హైదరాబాద్

22న స్నేహక్లబ్ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదారాబాద్, డిసెంబర్ 20: ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో చదివి అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు ఈనెల 22న రవీంద్రభారతి ఆడిటోరియంలో సాయంత్రం 5గంటలకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు స్నేహక్లబ్ బ్రాండ్ అంబాసిడర్ డా.జెబి రాజు, అధ్యక్షుడు ప్రొ.ఆర్.శ్యాంసుందర్, అధికార ప్రతినిధి డాక్టర్ ఓ.నాగేశ్వరరావు తెలిపారు. మంగళావారం హైదర్‌గూడ న్యూస్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కార్యక్రమ వివరాలు వెల్లడించారు. 2016 విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన ఒక దళిత విద్యార్థి, ఒక గిరిజన విద్యార్థికి రూ.10వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రం ప్రదానం చేయటంతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఎ.చందులాల్ హాజరవుతారని తెలిపారు. సమావేశంలో స్నేహక్లబ్ ప్రతినిధి కెన్నీబాబు పాల్గొన్నారు.

నారాయణ్‌పేట్ డివిజన్‌ను జిల్లాగా ప్రకటించాలి

హైదరాబాద్, డిసెంబర్ 20: నారాయణపేట్ డివిజన్‌ను జిల్లాగా ప్రకటించాలని నారాయణపేట్ జిల్లా సాధన సమితి డిమాండ్ చేసింది. మంగళవారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహధర్నాకు ఆయా రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కొత్త జిల్లాల ఏర్పాటు సహేతుకంగా లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కొసమే జిల్లాల విభజన జరిగిందని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ఆరోపించారు. నారాయణపేట్ జిల్లా ఏర్పాటు చేయాలని ఆరు రోజులు జరిగిన బంద్ తెలంగాణ ఉద్యమంలో జరిగిన బంద్‌ల కంటే ఎక్కువ ప్రభావం చూపిందని అన్నారు. నారాయణపేట్‌లో తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ ఇతర భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారని, నారాయణపేట్ ఒక మినీ ఇండియా లాంటిదని చెప్పారు. విశాలమైన గుర్తింపు, ఆస్తిత్వం ఉన్న పేట్.. నిజాంకాలంలోనే మున్సిపాలిటీగా ఉందని గుర్తు చేశారు. అన్ని అర్హతలు ఉన్న ఈప్రాంతాన్ని జిల్లాగా ఎందుకు ఏర్పటు చేయటం లేదని ప్రశ్నించారు.
టిజెఎసి చైర్మన్ ప్రొ.కోదండరాం మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు జిల్లాల విభజన జరుగలేదని విమర్శించారు. ప్రజలు ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నరని అన్నారు. హైదరాబాద్‌లో కూర్చొని మ్యాప్‌లపై గీతలు పెడితే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఈనెల 23, 24 తేదీల్లో జిల్లాల సవరణ చట్టానికి చర్చ జరుగుతుందని, కొత్త జిల్లాగా నారాయణ్‌పేట్‌పై గట్టిగా పట్టు పడితే సత్ఫలితం రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి డికె ఆరుణ మాట్లాడుతూ యుద్ధప్రాతిపదికన జిల్లాల కోసం ప్రతిపాదిస్తే పరిపాలన సౌలభ్యం కోసమని తాము మద్దతిచ్చినట్లు చెప్పారు.
కానీ ఇష్టారాజ్యంగా చీల్చమని చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 31 జిల్లాలకు ఆదనంగా ములుగు, నారాయణపేట్‌ను జిల్లాలుగా చేస్తే మొత్తం 33 అవుతాయని సిఎం లక్కీ నెంబర్ సరిగ్గా సరిపోతుందని అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ మాట్లాడుతూ ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా అశాస్ర్తియంగా జిల్లాల విభజన జరిగిందని అన్నారు. భౌగోళికంగా, సామాజికంగా అన్ని అర్హతలు ఉన్న నారాయణపేట్‌ను జిల్లాగా చేయాలని డిమాండ్ చేశారు.
టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ నారాయణ్‌పేటను జిల్లాగా చేయాలని అన్ని వర్గాల మద్దతు ఉన్న ఎందుకు అభ్యంతరకరమో చెప్పాలని డిమాండ్ చేశారు. దాదాపు ఎనిమిది జిల్లాలు అడుగకున్నా కేవలం రాజకీయ ప్రయోజనాలకే విభజించారని అన్నారు.
ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో నాము నానాజీ, మనోహర్‌గౌడ్ పాల్గొన్నారు.