హైదరాబాద్

మరో 50 వేల మందికి రూ. 5 భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: మహానగరంలో అర్దాకలితో అలమటించే వారికి మధ్యాహ్నం పూట పెట్టడన్నం పెట్టాలన్న మహాసంకల్పంతో జిహెచ్‌ఎంసి ప్రస్తుతం అమలు చేస్తున్న రూ. 5 భోజన పథకాన్ని మున్ముందు మరింత విస్తరించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. బోరబండలో కొత్తగా ఏర్పాటు చేసిన రూ. 5 భోజనం పంపిణీ కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రూ. 30 కోట్లతో మరో 50వేల మందికి ఈ భోజనాన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. అంతేగాక, ప్రస్తుతం నగరంలో ఉన్న ఈ భోజన పంపిణీ కేంద్రాల సంఖ్యను 150కు పెంచనున్నట్లు మేయర్ తెలిపారు. రూ. 5 భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిహెచ్‌ఎంసి ఏటా రూ. 30 కోట్లను ఖర్చ చేస్తుందని వివరించారు. దేశంలో పెద్దనోట్ల రద్దు వల్ల నగరంలోని పేదలు భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడరాదన్న ఉద్దేశ్యంతో ప్రస్తుతమున్న 50 కేంద్రాలకు తోడు అదనంగా మరో వంద కేంద్రాలను అందుబాటులోకి తేవాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వీటిని విస్తరించనున్నట్లు తెలిపారు. ఇందుకు కోసం స్థలాలను కూడా ఎంపిక చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నగరంలోని నిరుపేదలు, అడ్డాకూలీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రూ. 5 భోజన కేంద్రాలను ఏర్పాటు చేయనున్టన్లు తెలిపారు.
నగరంలో ఖాళీ స్థలాలు, బస్తీలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ఏ మాత్రం కొరత లేదని, అయితే స్థలాలు అప్పగించే ప్రధాన సమస్యగా తయారైందని మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ సుధాంశ్, భోజనం పంపిణీ చేస్తున్న హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
రూ. 3 కోట్లతో పంజాగుట్ట
శ్మశానవాటిక అభివృద్ధి
పంజాగుట్ట శ్మశానవాటికను ఆధునిక హంగులతో అభివృద్ధి చేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేసి ఈ స్మశానవాటికను మోడల్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. రూ. 3 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు ఆధునీకరణ పనులను మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మొదటి దశలో దాదాపు ఎనిమిది స్మశానవాటికల్లో మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు ఆధునీకరణ చేపట్టడం జరుగుతుందని వివరించారు. పంజాగుట్ట స్మశానవాటికలో మొత్తం ఆరు దహనవాటికలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నామని, విశ్రాంతి గదులు, బాత్‌రూంల నిర్మాణంతో పాటు ఈ స్మశానవాటికను ఆహ్లాదభరితమైన ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
ఈ శ్మశానవాటిలో ఉన్న విద్యుత్ దహనవాటికను పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ముస్లిం స్మశానవాటికను పరిశీలించి, బోరు బావిని వెంటనే తవ్వించటంతో పాటు చెత్తాచెదారంలను తొలగించి, అభివృద్ధి చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ సుభాష్‌సింగ్, అదనపు కమిషనర్ రవికిరణ్ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

సీలింగ్ విధించి బినామీ ఆస్తులను జప్తు చేయాలి
బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

హైదరాబాద్, డిసెంబర్ 8: దేశంలో నల్లధనం, అవినీతి నిర్మూలనకు ఆస్తులకు సీలింగ్ విధించి బినామీ అస్తులను జప్తు చేయాలని ప్రభుత్వాన్ని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సమాజంలో మార్పు రావాలంటే సంస్కరణలు అవసరమని అన్నారు. బిసి కులాలు, ఫెడరేషన్లకు బడ్జెట్ విడుదలచేయాలని, ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్లపట్టాల పంపిణీ, డబుల్ బెడ్ రూంల నిర్మాణం చేపట్టాలని అన్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బిసి యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సిఎం కేసిఆర్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను విస్మరించారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలకు వందల ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించటానికి స్థలం లేదనటం విడ్డూరమన్నారు. ప్రభుత్వానికి స్థలం కావాలంటే తాము చూపిస్తామని అన్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నేతలు నీల వెంకటేష్, నర్సింహాగౌడ్, రామలింగం, రాంబాబు, రమ్య, యాదగిరి, శివకుమారి, సతీష్, శ్రీను, రాజేశ్వరి, జ్యోతి పాల్గొన్నారు.