హైదరాబాద్

మన్సూరాబాద్‌లో టిడిపి, టిఆర్‌ఎస్ మధ్య ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ మన్సూరాబాద్ అభ్యర్థి కొప్పుల నరసింహారెడ్డి హయత్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై తెరాస, టిడిపిల మధ్య గొడవ రాచుకుంది. రెండు పార్టీల నాయకులు పరస్పర దాడులకు పూనుకోవడంతో బాలాజీనగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సమ్మిరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీనికి కారణం తెలుగుదేశం అభ్యర్థి కొప్పుల నరసింహారెడ్డిని బాధ్యుడిని చేస్తూ సమ్మిరెడ్డికి చెందిన నర్సింగ్ కళాశాల విద్యార్థులతోపాటు కొంతమంది కాలనీ వాసులు నరసింహారెడ్డిని నిలదీసేందుకు ఆయన నివాసానికి వచ్చారు. అదే సందర్భంలో పరస్పరం వాదన జరుగుతున్న తరుణంలోనే నరసింహారెడ్డి ఇంటి ప్రధాన గేటును లాక్ చేసుకుని ఇంటిలో ఉండిపోయారు. దీనితో బాలాజీనగర్ కాలనీ వాసులు నరసింగ్ కళాశాల విద్యార్థులు నరసింహారెడ్డి ఇంటిముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున నరసింహారెడ్డి ఇంటి ముందుకు రావడంతోపాటు ఆయన ఇంటిపై రాళ్ల దాడికి తెగబడ్డారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసుల లాఠీలు జులిపించడంతో సమ్మిరెడ్డి తలకు బలమైన గాయం కావడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
న్యాయం చేయాలని ఆందోళన చేస్తుంటే తమ కళాశాల కరస్పాండెంట్‌ని ఎలా కొడతారంటూ నర్సింగ్ విద్యార్థులు పోలీసులపై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొప్పుల నరసింహారెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఆయన ఇంటిపైదాడి చేశారు. ప్రచార రథాన్ని ధ్వంసం చేసి దానితోపాటు పార్టీ కార్యాలయాన్ని కూడా తగులబెట్టారు. ఈ క్రమంలో వందల సంఖ్యలో తెలుగుదేశం, తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున పరస్పర దాడులకు పాల్పడడంతో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి ఆందోళన కారులను చెదరగొట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. నరసింహారెడ్డి ఇంట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధువులను బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించిన నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు ఎలాంటి కారణం లేకుండా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అనుచరులే తమ ఇంటిపై దాడిచేసి నానా రచ్చ చేశారని ఆరోపిస్తూ వారి ఇంటి ముందే ధర్నాకు దిగారు.
ఈ గొడవకు ఆర్టీసి కాలనీలో జరిగిన ఒక గొడవకు సంబంధించి మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై కొప్పుల నరసింహారెడ్డి సోమవారం సాయంత్రం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు.
పోలీసులు మీరు ఏపార్టీవారంటూ అడిగి లాఠీలతో చితకబాదడం ఎంతవరకు సమంజసమని టిడిపి నాయకులు నిలదీస్తున్నారు.