హైదరాబాద్

ప్రణాళికతో హరితహారం ముందుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు కలెక్టర్‌లు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్‌లతో భూ సేకరణ, హరితహారంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సంవత్సరం హరితహారం కింద నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు వచ్చే సంవత్సరం హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ జిల్లాలో వచ్చే సంవత్సరానికి హరితహారంలో హెచ్‌ఎండిఎ 55లక్షలు, జిహెచ్‌ఎంసి 5లక్షలు జిల్లా తరపున 170లక్షలు మొత్తంగా 230 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. ఇప్పటివరకు 94 నర్సరీలను గుర్తించామని, 142 లక్షల పాల్తీన్ సంచులు, ఎరువు కలిపిన మట్టిని సేకరించామని అన్నారు.
త్వరలోనే సంచులలో మట్టి నింపి విత్తనాలు వేసి మొక్కలు పెంచడానికి చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. 75 లక్షల టేకు, 9లక్షలు ఈత మొక్కలను నర్సరీలలో పెంచామని అన్నారు.
40శాతం పూల మొక్కలు 60శాతం పండ్ల మొక్కలను కూడా పెంచామని తెలిపారు. ఈ సంవత్సరం నాటిన మొక్కలకు సుమారు 78 శాతం జియో ట్యాగింగ్ చేశామని, వాటి సంరక్షణకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్, జిల్లా రెవెన్యూ అధికారి భవాని శంకర్, హరిత హారం ప్రత్యేక అధికారి శోభ పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ఏకాదశి

హైదరాబాద్, డిసెంబర్ 20: ఏకాదశి పర్వదినాన్ని కార్వాన్ నియోజకవర్గంలోని జియాగూడలోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో ప్రభుత్వం పరంగా నిర్వహించనున్నట్లు పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు చక్కటి సమన్వయంతో ఏర్పాటు చేయాలని కూడా ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఆలయానికి వైకుంఠ ఏకాదశి రోజున భారీ సంఖ్యలో భక్తులు వస్తారని, ఎవరికెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా జిహెచ్‌ఎంసి, విద్యుత్, మెట్రోవాటర్ వర్క్స్, ఆర్టీసి, దేవాదాయ, పోలీసు శాఖ లు, తదితర శాఖ లు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. గత సంవత్సరం ఏకాదశి రోజున భారీ సంఖ్యలో భక్తు లు దేవాలయాన్ని సందర్శించారని, ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ మంది వచ్చే అవకాశమున్నట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది వచ్చే అంచనాలుండటంతో అందుకు తగిన రీతిలో వసతులు కల్పించాలన్నారు. ముఖ్యంగా పాస్‌లు జారీ చేయటంలో దేవాలయ కమిటీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా భక్తుల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లలో లోపాల్లేకుండా చూసుకోవాలన్నారు. దేవాలయం పరిసరాలలో దొంగతనాలు జరగకుండా మఫ్టీలో పోలీసులు విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు మంత్రికి వివరించారు. భగవంతుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మూడురోజుల పాటు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. అలాగే ఆర్టీవో శ్రీవత్స మాట్లాడుతూ ప్రోటోకాల్ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను నిరాటంకంగా నిర్వహించేందుకు వీలుగా విద్యుత్ శాఖ తరపున నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ధనుర్మాస ఉత్సవాలపై దేవాలయ కమిటీ రూపొందించన ప్రత్యేక బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించిన ఈ సమావేశంలో దేవాదాయ శాఖ అధికారి శ్రీనివాస్‌రావు, జిహెచ్‌ఎంసి చీఫ్ ఇంజనీర్ సుభాశ్‌సింగ్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి పద్మజ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.