హైదరాబాద్

ఆర్టీసీకి నిధులిచ్చేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: ప్రస్తుతం అంతంతమాత్రంగా ఉన్న జిహెచ్‌ఎంసి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏటా ఆర్టీసికి రూ. 273.38 కోట్లు చెల్లించలేని పరిస్థితులున్నాయని, ఆర్టీసికి జిహెచ్‌ఎంసి నిధులు కేటాయించేది లేదని జిహెచ్‌ఎంసి స్థారుూ సంఘం తీర్మానించింది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన గురువారం స్థారుూ సంఘం సమావేశం జరిగింది. అజెండాలోని అన్ని అంశాలపై కూలంకుశంగా చర్చించిన సభ్యులు ఆర్టీసికి జిహెచ్‌ఎంసి ఏటా చెల్లిస్తున్న నిధులను ఇకపై చెల్లించలేమని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలిపే ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో సభ్యులు బంగారిప్రకాశ్, వి.శ్రీనివాస్‌రెడ్డి, రమావత్ పద్మనాయక్, సునరితారెడ్డి, జి.అంజయ్య, మనె్న కవితారెడ్డి, కె.సాయిబాబా, ఎం.ఏ.గఫార్, సలీం, సొహైల్ ఖాద్రి, మినాజుద్దిన్‌తో పాటు జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆమోదించిన ప్రతిపాదనలు:
* జిహెచ్‌ఎంసి అదికారులు, ఉద్యోగులు ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్ ఛార్జీల నిమిత్తం నెలకు సర్వీస్ ఛార్జీలతో కలిపి సుమారు రూ. 12లక్షల 883లు, సంవత్సరానికి రూ. కోటి 44లక్షల పదివేల 596లను భారతి ఎయిర్‌టేల్ సంస్థకు చెల్లించేందుకు వీలుగా కమిటీ తీర్మానం చేసింది.
* కుత్బుల్లాపూర్ జీడిమెట్లలో నివాసముండే డి.లక్ష్మణశర్మ అలియాస్ దేవజ్ఞశర్మ నివాసానికి అప్రోచ్ రోడ్‌ను సర్వే నెంబర్ 162లో ఉన్న పార్కు నుంచి ఇవ్వటానికి బందులుగా ఉన్న ఖాళీ స్థలాల్ని అప్పగించేందుకు లీగల్ న్యాయపరమైన సలహా తీసుకున్న అనంతరం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
* అయ్యప్ప సొసైటీ నుంచి బోరబండ వరకున్న రోడ్డును 80్ఫట్లకు విస్తరించేందుకు, ఇందుకు సంబంధించి చేపట్టిన భూసేకరణ చెల్లింపుల ప్రతిపాదనకు ఆమోదం
* మాదాపూర్ మెయిన్ రోడ్డు నుంచి మూసాపేట మలేషియన్ టౌన్‌షిప్ రోడ్డు వరకు నాలుగు లేన్ల క్యారేజీ రోడ్ విస్తరణకు చేపట్టిన భూసేకరణ చెల్లింపులకు రూ. 49.50 కోట్లు చెల్లించేందుకు ఆమోదం
* మాదాపూర్ మెయిన్ రోడ్డు అమరావతి హోటల్ నుంచి మూసాపేట మలేషియన్ టౌన్‌షిప్ రోడ్ వరకు వరద నీటి కాలువతో సహా నాలుగు లేన్ల బిటి రోడ్డును ఎస్‌బిఐ వాటర్ ట్యాంక్ నుంచి పార్వతీనగర్ వరకు నిర్మించేందుకు రూ. 2.98 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనకు ఆమోదం
* నగరంలో మూడో దశ డబుల్ బెడ్ రూం ఇళ్లను 8 ప్రాంతాల్లో మరో 9వేల 896 ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే రూ. 85 కోట్ల 50లక్షల 70వేలకు పరిపాలనపరమైన మంజూరును కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు స్థారుూ సంఘం ఆమోదం తెలిపింది. ఇందులో ప్రభుత్వ సబ్సిడి రూ. 76 కోట్ల 69లక్షల 40వేలు కాగా, జిహెచ్‌ఎంసి సాధారణ నిధఉల నుంచి రూ. 8కోట్ల 81లయల 30వేలు కేటాయించనున్నట్లు స్థారుూ సంఘం పేర్కొంది.

