హైదరాబాద్

సైనికుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: భారతదేశ సరిహద్దులో రాత్రింబవళ్లుకాపలా కాస్తూ దేశాన్ని కాపాడుతున్న సైనికుల కోసం అవసరమైన సహకారాన్ని అందిస్తూ, వారి సంక్షేమానికి సంపూర్ణంగా తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం రవీంద్రభారతిలో జరిగిన సైనిక దళాల పతాక దినోత్సవానికి నాయిని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భూకంపాలు, వరదలు వచ్చినపుడు సైనికుల సహాయ సహకారం అందిస్తారని, మాజీ సైనికుల పెన్షన్‌ను ఆరువేల రూ.లకు పెంచామని, ఇంటి పన్ను రద్దు చేసామని అన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవాల్లో వీర సైనికులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచుతామని అన్నారు. సైకిల కుటుంబాలకు ఆర్థిక సహకారం కోసం హుండీలను ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఏర్పాటు చేస్తామని అన్నారు.
సైనికులను కుటుంబ సభ్యుల్లా చూడాలని, సైనికుల అతిథుల గృహాలను పెంచుతామని, ఇళ్ల స్థలాల కేటాయింపులో ప్రభుత్వంతో సంప్రదించి పూర్తి సహకారం అందిస్తామన్నారు. పెద్ద వ్యాపారస్తుల నుంచి నిధులు సేకరించాలని అన్నారు. ఈ సందర్భంగా 2017 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లా నుంచి పదిలక్షల ముప్ఫయివేల రూపాయల విరాళం సేకరించామని, ఆ చెక్‌ను మంత్రికి అందజేసారు. ఈ సందర్భంగా - హోంమంత్రి, హోంసెక్రటరీ అనితారాజేందర్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హుండీలో డబ్బులు వేసి ప్రారంభించారు. అనంతరం రెండవ ప్రపంచయుద్ధంలో పోరాడిన వీర సైనికులను సత్కరించారు. ఇ.్భమరాజు, రెహమతుల్లా, మేరీతోపాటు మాజీ సైనికుడు నర్సింహారెడ్డి అస్వస్థత కారణంగా ఆయన తనయుడు, ఆంధ్రభూమి సీనియర్ రిపోర్టర్, తెలంగాణ అసెంబ్లీ మీడియా కమిటీ చైర్మన్ ఈశ్వర్‌రెడ్డికి మెమొంటో అందజేసారు. తొలుత సభకు అధ్యక్షత వహించిన హోంశాఖ కార్యదర్శి అనితా రాజేందర్ మాట్లాడుతూ, గత రెండేళ్లలో పది కోట్ల విరాళం సేకరించామని అన్నారు. సిఎం సూచన మేరకు సైనికుల సంక్షేమానికి డిజిపి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసామని కమిటీ నిర్ణయాలను అన్ని గ్రామాలకు పంపుతామని అన్నారు. సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కల్నల్ పి.రమేష్‌కుమార్ స్వాగతం పలుకగా, దేశభక్తి గీతాలు, సైనిక విన్యాసాలు ప్రదర్శించారు.