హైదరాబాద్

‘స్వచ్ఛ’ చైతన్యంపై ర్యాలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: కొద్దిరోజుల్లో దేశంలోని లక్ష జనాభాకు మించిన పట్టణాలకు స్వచ్ఛ ర్యాంకింగ్ కోసం నిర్వహించనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో స్థానాన్ని దక్కించుకునేందుకు జిహెచ్‌ఎంసి ధృడసంకల్పంతో ఉంది.
ముఖ్యంగా నెలకో అంశంపై పట్టణాలకు స్వచ్ఛ భారత్ మిషన్ ర్యాంకింగ్‌లు కేటాయించటంతో ఈ సారి జిహెచ్‌ఎంసి దేశంలో ఏ పట్టణం, మహానగరం చేపట్టని తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే అంశంపై ప్రధానంగా దృష్టి సారించింది. నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన ప్రత్యేక ప్రచారం, అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛతపై అవగాహన పెంపొందించేందుకు, ఈ దిశగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు గాను ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఇందుకు గాను వివిధ వర్గాలు జరుపుకునే పండుగలను సైతం జిహెచ్‌ఎంసి చాలా చక్కగా సద్వినియోగం చేసుకంటుంది. ఇప్పటికే గత సోమవారం మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని, ఆ మరుసటి రోజు కూడా ప్రార్థన మందిరాల వద్ధ ‘స్వచ్ఛ హైదరాబాద్’పై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించింది. తడిపొడి చెత్తను వేరు చేసే విధానాన్ని నూటికి నూరు శాతం అమలు చేయటంతో పాటు స్వచ్ఛ ఆటోలను మరిన్ని అందుబాటులోకి తెచ్చి ఇంటింటి నుంచి చెత్తను వేర్వేరుగా సేకరించగలిగితే స్వచ్ఛ రాంకింగ్ దక్కినట్టేనని కూడా అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటు రోడ్డుపై ఎక్కడబడితే అక్కడ చెత్త వేసే వారి నుంచి జరిమానాలను కూడా వసూలు చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు గాను చాలా కాలం వినియోగించని మొబైల్ కోర్టులను కూడా ఇప్పటికే రంగంలో దింపింది.
ఇందులో భాగంగా నగరంలోని స్వయం సహాయక బృందాలకు చెందిన దాదాపు అయిదు లక్షల మంది మహిళలతో గృహిణులకు బొట్టు, తిలకటం పెట్టడం, స్వయం సహాయక బృందాల మహిళలు, పాఠశాల విద్యార్థులచే ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించటం వంటి కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కమిషనర్ ఆదేశాల మేరకు పలు సర్కిళ్లలో డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రజాచైతన్య కార్యక్రమాలు జరిగాయి. వీటిలో అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు నేరుగా ఇంటింటికెళ్లి తడి,పొడి చెత్తను వేర్వేరు చేయటం, పరిసరాల శుభ్రత వంటి అంశాలను వివరించారు. ఈ రకంగా వివిధ రకాలుగా అవగాహన పెంపొందించేందుకు, చైతన్యపరిచేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్న జిహెచ్‌ఎంసి వచ్చే నెల మొదటి నుంచి చెత్త వేసేవారిపై, బహిరంగ మల,మూత్ర విసర్జనలు చేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.

మాతృదేశంపై మమకారంతో సేవా కార్యక్రమాలు

హైదరాబాద్, డిసెంబర్ 15: అమెరికాలో స్థిరపడ్డప్పటికీ మాతృదేశంపై తమకు మమకారం తగ్గలేదని నిరూపించడానికి కోట్లాది రూపాయల ఖర్చుతో తెలుగు రాష్ట్రాలలో అనేక విభిన్న సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస గోగినేని చెప్పారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. 40 ఏళ్ల తానా ఉత్సవాలకు ఆరంభంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, పేద విద్యార్థుల దగ్గర నుంచి వైద్య పరీక్షలు, శస్తచ్రికిత్సల వరకు ఒక ధ్యేయంతో, లక్ష్యంతో తానా సభ్యులందరం కలసికట్టుగా ప్రణాళికలు రచించి ముందుకు వెళ్తున్నామని అన్నారు. నిర్భాగ్యులైన వారికి, ఉచిత విద్య, ప్రోత్సాహకాలకు తానా తపన పడుతోందని, తెలుగు రాష్ట్రాల వారికి తమపై ఎన్నో ఆశలు ఉన్నాయని, అవన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉన్నామని, ఎందరో సహృదయులైన పెద్దలతో కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని చెప్పారు. తానా చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థుల కోసం ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా మేధావుల క్రీడగా పేరుగాంచిన చెస్‌లో ఉభయ రాష్ట్రాలలో ఉపకార వేతన చదరంగ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు చివుకుల సత్యనారాయణ పాల్గొన్నారు.