హైదరాబాద్

తీరు మార్చుకోని ఆర్టీసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడంలో ఆర్టీసి విఫలమైంది. దీని ఫలితంగా షేరింగ్ ఆటోలను ఆశ్రయించి ఆర్టీసిలో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో యాజమాన్యం బస్టాపులనే కాకుండా ప్రయాణికుల సౌకర్యం కోసం రెక్వెస్ట్ స్టాపుల్లో నిలపాలని ఆదేశించినా సిబ్బంది మాత్రం ఆచరించడం లేదు. చేంజ్ ఓవర్ టైమ్‌లో ఐదారు బస్టాపులు దాటి సుమారు ఐదు కిలోమీటర్లు డిపోకు చేరాల్సిన బస్సులు మార్గమధ్యలోనే బస్టాపుల్లో నిలిపి ప్రయాణికులను చేరవేయాలని యాజమాన్యం ఆదేశించినా కొన్ని డిపోల బస్సుల్లో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే కనీసం బస్టాపుల్లో నిలుపకుండా వెళ్లిపోతున్నాయి. మధ్యాహ్నం, రాత్రివేళల్లో ఇంటికి తొందరగా వెళ్లాలనే యోచనతో బస్సుల్లోనే లెక్కలు పూర్తి చేసుకునే విధంగా ప్రయాణికులను చేరవేసే అవకాశం ఉన్న ఖాళీగా నాలుగైదు కిలోమీటర్ల వరకు తీసుకువెళ్తున్నారు. కోఠి నుంచి చేంజ్ ఓవర్ టైమ్‌లో ముషీరాబాద్ డిపోకు చెందిన బస్సులు డిపోకు వెళ్లాలంటే కోఠి నుంచి విఎస్‌టి వరకు సూచిక బోర్డు పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యం కోసం రవాణా సౌకర్యం కల్పించారు. దీనిని అమలు పరచకుండా రాత్రి 9.30 సమయంలో డిపోకు చేరాల్సిన 1డి, 127డి రూట్ బస్సుల సిబ్బంది కనీసం ప్రయాణికులు చేతులు అడ్డం పెట్టినా నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసి క్రాస్‌రోడ్ బస్టాపుల్లో నిలపకుండా వెళ్తుండడంతో గంటల తరబడి నిలబడి మరో బస్సు కోసం చూసి చివరకు ఆటోలనే ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. సిబ్బంది తీరు మార్చుకోకపోతే ఆర్టీసిలో ప్రయాణించేందుకు నిరాకరిస్తూ ప్రత్యామ్నాయ సౌకర్యాలను వేతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో కోట్లాది రూపాయల నష్టాలతో నిర్వహిస్తున్న ఆర్టీసి అభివృద్ధిని ఇంకా నష్టాల ఊబిలోకి నెట్టడమే తప్ప ప్రయాణికుల సౌకర్యం కోసం బస్సులు నడిపిస్తే తప్ప పరిస్థితులు మారే అవకాశాలు కనిపించడం లేదు. నాటి నుండి నేటి వరకు తీరు మార్చుకోని ముషీరాబాద్ డిపోకు చెందిన సిబ్బందిపై అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాల్సిందే.