హైదరాబాద్

పెద్దనోట్ల రద్దుతో డిజిటల్ లావాదేవీల వైపు అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 4: పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగర వాసులు ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారిస్తున్నారు. దేశ రాజధానిలో డిజిటల్ లావాదేవీలు ము మ్మరంగా జరుగుతున్నట్టు, అక్కడి వ్యాపారులు ఇబ్బందులు లేకుం డా తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారని సామాజిక మాధ్యమాల్లో తెలుసుకుంటున్న నగర వ్యాపారులు, ప్రజలు ఆ దిశగా అడుగులు వేసేందుకు సిద్ధవౌతోన్నారు. ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దుచేస్తూ నిర్ణయాన్ని ప్రకటించిన నాటి నుంచి కరెన్సీ కష్టాలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. సాధారణ రోజుల్లోనే చిల్లర కోసం ఇబ్బంది పడే వారు ఎన్నో తంటాలు పడే పరిస్థితి నెలకొంది. దీనికితోడు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం రూ. 2000 నోటును అందుబాటులోకి తేవడంతో చిల్లర ఇబ్బందులు రెట్టింపు అయ్యాయి. జేబులో రెండువేల నోటు ఉన్నా కడుపు నింపుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో తప్పని పరిస్థితిలో డిజిటల్ లావాదేవీల వైపు మొగ్గు చూపాల్సి వస్తోంది. ఇప్పటికే నగరంలో బడా మాల్స్, పెట్రోల్ బంకులు, ఆసుపత్రుల్లో డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉండగా, గల్లీలో చిరువ్యాపారం చేసుకునేవారు, చివరకు కూరగాయాలు విక్రయించుకునే వారు కూడా సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సి వస్తుంది. పాయంట్ ఆఫ్ సెల్ (పిఓఎస్) వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. పేటిఎం వంటి సంస్థలు నగరంలో డిజిటల్ లావాదేవీలు పెరిగినట్టు చెప్పడమే ఇందుకు నిదర్శం. ఇక్కడివరకు బాగానే ఉన్నా డిజిటల్ లావాదేవీపై హ్యాకర్స్ దాడులు చేస్తే భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెక్రో ఎటిఎంలు, క్యాష్‌లెస్ లావాదేవీలపై హ్యాకర్లు దృష్టిసారిస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగించే సమయంలో చిన్నపాటి ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించి సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నాయి. ఈ భయాలు వ్యాపారులు, ప్రజలను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటూ లావాదేవీలు జరుపుకోవచ్చని సూచిస్తున్నారు.