హైదరాబాద్

‘స్వచ్ఛ’ప్రచారం ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ్భారత్ మిషన్ వచ్చే నెలలో చేపట్టనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో ర్యాంకింగ్ దక్కించుకునేందుకు జిహెచ్‌ఎంసి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 12 నుంచి ప్రత్యేక అవగాహన శిబిరాలకు శ్రీకారం చుట్టిన జిహెచ్‌ఎంసి బుధవారం నగరంలోని అన్ని పాఠశాలలో విద్యార్థులతో స్వచ్ఛ ప్రతిజ్ఞలు చేయించేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతేగాక, దేశవ్యాప్తంగా 500 పట్టణాల్లోని స్థానిక సంస్థలతో అంశాల వారీగా నిర్వహిస్తున్న ఈ పోటీకి గ్రేటర్‌తో సమానమైన నగరంతో పోటీని పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ ఇటీవలే స్వచ్ఛ్భారత్ మిషన్‌కు లేఖ రాసినట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. అలాగే గురువారం కాలనీలు, మురికివాడల్లోనున్న చెరువులు, నాలాల్లోని చెత్తచెదారాన్ని తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. అయితే తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించటంతో మొదటి స్థానంలో, ఈ-లర్నింగ్‌లో రెండో స్థానంలో జిహెచ్‌ఎంసి ఉన్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కాంపైన్(ఐఇసి)లో జిహెచ్‌ఎంసి మూడో స్థానంలో ఉన్న విషయాన్ని అంగీకరించిన కమిషనర్ ఈ దిశగా కూడా మెరుగైన స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని తెలిపారు. అలాగే 15వ తేదీ గురువారం ప్రతి కాలనీపార్కులో స్థానికులు చెత్తతో ఎరువును తయారు చేసుకునేందుకు వీలుగా కంపోస్టింగ్ పిట్‌ను ఏర్పాటు చేసుకునే అంశంపై అవగాహన కల్పించనున్నారు. అలాగే రోడ్లపై ఎక్కడబడితే అక్కడ, నాలాల్లో, చెరువుల్లో చెత్తను వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించటం, ఇక వారంలో ప్రతి గురువారం కూడా ఇదే తరహాలో జరిమానాల వర్తింపు, వసూళ్లను చేపట్టేందుకు జిహెచ్‌ఎంసి సిద్దమవుతోంది. వివిధ సర్కిళ్లకు చెందిన శానిటేషన్, హెల్త్ అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు సమన్వయ కమిటీలతో సమావేశాల నిర్వాహణతో పాటు స్వచ్ఛత ప్రతిజ్ఞలు చేయించి, స్వచ్ఛ సర్వేక్షణ్ 2017పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. త్వరలో స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే అంశాన్ని ప్రోత్సహించేందుకు, సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ఈ సందేశాన్ని తీసుకెళ్లేందుకు స్లోగన్ కాంపిటేషన్‌ను కూడా నిర్వహించేందుకు జిహెచ్‌ఎంసి సిద్ధమవుతోంది.

పాత భవనాల పటిష్టతపై దృష్టి

చంద్రలోక్ కాంప్లెక్స్
ఘటనతో బల్దియాలో కదలిక
40 ఏళ్లు దాటిన అన్ని
భవనాల పటిష్టతపై అధ్యయనం
అవసరమైతే సీజ్ చేసేందుకు త్వరలో ప్రత్యేక చట్టం

