హైదరాబాద్

వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడియేషన్లు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడియేషన్లు ఇవ్వాలని ఐజెయు సీనియర్ నాయకులు కె.శ్రీనివాస్‌రెడ్డి, సెక్రటరి జనరల్ దేవులపల్లి డిమాండ్ చేశారు. అక్రిడయేషన్‌ల విధి విధానాలకై ఏర్పాటు చేసిన సీనియర్ పాత్రికేయులు రాంచంద్రమూర్తి కమిటి సిఫార్సులను ప్రభుత్వం తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టియుడబ్ల్యుజె ఆధ్వ్యరంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ చిన్న, పెద్ద, మధ్య తరగతి, డెస్క్, ప్రింట్ అనే తేడా లేకుండా అందరికీ ప్రభుత్వం అక్రిడియేషన్లు, హెల్త్‌కార్లు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జివో 239లో పొందుపరిచిన అంశాలపై విమర్శలు వస్తున్నట్లు చెప్పారు. జివోలోని అంశాలకు రాంచంద్రరావు కమిటి నివేదించిన సిఫార్సులోని అంశాలకు చాలా తేడా ఉందని తెలిపారు.
జర్నలిస్లు న్యాయమైన డిమాండ్లు, సమస్యలనుప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే తమది ప్రభుత్వ వ్యతిరేక యూనియన్ అని ముద్ర వేయటం భాదాకరమన్నారు. ప్రభుత్వానికి అక్రిడియేషన్లు ఇవ్వటానికి అభ్యంతరం లేకపోతే ఎందుకు గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రశ్నించారు. తమ బలమైన సంఘాన్ని అప్రతిష్ట పాలు చేయటానికి జరుగుతున్న కుట్రలో జర్నలిస్టులు పావులు కావద్దని సూచించారు. అక్రిడియేషన్ల జారీలో నెలకొన్న సందిగ్ధానికి ప్రభుత్వం తెరదించకపోతే శాసనసభ శీతాకాల సమావేశాలలో తమ అందోళనను ప్రకటిస్తామని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నాయకులు విరాహత్ అలి, కోటిరెడ్డి పాల్గొన్నారు.