హైదరాబాద్

జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: జనవరి 25న జరిగే 7వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. గురువారం సచివాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న జాతీయ ఓటరు దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో 15-17 ఏళ్ల మధ్య వయస్సు గల పాఠశాల, కళాశాల విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నారని, జిల్లాలో డ్రాయింగ్ టీచర్లతో వర్క్‌షాపు నిర్వహించి చిత్రలేఖనంపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో పురస్కారాలు సాధించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్ మాట్లాడుతూ జిల్లాలోని ఇఆర్‌ఓలు, ఎఇఆర్‌ఓలు జాతీయ దినోత్సవ కార్యక్రమాలపై ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. స్వయం సహాయక బృందాలు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లను భాగస్వామ్యం చేసి ప్రజలకు ఓటుహక్కుపై అవగాహన కల్పిస్తామన్నారు. కళాజాత బృందాలతో జిల్లాలో ప్రచారం చేయిస్తామని, మండలాల్లో ర్యాలీలు నిర్వహించి అన్ని నియోజకవర్గాల్లో పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాలలో రంగోళి పోటీలను విద్యార్థులకు వకృత్వ పోటీలను, క్విజ్ పెయింటింగ్ విభాగాలలో పోటీలను నిర్వహించి గెలుపొందినవారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో చేవెల్ల డిఆర్‌డిఓ చంద్రమోహన్, జిల్లా ఎలక్షన్ తహశీల్దార్ రమేశ్ పాల్గొన్నారు.

పోటీపరీక్షల అభ్యర్ధులకు తెలంగాణ చరిత్ర పుస్తకాలు ఉపయోగకరం
* టిజెఏసి చైర్మన్ ప్రొ.కోదండరాం
హైదరాబాద్, డిసెంబర్ 22: తెలంగాణ ఉద్యమ చరిత్రలోని ముఖ్యఘట్టాలను పొందుపరుస్తూ సంక్షిప్తంగా రూపొందించిన పుస్తకాలు పోటీపరీక్షల అభ్యర్ధులకు ఎంతో దోహదపడతాయని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొ.కోదండరాం అన్నారు. గురువారం ఎన్టీఆర్ స్టేడియంలోని మఖ్ధూం వేదికపై ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యమం-అనంతరం’ పుస్తకాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈసందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలోని ముఖ్యఘట్టాలను సంక్షిప్తంగా తేదీలతో సహా సవివరంగా చాటుతూ పుస్తకంగా రూపొందించటం అభినందనీయమన్నారు. అలాగే చిత్రనీరాజనం, అలుగు (తెలంగాణ కథ 2015) పుస్తకాలను ఆయా వేదికలపై పలువురు సాహితీవేత్తలు ఆవిష్కరించారు.
ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో స్వామి శ్రద్ధానంద్ లైఫ్‌పై నిర్వహించిన సభలో గుజరాత్‌కు చెందిన స్వామి వివేకానంద పరివ్రాజక్ ముఖ్యఅతిధిగా హజరై ‘దుఃఖం యొక్క స్వరూపాలు-కారణాలు-విమోచన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విద్యానందచారి జానపద పాటలు పుస్తకప్రియులను అలరించాయి. సాహిత్య సమాలోచనలో భాగంగా తెలంగాణ సినిమా-చిత్రకళ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా హాజరైన తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, మాభూమి నిర్మాత బి.నరసింగరావు, లక్ష్మణ్ ఏలె, శంకర్ పామర్తి, ప్రధానవక్తగా హెచ్.రమేష్‌బాబు, తిరునగరి శ్రీనివాస్ తెలంగాణ ఇతివృత్తం సినిమా, చిత్రకళ విశిష్టతను వివరించారు. కార్యక్రమాన్ని బుక్‌ఫెయిర్ అధ్యక్ష, కార్యదర్శులు జూలూరు గౌరీశంకర్, కె.చంద్రమోహన్ పర్యవేక్షించారు.