హైదరాబాద్

ఒక్క కాల్‌తో డెబ్రిస్ తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: అసలే ఇరుకురోడ్లు..ఆపై రోడ్డుకు ఓ పక్క భవన నిర్మాణ వ్యర్థాలు..్ఫలితంగా రాకపోకలు సాగించాలంటే నరకమే. ఇలాంటి సమస్యలకు స్వస్తిపలకటంతో పాటు నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై, నాలాల్లో వేసే వారిని గుర్తించి జరిమానాలు వసూలు చేయాలని కూడా జిహెచ్‌ఎంసి నిర్ణయించింది. ఎవరికీ ఇబ్బందుల్లేకుండా క్షణాల్లో డెబ్రిస్‌ను తరలించేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టన్నుకు కేవలం రూ.360 చెల్లిస్తే జిహెచ్‌ఎంసి వాహనమే డెబ్రీస్‌ను తీసుకెళ్లి, డంపింగ్ కోసం గుర్తించి నాలుగు ప్రత్యేక ప్రాంతాల్లో వేస్తోంది. ఇందుకు డెబ్రిస్ తొలగింపునకు ఇళ్లు గానీ సంస్థల యజమానులు, బిల్డర్లు జిహెచ్‌ఎంసి కాల్ సెంటర్ 040-21111111కు ఫోన్ చేయటం, లేక ‘మై జిహెచ్‌ఎంసి’ యాప్‌లోకి వెళ్లి సి అండ్ డి వేస్ట్ లిఫ్టింగ్ అనే ఆప్షన్‌కు వెళ్లి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. ఇందుకు ఒక్క టన్ను డెబ్రిస్‌కు రూ. 360 చెల్లించాల్సి ఉంటుందని కూడా అధికారులు తెలిపారు. ఈ రకంగా తీసుకెళ్లిన డెబ్రిస్‌ను వేసేందుకు జిహెచ్‌ఎంసి ఫతుల్హాగూడ, జీడిమెట్ల, కొత్వాల్‌గూడ, మల్లాపూర్‌లలో నాలుగు ప్రత్యేక స్థలాలను గుర్తించింది. అంతేగాక, ప్రత్యేక వాహనాలను కూడా అందుబాటులోకి తెచ్చింది. అంతేగాక, మున్ముందు ఈ ప్లాంట్ల సంఖ్యను పెంచేందుకు స్థలాలను కేటాయించాలని కూడా జిహెచ్‌ఎంసి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి తదితర జిల్లాల కలెక్టర్లను కోరింది. భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు జిహెచ్‌ఎంసి చేసిన ప్రత్యేక ఏర్పాట్లను సద్వినియోగం చేసుకునేందుకు మొదటి రోజైన బుధవారం నుంచే బుకింగ్‌లు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఖైరతాబాద్, ఆర్‌సిపురం, మెహిదీపట్నం, రామచంద్రాపురం, భారతినగర్, గన్‌ఫౌండ్రి తదితర ప్రాంతాల నుంచి ఈ వ్యర్థాలను తొలగించాలని కోరుతూ వివరాలు నమోదైనట్లు తెలిపారు. భవన నిర్మాణ వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించి వాటి ద్వారా ఇటుకలు, ఇసుక, ఇతర నిర్మాణ అవసరాలకు ఉపయోగపడే వాటిని తయారు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయటం ద్వారా హైదరాబాద్ నగరం దేశంలోనే నాలుగో నగరంగా నిలిచింది. ప్రస్తుతం దిల్లీ, అహ్మదాబాద్, నాగ్‌పూర్ నగరాల్లో మాత్రమే సి అండ్ డి ప్లాట్లు ఉండగా, ఇపుడు హైదరాబాద్‌లో కూడా నాలుగు ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. మున్ముందు వీటి సంఖ్య మరింత పెంచాలని కూడా జిహెచ్‌ఎంసి నిర్ణయించింది. జోన్‌కు రెండు ప్రాంతాలను ఈ రకంగా అందుబాటులోకి తేవాలని కమిషనర్ భావిస్తున్నారు.
26 మందికి జరిమానాల విధింపు
అనధికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్న 26 మంది నుంచి గుర్తించి, వారిపై జిహెచ్‌ఎంసి మొబైల్ కోర్టు కేసులు నమోదు చేసి జరిమానాలను వసూలు చేసింది. మంగళవారం అమీర్‌పేటలో ఈ మొబైల్ కోర్టును మెజిస్ట్రేట్ పి. ఆంజనేయులు నిర్వహించారు. ఇకపై ఈ మొబైల్ కోర్టు ప్రతి మంగళవారం ఒక్కో సర్కిల్‌లో పనిచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.