హైదరాబాద్

11ప్రాణాలు మింగిన 5లక్షల లంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: పాలకుల అలసత్వం..సంబంధిత ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం..కారణంగా నగరంలో జరుగుతున్న నిర్మాణాల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
రాష్టస్థ్రాయిలో సంచలనం సృష్టించిన నానక్‌రాంగూడలో పేక మేడలా కూలిన ఏడంతస్తుల అక్రమ నిర్మాణానికి సంబంధించి జిహెచ్‌ఎంసి అధికారులకు ఐదు లక్షల రూపాయల పైగా లంచాలు ముట్టజెప్పినట్టు తెలిసింది. ఈ ఐదు లక్షలే పదకొండు ప్రాణాలను మింగేసింది. భవన యజమాని టి.సత్యనారాయణ సింగ్ అలియాస్ సత్తూ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతుండటంతో అధికారుల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి.
నాణ్యత ప్రమాణాలు పాటించకపోవటం వల్లే నిర్మాణంలో ఉన్న భవనాలు కూలుతున్నాయంటూ అధికారులే నిర్థారిస్తున్నా, అనుమతులు జారీ చేయటం, ఇచ్చిన అనుమతుల ప్రకారం నిర్మాణాలు జరుగుతున్నాయా? అన్న కోణంలో అధికార యంత్రాంగం నిర్వహించే విధుల్లో సైతం చిత్తశుద్ధి, నాణ్యత కరవైంది. అందుకే గడిచిన కేవలం నాలుగు నెలల్లో నాలుగు చోట్ల కూడా నిర్మాణంలో ఉన్న కట్టడాలు కుప్పకూలి బతుకుదెరువు కోసం నగరానికొచ్చిన కూలీలు ప్రాణాలు కోల్పోవల్సి వచ్చింది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్ క్లబ్ పోర్టికో కుప్పకూలి కూలీలు మృతి చెందిన ఘటనతో కళ్లు తెరిచిన జిహెచ్‌ఎంసి నిర్మాణాలు చేపట్టే యజమానులు, అలాగే సైటు ఇంజనీర్లు, సూపర్‌వైజర్లు, కార్మికులకు సైతం నిర్మాణ రంగంపై, అందుకు వినియోగించాల్సిన సామాగ్రి, ప్రమాద నివారణ ప్రమాణాలు వంటి అంశంపై అవగాహన పెంపొందించేందుకు ‘మేలుకొలుపు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జూలైలో జూబ్లీహిల్స్ ఫిల్మ్‌క్లబ్ ఘటన జరగ్గా, ఆగస్టు 2న ప్రధాన కార్యాలయంలో, ఆ తర్వాత ఖైరతాబాద్ సర్కిల్‌లో రెండుసార్లు మేలుకొలుపు కార్యక్రమాన్ని నిర్వహించిన జిహెచ్‌ఎంసి అధికారులు తమ పనైపోయిందుకుని చేతులు దులుపుకున్నారు. మేలుకొలుపు కార్యక్రమ నిర్వాహణ మున్నాళ్ల ముచ్చటగానే తయారైంది. అధికారులు ఈ కార్యక్రమాన్ని ఇలాగే నిర్వహించి ఉంటే, ఆ తర్వాత కూకట్‌పల్లి మోహన్‌నగర్ ఆర్చీ, నానక్‌రాంగూడలో ఏడు అంతస్తుల భవనాలు కూల్చి ఉండకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫిల్మ్‌నగర్ క్లబ్ ఘటన తర్వాత కూకట్‌పల్లి మోహన్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఆర్చీ కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుందంటే జిహెచ్‌ఎంసి అడపాదడపా నిర్వహించిన ఈ కార్యక్రమం ఏ మాత్రం ఫలితాలివ్వలేదన్న విమర్శలున్నాయి. వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నగరంలో నిర్మాణాలకు సంబంధించి కేవలం అనుమతి ఇచ్చే వరకు తమ పని అంటూ జిహెచ్‌ఎంసి వ్యవహారించటం వల్లే బిల్టర్లు, యజమానులు తీసుకున్న అనుమతిని ఉల్లంఘించి అధికంగా అంతస్తులను నిర్మిస్తూ ఇలాంటి ప్రమాదాలకు కారకులవుతున్నారు. అంతేగాక, అనుమతులు జారీ సమయంలో కనీసం క్షేత్ర స్థాయిలో స్థల పరిశీలన కూడా జరపకుండా టౌన్‌ప్లానింగ్ అధికారులు గుడ్డిగా అనుమతులు జారీ చేయటం ముఖ్యమైన లోపం కాగా, అనుమతి జారీ అయిన తర్వాత కనీసం తీసుకున్న అనుమతి ప్రకారమే నిర్మాణాలు జరుగుతున్నాయా? అన్న విషయాన్ని పట్టించుకోకపోవటం కూడా ప్రమాదాలు జరిగేందుకు కారణమవుతుంది. మొత్తానికి తక్కువ స్థలంలో ఎక్కువ అంతస్తులను నిర్మించాలన్న యజమానులు, బిల్డర్ల కక్కుర్తి, జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్ అధికారులు అవినీతి, అక్రమార్జనకు కూలీల ప్రాణాలు బలవుతున్నాయి. పాతబస్తీలోని హుస్సేనీ ఆలంలో ఓ ట్రస్టు చేపట్టిన నిర్మాణం, ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఫిల్మ్‌క్లబ్ పోర్టికో నిర్మాణం, ఆ తర్వాత కూకట్‌పల్లి మోహన్‌నగర్ ఆర్చీతో పాటు నాలుగు రోజుల క్రితం నానక్‌రాం గూడలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి పదకొండు మంది మృత్యువు బారిన పడ్డారు. కనీసం ఒక ఘటన జరిగిన తర్వాత అది మళ్లీ పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టడంలో జిహెచ్‌ఎంసి, ఇతర ప్రభుత్వ శాఖల అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవటం వల్లే ఇలాంటి సంఘటనలు వరుసగా జరిగాయి. తమ పరిధుల్లో జరుగుతున్న నిర్మాణాలకు అనుమతులున్నాయా? అంటూ సర్కిల్ స్థాయి అధికారులు, ఒక వేళ ఉంటే యజమాని గానీ, బిల్డర్ గానీ తీసుకున్న అనుమతి ప్రకారమే నిర్మాణం చేపడుతున్నాడా? నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను ఏ మేరకు పాటిస్తున్నారన్న అంశాల ప్రాతిపదికన జవాబుదారిగా వ్యవహారంచే వ్యవస్థ అందుబాటులోకి వచ్చేవరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయన్న వాదనలున్నాయి.

22న నగరానికి
రాష్టప్రతి రాక
ఏర్పాట్లు ముమ్మరం
హకీంపేట టు రాష్టప్రతి నిలయం
అల్వాల్ , డిసెంబర్ 11: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ డిసెంబర్ 22న పత్యేక అతిథిగా నగరానికి వస్తున్నారు. డిసెంబర్ 22 నుండి 31 వరకు బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో బస చేస్తారు. ప్రతి సంవత్సరం రాష్టప్రతి శీతాకాల విడిది కోసం రాష్టప్రతులు వచ్చి ఇక్కడ విడిది చేస్తారు. కంటోనె్మంట్ బోర్డు అధికారులు, గ్రేటర్ హ్రైదరాబాద్ మున్సిపల్ అధికారులు, ఫారెస్టు, ఉద్యానవన, విద్యుత్‌శాఖ, ఆర్ ఆండ్‌బి, మిలటరీతోపాటు పోలీసు అధికారులు శాఖల వారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్టప్రతి రావటానికి ఇంకా రెండు వారాల గడువు ఉన్నా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. గతంలో రాష్టప్రతి న్యూఢిల్లీ నుండి బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో వస్తారు. కానీ బేగంపేట నుండి బొల్లారం రావాలంటే ట్రాఫిక్ అంతరాయంతో పాటు మెట్రోపనుల దృష్ట్యా రాష్టప్రతి బేగంపేట ఎయిర్ పోర్టుకు బదులు గత రెండు సంవత్సరాలుగా నగర శివారులోని హకీంపేట ఎయిర్ పోర్టుకు వస్తున్నారు. అక్కడ దిగిన రాష్టప్రతికి ట్రాపిక్ సమస్య లేకుండా నేరుగా హకీంపేట నుండి బొల్లారం రాష్టప్రతి నిలయానికి వెళుతున్నారు. రాష్టప్రతి నిలయంలో విడిది కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.