతనివ్వాలని కమిటీ నిర్ణయించింది. రోడ్డుపై అడ్డుగా ఉన్న సుమారు 440 విద్యుత్ స్తంభాలు, 61 ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించేందుకు రూ. 1.95 కోట్లు విడుదల చేస్తామని కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. కమిషనర్ అధ్యక్షతన టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ కార్యాలయంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో సంస్థ సిఎండి రఘుమారెడ్డి, జలమండలి ఎండి దానికిషోర్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ జితేందర్ మాట్లాడుతూ ముసారాంబాగ్ మూసీ వెంట ఇమ్లిబన్ వరకు ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటును పునఃపరిశీలించాల్సిన అవసరముందని సూచించారు. దీన్ని ట్రాఫిక్, రెవెన్యూ, జిహెచ్‌ఎంసి, అధికారులచే సర్వే నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఉప్పల్ ఇన్నర్ రింగురోడ్డు వెంట ఉన్న డంపింగ్‌యార్డులను తొలగించాలని హెచ్‌ఎండిఏ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి తరలించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. హెచ్‌ఎండిఏ పరిధిలో ఉన్న 4వేల 148 చెరువుల వివరాలను సేకరించేందుకు ఆయా చెరువుల వివరాల సర్వే నెంబర్లు, విస్తీర్ణం తదితర వివరాలను సమర్పించాలని వివిధ శాఖలకు హెచ్‌ఎంసి ప్రత్యేకంగా లేఖలు రాసిందని, ఇందులో భాగంగా ఇప్పటికే హెచ్‌ఎండిఏ ద్వారా 188 చెరువుల సర్వే నిర్వహించి ఎఫ్‌టిఎల్‌తో పాటి జిపిఎస్ కో ఆర్డినేట్‌లను కూడా నిర్దారించటం జరిగిందని సమావేశంలో తెలిపారు. దుర్గంచెరువు చుట్టుపక్కల ఆక్రమణలు తొలగించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్ల, దీనిలో భాగంగా గతంలో మంజూరైన 8 లే అవుట్లను రద్దు చేయటం జరిగిందని జిహెచ్‌ఎంసి కమిషనర్ పేర్కొన్నారు. ధుర్గం చెరువు ఎఫ్‌టిఎల్ పరిధిలో ఏ విధమైన నిర్మాణాలు అనుమతిచ్చేది లేదని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, రాజీవ్ ఆవాస్ యోజన తదితర గృహ నిర్మాణ పథకాలను మరింత వేగవంతంగా చేపట్టడానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించినట్లు తెలిపారు. నగర మేయర్‌లతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ అడిషనల్ సిపి జితేందర్ సూచించగా, ఇందుకు అన్ని శాఖల అధికారులు అంగీకరించారు. నగర శివార్లలో మంచినీటి సౌకర్యానికి గాను ప్రతిపాదిత పైప్‌లైన్ల నిర్మాణానికి గాను రోడ్ల తవ్వకాలకు సంబంధించి ముందుగానే వాటి పునరుద్దరణకు అవసరమైన టెండర్లను ఖరారు చేసిన తర్వాతే పనులు ప్రారంభించి, నగరవాసులకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జలమండలి ఎండి దానా కిషోర్ వెల్లడించారు. నగరంలో అండర్‌గ్రౌండ్ విద్యుత్ లైన్ల నిర్మాణం సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా టెలికాం ఉన్నత స్థాయి కమిటీచే ఆమోదం పొందాల్సి ఉంటుందని బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులు పేర్కొన్నారు. ఈ సమన్వయ సమావేశంలో మేడ్చల్ జాయింట్ కలెక్టర్, రోడ్లు, భవనాలు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