ఎస్‌సిఎఫ్‌కు అంతర్జాతీయ గుర్తింపు

హైదరాబాద్, డిసెంబర్ 8: మాసాబ్‌ట్యాంక్‌లోని స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్‌సిఎఫ్)కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. మెనాకో (యూరఫ్)కు చెందిన పీస్ అండ్ స్పోర్ట్స్ కమిటీ ప్రపంచంలోనే టాప్-3లో ఉన్న స్వచ్ఛంద స్పోర్ట్స్ సంస్థల్లో ఎస్‌సిఎఫ్‌కు చోటు కల్పించింది.
ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం మొనాకోలో ఇటీవల జరిగింది. ఈ అవార్డుల్లో డెన్మార్క్‌కు మొదటి స్థానం, హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్‌కు రెండో స్థానం లభించగా, మూడో స్థానం ఇంగ్లాండ్‌కు దక్కింది.
బిల్డ్ ఇండియా త్రూ స్పోర్ట్స్ నినాదంతో హైదరాబాద్‌తో పాటు ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో గల ప్రభుత్వ, అనాథ బాలలు నివాసం ఉంటున్న పాఠశాలల్లో వివిధ క్రీడలకు సంబంధించిన క్రీడా సామాగ్రిని ఏర్పాటు చేయడంతో పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణనిస్తూ దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరి మన్ననలు పొందింది ఎస్‌సిఎఫ్ స్వచ్ఛంద సంస్థ. ఎస్‌సిఎఫ్ వ్యవస్థాపక కార్యదర్శి, హైదరాబాద్ మాజీ రంజీ క్రికెటర్ కె.సాయిబాబా నగరంలోని మురికివాడలకు చెందిన పేద విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఒక పక్క బ్యాంక్ ఉద్యోగం చేసుకుంటూనే మసాబ్‌ట్యాంక్‌లో ఎస్‌సిఎఫ్‌ను 1991లో స్థాపించాడు. సాయిబాబా నేతృత్వంలో కేవలం ముగ్గురు బాలురకు క్రికెట్‌లో శిక్షణను ప్రారంభించారు. అది కాలక్రమేణా దినదినాభివృద్ధి చెంది ప్రస్తుతం దాదాపు 600 మంది బాలబాలికలు 15 క్రీడాంశాల్లో శిక్షణ పొందుతున్నారు. ఎస్‌సిఎఫ్‌లో వాలీబాల్, క్రికెట్, బాస్కేట్‌బాల్, జిమ్నాస్టిక్, కుంగ్‌ఫూ, టెన్నిస్, ఫుట్‌బాల్, కరాటేతో పాటు ఇతర క్రీడల్లో దాదాపు 30 మంది కోచ్‌లు బాలబాలికలు శిక్షణ పొందుతున్నారు. కేవలం క్రికెట్ శిక్షణ కేంద్రంగా ఏర్పాటైన ఎస్‌సిఎఫ్ వివిధ క్రీడల శిక్షణకు పుట్టినిల్లుగా మారింది. ఇక్కడ శిక్షణ పొందిన అనేక మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించారు. క్రికెట్‌లో భారత మహిళ క్రికెట్ జట్టుకు ఎంపికైన అర్చనదాస్‌తో పాటు మరో ఇద్దరు క్రికెటర్‌లు, ఫుట్‌బాల్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో నిర్వహించిన టోర్నమెంట్‌లో పాల్గొని ప్రతిభ కనబర్చారు. మసాబ్‌ట్యాంక్‌లోని ఎస్‌సిఎఫ్‌లో శిక్షణనిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో క్రీడాసక్తిని పేంచేందుకు గాను ప్రతి రెండు నెలలకోకసారి రెండు వేల మంది బాలబాలికలకు క్రీడల్లో శిక్షణనివ్వడంతో పాటు వారికి కావలసిన క్రీడా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని సాయిబాబా తెలిపారు.
ఎస్‌సిఎఫ్ ఆధ్వర్యంలో రెగ్యులర్ శిక్షణ శిబిరాలతో పాటు విద్యార్థుల క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం సంవత్సరం పోడవునా వివిధ క్రీడాంశాల్లో టోర్నమెంట్‌లు నిర్వహిస్నున్నామని తద్వారా చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తి అభివృద్ధి చెందుతుందన్నారు. ఎస్‌సిఎఫ్‌కు ఇప్పటి వరకు ఆరు ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. వీటిలో 2015 ఆగస్టు మాసంలో రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ నుండి సాయిబాబా ఉత్తమ స్పోర్ట్స్ స్వచ్ఛంద సంస్థ అవార్డును అందుకున్నారు. అదే విధంగా జిందాల్ స్టీల్స్ సంస్థ, రోకో ఫేలోర్ అవార్డు, అమీర్ క్యారీస్ బుంబాయి అవార్డు అందుకున్న ఎస్‌సిఎఫ్‌కు తాజగా యూరఫ్‌లోని మొనాకోలో పీస్ అండ్ స్పోర్ట్స్ అవార్డును మొనాకో దేశరాజు ఆల్‌బర్ట్ నుండి సాయిబాబా అందుకున్నారు. ఇటీవల జరిగిన ఈ కార్యక్రమంలో 28 మంది ఒలింపియన్లు హాజరయ్యారు. ఆసియా దేశాల నుంచి భారత్ తరపున హైదరాబాద్‌లోని ఎస్‌సిఎఫ్‌కు యూరఫ్ అవార్డులో రెండో స్థానం లభించింది. ఈ సందర్భంగా పలువురు ఎస్‌సిఎఫ్‌ను అభినందించారు. రానున్న ఐదు సంవత్సరాల్లో దాదాపు ఐదు లక్షల మంది పాఠశాలల విద్యార్థులకు క్రీడల్లో మక్కువతో పాటు వారిలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని మాజీ రంజీ క్రికెటర్ తెలిపారు. చిన్నారుల్లో క్రీడల గురించి వివరించి వారికి నచ్చిన క్రీడల్లో శిక్షణనిచ్చిన్నట్లయితే వారు భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులుగా ఎదిగే అవకాశం ఉందన్నారు.