హైదరాబాద్/బేగంపేట, డిసెంబర్ 13: కాలక్రమేణా నిర్మాణ రంగంలో నాణ్యత కొరవడుతుంది. మహానగరంలో సుమారు నాలుగు వందల నుంచి నాలుగున్నర వందల ఏళ్ల క్రితం నిర్మించిన భవనాల్లో నేటికి కొన్ని పటిష్టంగానే ఉన్నా, నాలుగైదు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలు ఎపుడు కూలుతాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు నిర్మాణంలో నాణ్యత, పటిష్టత ప్రశ్నార్థకంగా మారటం, నిర్వాహణ సక్రమంగా లేకపోవటమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. దీనికి తోడు ఇటీవల నగరంలో నిర్మాణంలో ఉన్న భవనాలు వరుసగా కూలి కూలీలు మృతి చెందిన ఘటనతో జిహెచ్‌ఎంసి అధికారులకు ఉరుకులు పరుగులు తప్పటం లేదు. కానీ నగరంలో వందల ఏళ్ల క్రితం నిర్మించిన భవనాల్లో కొన్ని ఇంకా ధృడంగా, పటిష్టంగా ఉన్నా, నాలుగైదు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలు పెచ్చులూడటం, రేలింగ్‌లు విరిగిపోవటం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఉన్నట్టుండి సికిందరాబాద్‌లోని చంద్రలోక్ కాంప్లెక్సు రేలింగ్ విరగటంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనతో బల్దియాలో కదలిక వచ్చింది. కేవలం శిథిలావస్థకు చేరిన పాతకాలపు భవనాలే గాక, నాలుగైదు దశాబ్దాల క్రితం నిర్మించిన అపార్ట్‌మెంట్లు, షాపింగ్ కాంప్లెక్సుల పటిష్టతపై అధ్యయనం చేయించి, అవి ప్రజలకెలాంటి ముప్పు కల్గించని స్థితిలో ఉన్నాయని తేలితేనే వాటిని వినియోగానికి అనుమతిస్తామని కమిషనర్ తెలిపారు. ఎలాంటి ముప్పు పొంచి ఉన్నా, వాటిని సీజ్ చేసేందుకు వీలుగా త్వరలోనే కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు కమిషనర్ తెలిపారు. అలాగే త్వరలోనే సర్కిళ్ల వారీగా డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంటు సిటీ ప్లానర్ల ఆధ్వర్యంలో బహుళ అంతస్తు భవనాల పటిష్టతమై అవగాహన శిబిరాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ నెల 8వ తేదీ రాత్రి నానక్‌రాంగూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలి పదకొండు మంది మృతి చెందిన ఘటనతో నిన్నమొన్నటి వరకు ఉరుకులు పరుగులు పెట్టిన జిహెచ్‌ఎంసి అధికారులు టెన్షన్ క్లియర్ అయ్యిందంటూ ఊపరి పీల్చుకునే సమయంలో సోమవారం ఉప్పల్‌లో స్లాబ్ కూలి ఇద్దరు కూలీలకు స్వల్ప గాయాలు కాగా, సికిందరాబాద్ చంద్రలోక్ కాంప్లెక్సులో రేలింగ్ విరిగిపడటంతో దుర్గయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి మంగళవారం ఉదయం చంద్రలోక్ కాంప్లెక్సును సందర్శించి 1975, 76లో నిర్మించిన ఈ భవనం పటిష్టతపై అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఉన్నట్టుండి భవనాలు కుప్పకూలి కూలీలు, అందులో నివాసముంటే సామాన్యులు మృతి చెందే సంఘటనలు పునరావృత్తం కారాదనే ఉద్దేశ్యంతో చంద్రలోక్ కాంప్లెక్సును సీజ్ చేస్తున్నట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ భవనం పటిష్టతపై జెఎన్‌టియు నిపుణులు అధ్యయనం చేసి నివేదికలు సమర్పించిన తర్వాతే మళ్లీ తెరవనున్నట్లు ఆయన తెలిపారు. అంతలోపు ఇందులోని షాపుల యజమానులు భవన నిర్వాహణను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు వీలుగా ఒక వేదిక పైకి రావాలని కమిషనర్ సూచించారు.
నిర్వహణ అంటే..?
నగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ అవసరాలకు అనుకూలంగా నిర్మించిన బహుళ అంతస్తు భవనాల నిర్వాహం అంటే కేవలం వాటిలో ఊడవటం, తూడవటం అని మాత్రమే భావిస్తున్నారు. కానీ నిర్వాహణ అంటే ఆ రెండు పనులే కాదని, భవనం నాలుగు కాలాల పాటు అందుబాటులో ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు వహించాలన్న విషయంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించి, నేడు బహుళ అంతస్తు భవనాల్లో నివసించే ప్రతి ఒక్కరూ తమ భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు.
తృటిలో తప్పిన ప్రమాదం
చంద్రలోక్ కాంప్లెక్సులో ప్రమాదంపై సమాచారం తెలియటంతో ఉదయం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కాంప్లెక్సును సందర్శించారు. మంత్రి వెళ్లిపోయిన పది నిమిషాలకు అక్కడకు చేరుకున్న కమిషనర్ జనార్దన్ రెడ్డి భవనాన్ని పరిశీలించి బయటకు వచ్చారు. అంతలో మేయర్ బొంతు రామ్మోహన్ కూడా అక్కడకు చేరుకున్నారు. వీరిద్దరు భవనాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడి, అక్కడి నుంచి పక్కకు కదిలిన వెంటనే భవనం పై నుంచి మట్టి పెళ్లలు పడ్డాయి. తృటిలో ప్రమాదం తప్పినట్టయ్యింది.