హైదరాబాద్

డబుల్ బెడ్ రూం ఇళ్ల టెండర్లు సరళీకృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: నిలువ నీడలేని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది.
ఇందుకు గాను జిహెచ్‌ఎంసి ఇప్పటికే పలు సార్లు టెండర్లను ఆహ్వానించగా, స్పందన అంతంతమాత్రంగా రావటంతో ప్రభుత్వం ఏకంగా టెండర్ల ప్రక్రియను మరింత సరళీకృతం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి జీవో 94ను సవరిస్తూ జివో 849ను మంగళవారం జారీ చేసింది. హైదరాబాద్ నగరంలోని 18 ప్రాంతాల్లో అయిదు వేల 50 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించేందుకు రూ. 428.85 కోట్ల నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పరిపాలనపరమైన మంజూరు కూడా ఇచ్చింది.
ఈ ఇళ్లను మరింత వేగవంతంగా నిర్మించేందుకు వీలుగా ఈ సవరణ చేస్తున్నట్లు సర్కారు స్పష్టం చేసింది. జివో 94ను అనుసరించి కేవలం ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న కాంట్రాక్టర్లు మాత్రమే పాల్గొనాలనే నిబంధన ఉండేది. కానీ ఈ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టెండర్లకు సంబంధించి 2013లో జారీ చేసిన జివో 94లో పేర్కొన్న నిబంధనలను మార్చాలని జిహెచ్‌ఎంసి ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ఈ సవరణలు జరిగాయి.
సవరించిన అంశాలివే!
* జిహెచ్‌ఎంసి లైసెన్సు ఉన్న బిల్డర్లు ఈ టెండర్లలో పాల్గొనేందుకు వీలుగా అనుమతి.
* ప్రైవేటు రంగంలో భవనాల నిర్మాణ రంగంలో అనుభవజ్ఞులైన బిల్డర్లు పాల్గొనవచ్చు. అయితే ఎవరైనా సర్టిఫైడ్ చార్టెడ్ ఇంజనీర్‌చే ధృవీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది.
* ప్రస్తుతం బిల్డర్లు చేడుతున్న పనులు, పూర్తి చేసిన పనులకు సంబంధించి బిడ్ కెపాసిటీ చార్టెడ్ అకౌంటెంట్ ధృవీకరించాల్సి ఉంటుంది.
* ప్రస్తుతం చేపడుతున్న పనులు, చేపట్టనున్న పనులపై వంద రూపాయల నాన్ జ్యుడీషరీ పేపర్‌పై సంబంధిత బిల్డర్ వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం కొత్తగా చేసిన సవరణలో పేర్కొంది.

ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
అక్రమ కట్టడాలపై ప్రభుత్వానికి నోటీసులు

హైదరాబాద్, డిసెంబర్ 13: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధ పరిధిలో అక్రమంగా నిర్మించిన నివాస భవనాలను వాణిజ్య సముదాయాలుగా మార్చుతున్నారని, వీటిని నిరోధించడంలో జిహెచ్‌ఎంసి విఫలమైందంటూ దాఖలైన్ పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిల్‌పై హైకోర్టు అఫిడవిట్లను దాఖలు చేయాలని హైకోర్టు జిహెచ్‌ఎంసి, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. పిల్‌ను సికింద్రాబాద్‌కు చెందిన పి సంతోష్ కుమార్ దాఖలు చేశారు. బాగ్‌లింగంపల్లి తదితర చోట్ల అక్రమంగా నిర్మించిన నివాస భవనాలను వాణిజ్య సముదాయాలుగా మార్చారని పిల్‌లో పిటిషనర్ పేర్కొన్నారు.