హైదరాబాద్

ముగిసిన ఆపరేషన్ నానక్‌రాంగూడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పదకొండుకు పెరిగింది. శుక్రవారం అర్థరాత్రి వరకు తొమ్మిది మృతదేహాలను బయటకు తీసిన ఎన్‌డిఆర్‌ఎఫ్, పోలీసు బృందాలు ఆ తర్వాత తెల్లవారుఝము నాలుగు గంటల వరకు మరో రెండు మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, ఉస్మానియా ఆసుపత్రి నుంచి అయిదు అంబులెన్స్‌లలో వారి స్వస్థలాలకు తరలించారు. దీంతో 30 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్ నానక్‌రాంగూడ తెల్లవారుఝమున ముగిసింది. మృతులు సంఖ్య పదకొండుకు పెరగ్గా, చత్తీస్‌ఘడ్‌కు చెందిన శివ మృతి చెందగా, ఆయన భార్య రేఖ, కుమారుడు దీపక్‌లు మృత్యుంజయలుగా బయటపడ్డారు. సత్యనారాయణసింగ్ అలియాస్ సత్తుసింగ్ నిర్మిస్తున్న ఏడు అంతస్తుల భవనం గురువారం రాత్రి తొమ్మిదిన్నర నుంచి పది గంటల మధ్య పెద్ద శబ్దంతో ఒక్కసారిగా కుప్పకూలటంతో షాక్ తిన్న నానక్‌రాంగూడ గ్రామవాసులు క్రమంగా ఆ షాక్ నుంచి కోలుకుంటున్నారు. కానీ గురువారం తొమ్మిద్నిన్నర గంటల నుంచి పది గంటల మధ్య భవనం కుప్పకూలినా, క్షణాల్లో జిహెచ్‌ఎంసి, పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకున్నా, ఉన్న పళంగా వెంటనే సహాయక చర్యలు చేపట్టలేకపోయారు. అంతేగాక, కూలిన భవనానికి కరెంటు సరఫరాను నిలిపివేసేందుకు మొత్తం గ్రామంలో కరెంటును కట్ చేశారు.
ఆ తర్వాత కూలిన భవనం వద్దకు వెళ్లేందుకు కనీసం ఇరవై అడుగుల వెడల్పు రోడ్డు కూడా లేకపోవటం, పైగా భారీ వాహనాలు వెళ్లకుండా గల్లీలుండటంతో అధికారులు భారీ జేసిబిలను ఇక్కడకు తీసుకురాలేకపోయారు. అంతేగాక, అదేరోజు పనె్నండు గంటల ప్రాంతంలో పక్కనే ఘటనస్థలానికి చేరుకున్న జిహెచ్‌ఎంసి, విపత్తుల నివారణ సంస్థ అధికారులు కుప్పకూలిన భవనం పక్కనే ఉన్న మరో ఆర్‌సిసి ఇంట్లో కూడా బీటలు రావటంతో అందులోని నివాసముంటున్న వారిని ఖాళీ చేయించి ఒక రకంగా ప్రాణ నష్టం ఎక్కువగా జరగకుండా చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. ఎట్టకేలకు రాత్రి పనె్నండు గంటల తర్వాత ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రెండు జేసిబిలతో తమదైన శైలిలో సహాయక చర్యలను చేపట్టారు. ఏడు అంతస్తులు పేక మేడల్లా కుప్పకూలిపోవటంతో ఒక్కో అంతస్తుకు సంబంధించిన శిథిలాలను బయటకు తీస్తూ, ఎవరైనా తుది శ్వాసతో ఉంటే, జీవించేందుకు వీలుగా ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఎప్పటికపుడు ఆక్సిజన్‌ను పంపిస్తూ ఎంతో సాహసోపేతమైన ఆపరేషన్‌ను చేపట్టింది. ముఖ్యంగా శుక్రవారం ఉదయం చత్తీస్‌ఘడ్‌కు చెందిన శివ కుటుంబాన్ని గుర్తించిన బృందాలు తొలుత శివ మృతదేహాన్ని బయటకు తీసిన తర్వాత, అతని భార్య రేఖ, కుమారుడు దీపక్ బతికే ఉన్నట్లు గుర్తించి వారిని బయటకు తీసేందుకు తమ ఆపరేషన్‌ను ఎంతో వేగవంతం చేశారు. స్థానికులు ఇస్తున్న సమాచారం మేరకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు మొత్తం 11 మృతదేహాలను, అలాగే గాయలపాలై శిథిలాల మధ్య చిక్కుకున్న తల్లీబిడ్డలను బయటకు తీశారు. ఎట్టకేలకు ఈ ఆ పరేషన్ శనివారం ఉదయం తెల్లవారఝము మూడు నుంచి మూడున్నర గంటల మధ్య ముగిసింది.
వివిధ విభాగాలకు చెందిన అధికారయంత్రాంగం, యంత్రాలు వెళ్లిపోయి ఘటన స్థలం ప్రస్తుతం నిర్మానుష్యంగా మారింది. అయినా పదకొండు మందిని పొట్టనబెట్టుకున్న ఈ ఘటనను నానాక్‌రాంగూడ వాసులు మరిచిపోయేందుకు మరింత సమయం పట్టనుంది.

కాంగ్రెస్ నేతల నాలుక జనం చీల్చేస్తారు
కెసిఆర్‌ను విమర్శిస్తారా
విపక్షంపై విరుచుకుపడ్డ
మంత్రి తలసాని

హైదరాబాద్, డిసెంబర్ 10: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికోసం నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును విమర్శించే విపక్ష నేతల నాలుకను ప్రజలే చీల్చివేస్తారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. సచివాలయంలో శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు మంత్రి కెటిఆర్‌ను ఏకవచనంతో సంబోధించిన కాంగ్రెస్ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధికోసం ఏం చేశారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ నేతృత్వంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. నానక్‌రామ్ గూడాలో భవనం కూలిన సంఘటనకు బాధ్యులుగా కెటిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు గతంలో గురుకుల ట్రస్ట్ భవనాలను కూలుస్తుంటే ఎందుకు గగ్గోలు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి కోరిక మేరకే అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి నిధులను తమ ప్రభుత్వం వంద శాతం పెంచిందని తలసాని గుర్తు చేశారు.