హైదరాబాద్

వాట్సాప్‌లతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: దేశంలో వ్యక్తిగత కంప్యూటర్లు మొదలుకొని భారీ వ్యవస్థ (సంస్థలు)లపై జరిగే సైబర్ దాడులను పసిగట్టే పనిని ప్రముఖ ‘టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం’ ప్రారంభించింది. ఒకని ఖాతాలోని డబ్బులు మరొకరి ఖాతాలోకి మారడం, పిన్ కోడ్ నెంబర్లు తెలుసుకుని ఏటిఎంల నుంచి డబ్బులు అపహరించడం వంటి వాటిని వాట్సాప్‌ల ద్వారా క్షణాల్లో కనిపెట్టి దొంగలను పట్టుకునే వీలుగా ఐబీఎం సంస్థ నూతన టెక్నాలజీతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయనుంది. ఐబీఎం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన ఆర్ట్ఫిషీయల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ‘వాట్సాప్’ ఇప్పటికే హెల్త్‌కేర్ రంగంలో, సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల్లో చక్కని పనితీరును కనబర్చిన ఈ సాంకేతికను ఇప్పుడు సైబర్ నేరాలను పసిగట్టనుంది. తొలుత ఫార్చూన్ 500 జాబితాలోని 40 సంస్థల్లో వాట్సాప్ బీటా వెర్షన్ సేవలను ప్రారంభించింది. ఇది ఎలాంటి సైబర్ దాడులనైనా పసిగట్టగలదని ఐటి నిపుణులు చెబుతున్నారు. ఆయా కంపెనీలకు చెందిన సాంకేతిక వ్యవస్థలపై హ్యాకర్లు దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తే తక్షణమే వాట్సప్ గుర్తిస్తుందని, ఆ వ్యవస్థల పనితీరును నిత్యం పర్యవేక్షిస్తూ, కార్యకలాపాల్లో ఏ మాత్రం అనుమానాస్పదం అనిపించినా వాట్సప్ పసిగట్టేస్తుందని ఐటి నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకోసం క్లాస్ రూంలో విద్యార్థులకు పాఠాలు చెమ్పినట్టు వాట్సప్‌కు ఐబీఎం నిపుణులు శిక్షణ ఇచ్చారు. పలు రకాల సైబర్ నేరాలకు సంబంధించిన దాదాపు 15వేల డాక్యుమెంట్లను ఐబీఎం అందించినట్టు సమాచారం.