హైదరాబాద్

ఘంటసాల జయంతి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, డిసెంబర్ 4: ఘంటసాల 94వ జయంతి సందర్భంగా ఘంటసాల గీతా విభావరి రాగరాగిణి ఆర్ట్స్ అసోసియేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళాలలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీరామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఘంటసాల భౌతికంగా లేకపోయినా చిరస్థాయిగా ప్రేక్షక హృదయాల్లో నిలిచి ఉన్నాడని పేర్కొన్నారు. సభకు ముందు ప్రముఖ గాయకులు శ్రీమన్నారాయణ, ఎంవి రమణకుమారి బృందం అలపించిన సినీ సంగీత విభావరి అందరినీ అలరించింది.
కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు డా.కళావేంకట దీక్షితులు, ఘంటసాల గానసభ అధ్యక్షుడు డా.కెవి.రావు, సాహితీవేత్త కె.సర్వమంగళగౌరి, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు యంవి.రమణకుమారి, సుబ్బలక్ష్మీ, కళాశారద పాల్గొన్నారు.

తిరునగరి ‘సముద్ర మథనం’ ఆవిష్కరణ
హైదరాబాద్, డిసెంబర్ 4: తెలుగు సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో ‘సముద్ర మథనం’ పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర సలహాదారులు కె.వి.రమణాచారి ఆవిష్కరించారు. సముద్రాన్ని చిలికితే తొలుత గరళం వచ్చి ఆ తరువాత అమృతం వచ్చినట్లు పుస్తక రచయిత తిరునగరి రచనల కోసం కష్టాలను ఎదుర్కొన్న తరువాత అమృతం వంటి సాహిత్యం వచ్చిందని అన్నారు. నేటి విత్తనం రేపటి మొక్క, ఆ మొక్క ఫలాలను ఇస్తుందని చెప్పేవిధంగా తిరునగరి తనవారినందరిని గుర్తు చేసుకున్నాడని అన్నారు. ఈ సందర్భంగా గతంలో ‘సమాజమే నా దేవాలయం...’అన్న కేసిఆర్ మాటలు గుర్తు చేసారు. కార్యక్రమంలో ఆచార్య మసన చెన్నప్ప అధ్యక్షత వహించగా కళాపీఠం అధ్యక్షుడు చిక్కా రామదాసు, గేయ రచయిత వెనిగళ్ల రాంబాబు పుస్తక సమీక్ష చేయగా మర్రిపెద్ది సుబ్బలక్ష్మి, జ్ఞానవర్ధన్ దంపతులు పుస్తకాన్ని స్వీకరించారు. తొలుత పేరడి గురుస్వామి తనదైన శైలిలో హాస్యాన్ని పండించారు. పాత్రికేయులు బైసా దేవదాసు, బూర్గుల మధుసూదన్, సి.ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

సమసమాజ స్థాపనకు డివైఎఫ్‌ఐ కృషి
జీడిమెట్ల, డిసెంబర్ 4: సమసమాజ స్థాపన కోసం డివైఎఫ్‌ఐ పాటుపడుతుందని డివైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం షాపూర్‌నగర్‌లో మేడ్చల్ డివైఎఫ్‌ఐ ప్రథమ మహాసభలు జరిగాయి. ఈ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ దేశంలో మతోన్మాదం పెరిగిపోతుందని, దేశ లౌకికత్వానికి పెనుప్రమాదం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డివైఎఫ్‌ఐ పోరాటాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను ఏ ఒక్కటి అమలు పర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. డివైఎఫ్‌ఐ భగత్‌సింగ్ ఆశయాలకు, సమసమాజ స్థాపనకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహేందర్, లక్ష్మన్ పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా డివైఎఫ్‌ఐ నూతన కమిటీ అధ్యక్షునిగా నర్సింగరావు, కార్యదర్శిగా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఆంజనేయులు, సుజన్, సహాయ కార్యదర్శులుగా ప్రవీన్, లక్ష్మన్‌ను ఎన్నుకున్నారు.