డిజిటల్ లావాదేవీలను మెరుగుపర్చండి

హైదరాబాద్, డిసెంబర్ 3: డిజిటల్ లావాదేవీలను మెరుగుపర్చేందుకు అన్ని జిల్లా కలెక్టర్లు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర సూచించారు. సచివాలయం నుండి ప్రదీప్ చంద్ర ఆయా జిల్లా కలెక్టర్లలో వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్ చంద్ర మాట్లాడుతూ డెబిట్, క్రెడిట్ కార్డులు, ఈ వాలెట్లను ఉపయోగంలోకి తేవాలని అన్నారు. ఎలక్ట్రానిక్ చెల్లింపుల ద్వారా లావాదేవీలు సులభంగా జరుగుతాయాని పేర్కొన్నారు. నగదు రహిత వ్యవస్థను ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకొనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు ఐటి శాఖ మూడు అంచేల కార్యక్రమాన్ని రూపొందించిందని అన్నారు. జిల్లా, మండల, పంచాయితీల స్థాయిలో ఐటి శాఖ తరపున కోఆర్డినేటర్‌ను ఏర్పాటు చేస్తామని వారి నుండి ప్రజలకు నగదు రహిత, ఎలక్ట్రానిక్ చెల్లింపులపై చైతన్యపరుస్తామని పేర్కొన్నారు. క్రిస్‌మస్ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరపాలని కలెక్టర్లను ఆదేశించారు. క్రిస్‌మస్ సందర్భంగా పేదలకు బట్టల పంపిణీ, విందును ఏర్పాటు చేయాలన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు మాట్లాడుతూ డబ్బు కొరత వల్ల ఉపాధీ హామీ కూలీలకు, అసరా ఫించ్ఛన్లు చెల్లింపులు కష్టతరమవుతున్నాయని అన్నారు. 23000 అసరా ఫించ్ఛన్ల లబ్దిదారులకు బ్యాంకుల ద్వారా 87000 మందికి పోస్ట్ఫాసుల ద్వారా 20840 మందికి సొంతంగా చెల్పింపులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ 20840 సొంతంగా చెల్లింపులు చేసే లబ్దిదారులు జిల్లాల పనర్విభజనలో భాగంగా మహబూబ్‌నగర్ నుండి రంగారెడ్డి జిల్లాలలో కలిసిన 9 మండలాలకు చెందిన లబ్ధిదారులని, వీరికి త్వరలో బ్యాంకు ఖాతాలు తెరిపించి చెల్లింపులు బ్యాంకు ద్వారానే జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ వీడియో కానె్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ అబ్నార్, జిల్లా రెవెన్యూ అధికారి భవాని శంకర్ పాల్గొన్నారు.

ప్రాజెక్ట్ పనులపై అధికారులు దృష్టి సారించాలి

హైదరాబాద్, డిసెంబర్ 3: నగర శివారు మున్సిపాల్టీల్లోని వివిధ ప్రాంతాలలో రూ.1900 కోట్ల హడ్కో నిధులతో చేపడుతున్న తాగునీటి సరఫరా మెరుగు ప్రాజెక్ట్ పనుల పురోగతిపై జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ శనివారంనాడు ప్రాజెక్ట్ అధికారులతో సమావేశమై సమీక్షా నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో శివారు ప్రాంతాల్లో చేపడుతున్న ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని జనరల్ మేనేజర్‌లను ఎండి ఆదేశించారు. రిజర్వాయర్ నిర్మాణ పనులు, రిజర్వాయర్ ఇన్‌లెట్, ఔట్‌లెట్ పనులు, 2500కిమీల పైప్‌లైన్ విస్తరణ పనులు, రోడ్ల తవ్వకాలకు అనుమతులు, రోడ్ల మరమ్మత్తు పనులు నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని ఎండి దానకిషోర్ సూచించారు. భారీ నిర్మాణ ప్రాజెక్ట్ పనుల పురోగతిని రోజువారిగా సమీక్షించి, పనులు వేగంగా జరిగేందుకు ప్రణాళికలు రూపొందించాలని జనరల్ మేనేజర్లను అదేశించారు. పనులు జరిగే ప్రదేశాల్లో తప్పకుండా బారికేడ్లు, సూచికలను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఎండి ఆదేశించారు. డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు ప్రతి రోజు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు జరుగుతున్న తీరును పరిశీలించాలని చెప్పారు.