హైదరాబాద్

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట, డిసెంబర్ 15: నగరంలో సంవత్సరానికి లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తామని కేసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హమీలు మాటలే తప్ప ఆచరణలో లేదని, సనత్‌నగర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం మంత్రి కెటిఆర్ శిలాఫలకాలు దర్శనమిస్తున్నాయని సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ధ్వజమెత్తారు. బన్సీలాల్‌పేట్ డివిజన్‌లో గంగిడి ఎల్లారెడ్డి కాంపౌండ్ మురికివాడలో గత సంవత్సరం మంత్రి కేటిఆర్ శిలాఫలకం వేశారు. ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టక పోవడంతో శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సిఎం కేసిఆర్, కేటిఆర్‌లు హామీలు మాటలు తప్ప ఆచరణ సాధ్యం కాదని మర్రి శశిధర్‌రెడ్డి విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఈ బస్తీ కోర్టు వివాదంలో ఉందని, బస్తీ హక్కుదారులకు నష్టపరిహారం ఇచ్చిన తరువాతనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఐడిహెచ్ కాలనీలో అనర్హులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించారని, ఈ విషయమై రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. దీంతో విచారణలో 33మంది అనర్హులుగా తేల్చినట్టు తెలిపారు. వీరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. వీరిని ప్రోత్సహించిన మంత్రి తలసానిపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. సిఎంపై మాట్లాడితే నాలిక చీరేస్తానని తలసాని అన్నారని ఎవరి నాలుకలు చీరుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. సిఎం కేసిఆర్ నివాసానికి వందల కోట్లు ఖర్చు చేసి నిర్మాణం చేపట్టారు కానీ, పేద ప్రజల కోసం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం నిధులు లేకపోవడం శోఛనీయమని అన్నారు. నగరంలో సంత్సరానికి లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మాస్తామని కెసిఆర్ ప్రకటించి కేవలం తూతూ మంత్రంగా ఐడిహెచ్ కాలనీలో నిర్మించి మిగితా ప్రాంతాలను గాలికి వదిలివేశారని శశిధర్‌రెడ్డి ద్వజమెత్తారు. ఈ విషయంలో ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వం చెప్పే మాటలను నమ్మవద్దని, డబుల్ బెడ్‌రూమ్ పోసిషన్ సర్ట్ఫికెట్ ఇస్తేనే ఖాళీ చేయాలని సూచించారు.
మర్రిని అడ్డుకున్న స్థానికులు
కేటిఆర్ వేసిన శిలాఫలకం ముందు నిరసన కార్యక్రమం చేపట్టేందుకు వచ్చిన మర్రి శశిధర్‌రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. గతంలో పాలించినపుడు తమను పట్టించుకున్నారా అని నిలదీశారు. శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మాటలు నమ్మిన మీకు అవగాహన కల్పించేందుకే వచ్చినట్టు నచ్చజెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు శీలం ప్రభాకర్, ఎంఆర్ బాలకృష్ణ, దయానంద్, మల్లేష్, విశ్వనాథ్, రవినాథ్ గౌడ్, గుంటి సత్యనారాయణ, శ్యాం, కోట, లక్ష్మి, విష్ణు పాల్గొన్నారు.