హైదరాబాద్

వార్డు కమిటీల వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: మహానగరంలోని కోటి మంది జనాభాకు అత్యవసర సేవలందించే జిహెచ్‌ఎంసి కార్యకలాపాల్లో, అభివృద్ధిలో ప్రజల భాగాస్వామ్యాన్ని పెంచేందుకు ఇటీవలే వార్డు కమిటీలను నియమించారు. ఈ నియామకం ఎమ్మెల్యే, కార్పొరేటర్ల మధ్య వార్‌గా మారింది.
ఈ నెల 3వ తేదీన కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి నాలుగు వార్డులు మినహా మిగిలిన 146 వార్డుల్లో 13 వార్డుల్లో అసంపూర్తిగా, మిగిలిన వాటిల్లో పది సభ్యులతో మొత్తం 1433 మందిని వార్డు కమిటీ సభ్యులుగా నియమిస్తూ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది.
సమావేశంలో ఒక్కో స్థాయి సంఘం సభ్యులు దాదాపు పది వార్డులకు చెందిన వంద మంది పేర్లను కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించి, ఆ తర్వాత ఆమోదించారు. కౌన్సిల్‌లో ప్రవేశపెట్టక ముందు కూడా వార్డు కమిటీల నియామకానికి సంబంధించి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతోంది. ఫలితంగా కొన్ని వార్డుల్లో కౌన్సిల్ ఆమోదించిన పేర్లను సైతం మార్చి ఇతరులను నియమిస్తున్నట్లు సమాచారం. సభ్యత్వం కోసం భారీగా ముడుపులు చెల్లించుకుంటున్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్తాపూర్ వార్డులో రెండు బస్తీలకు చెందిన అయిదుగురికి సభ్యులుగా స్థానం కల్పించినట్లు సమాచారం.
వార్డు కమిటీలనేవి డివిజన్‌కు సంబంధించిన కావటంతో సభ్యులను నియమించుకునే పూర్తి హక్కు తమకే ఉంటుందని కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో విభేదిస్తున్నారు.
ముఖ్యంగా ఇటీవలే వివిధ పార్టీల నుంచి అధికార టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వార్డు కమిటీల నియామకాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మధ్య విభేధాలు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో వార్డు కమిటీ సభ్యుల నియామకానికి సంబంధించి విభేదాలు తలెత్తినట్లు సమాచారం. తాజాగా టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు మొత్తం పది మంది తమ అనుచరులను వార్డు కమిటీ సభ్యులుగా నియమించుకుంటుండగా, వారి కన్నా ముందు టిఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్న తమ సంగతేంటి అంటూ కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఒక్కో వార్డు కమిటీలో పది మందిని సభ్యులుగా నియమించాల్సి ఉండగా, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు వార్డులకు ఏకంగా ఎమ్మెల్యేకు చెందిన పది మందిని సభ్యులుగా నియమించటం పట్ల ఆ డివిజన్ కార్పొరేటర్ నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే తరపున అయిదుగురు, కార్పొరేటర్ తరపున అయిదుగురు నియమించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా, ఈ ఇద్దరు ప్రజాప్రతినిధుల అనుచరుల్లో వార్డు కమిటీల్లో స్థానాన్ని ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎమ్మెల్యే, కార్పొరేటర్ల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది. వార్డు కమిటీ సభ్యుల నియామక వ్యవహారం మంత్రులకు కూడా తలనొప్పిగా మారుతోంది.