హైదరాబాద్

కళాకారులపై ఆక్రమ కేసులను ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, డిసెంబర్ 14: కళాకారులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని ప్రజాకళాకారుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. విమలక్కతో సహా ఉద్యమకారులపై పెట్టిన ఆక్రమ కేసులను ఎత్తివేసి, అరుణోదయ, టఫ్ ఆఫీసును వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రజా కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన సభను నిర్వహించారు. ప్రజానాట్య మండలి సినీయర్ నాయకుడు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై మాట్లడే హక్కు లేకుండా పోయిందని తెలిపారు. తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేసిన కళాకారులను అణచివేసే ధోరణి తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. కలం, గళం చూసి పాలకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర పాలకుల పాలనలో కూడా పార్టీ కార్యాలయాలను కబ్జాచేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. అరుణోదయ సంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ తమ పార్టీ కార్యలయాలను పోలీసులతో కలిసి కబ్జా చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మలి దశ ఉద్యమంలో వేలమంది కళాకారులు తమ గళంతో ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు. కబ్జాలు రౌడీలు, గుండాలు చేస్తారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపక్షం, ప్రతిపక్షం లేకుండా చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజాఉద్యమాలను అణచివేసే ధోరణి తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. తమ నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి కూడా ఇవ్వకుండా ప్రజాస్వామ్య స్వేచ్ఛను హరించే విధంగా తెలంగాణ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు. కళాకారులపై పెట్టిన ఆక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆఫీసును వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కళాకారులు తమ ఆటపాటలతో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేశారు. కార్యక్రమంలో ప్రజా కళాకారుల ఐక్య వేదిక ప్రతినిధులు కోటి, సైదులు, ఝాన్సీ, నాగరాజు పాల్గొన్నారు.

మిర్జా అజీమ్ బేగ్ డబుల్ సెంచరీ:
జిహెచ్‌ఎంసి గెలుపు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 14: నగరంలో జరుగుతున్న ఎ-ఇనిస్టిట్యూషన్ వనే్డ లీగ్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో మీర్జాబేగ్ అజీమ్ బేగ్ బ్యాటింగ్‌లో రాణించి డబుల్ సెంచరీ చేయడంతో జిహెచ్‌ఎంసి జట్టు 195 పరుగుల తేడాతో ప్రత్యర్ధి సిండీకేట్ బ్యాంక్‌పై ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్‌లో రాణించిన మిర్జా అజీమ్‌బేగ్ 201 పరుగులతో డబుల్ సెంచరీ, బి.జితేదర్‌సింగ్ 58 పరుగులు చేయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన జిహెచ్‌ఎంసి 40 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన సిండికేట్ బ్యాంక్ 28 ఓవర్లలో 123 పరుగులకు అలౌట్ అయ్యి ఓటమి పాలైంది. జిహెచ్‌ఎంసి బౌలర్లు బాలచందర్, సాయి చందర్‌రావు చెరి మూడేసి వికెట్లు తీసుకున్నారు. చివరి మ్యాచ్‌లో హెచ్‌ఎఎల్ ఏడు వికెట్ల తేడాతో టిఎస్‌ఆర్‌టిసిపై విజయం సాధించింది. ఆర్టీసీ జట్టు 33.2 ఓవర్లలో 115 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అందుకు జవాబుగా బ్యాటింగ్ చేపట్టిన సెచఎఎల్ జట్టు 24.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసి విజయం సాధించింది.