హైదరాబాద్

స్వచ్ఛ ర్యాంకింగ్ దిశగా ‘వావ్ హైదరాబాద్’ మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకును సాధించుకునే దిశగా జిహెచ్‌ఎంసి చేపడుతున్న చర్యల్లో భాగంగా వావ్ హైదరాబాద్ కార్యక్రమం శుక్రవారం నుంచి మొదలైనట్టే. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 ప్రత్యేక సభలో మంత్రి కె.తారకరామారావు, మేయర్ బొంతురామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేగాక, రాంకీ సంస్థ రూ. 2 కోట్లను జిహెచ్‌ఎంసికి విరాళంగా అందజేసింది. ఐటిసి సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి ఇంటి నుంచి తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించనుంది. ఈ చెత్తలోని ప్లాస్టిక్, మెటల్, కాగితం, గాజు ముక్కలను వేర్వేరు చేసి, వాటితో ఇతర వస్తువులను తయారు చేయనుంది. ఇలాంటి బాధ్యతలను దేశంలోనే మొట్టమొదటి సారిగా నగరంలో ఐటిసి నిర్వహించనుంది. ఇందులో భాగంగానే వెల్ బీయింగ్ ఔట్ ఆఫ్ వేస్ట్(డబ్ల్యువోడబ్ల్యు) హైదరాబాద్(వావ్ హైదరాబాద్) అనే కార్యక్రమం ప్రారంభమైంది. జంటనగరాల్లోని ప్రజల జీవన శైలికి అనుకూలమైన కాలుష్య రహితమైన పర్యావరణ పరిస్థితులను కల్పించేందుకు గాను ఈ చెత్తను ఎప్పటికపుడు వేర్వేరుగా సేకరించనున్నారు. ఈ చారిత్రక విధానాన్ని ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలను అనుసరించి మెరుగైన ఫలితాలను సాధించటంతో మన దేశంలో మొట్టమొదటి సారిగా అమలు చేసేందుకు జిహెచ్‌ఎంసి సిద్ధమైంది. ఇప్పటికే జిహెచ్‌ఎంసి ప్రతి ఇంటికి పంపిణీ చేసిన రెండు డస్ట్‌బిన్లలో కుటుంబ సభ్యులే తడి,పొడి చెత్తను వేర్వేరుగా వేసి ఇచ్చేందుకు వీలుగా వారిలో అవగాహన కల్పించేందుకు ఐటిసి సంస్థకు చెందిన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఇంటింటికెళ్లి కుటుంబ సభ్యులకు తడి,పొడి చెత్తను వేర్వేరు చేయటంపై అవగాహన కల్పించనున్నారు.
వావ్ హైదరాబాద్‌లో భాగంగా..
ఈ రకంగా వేర్వేరుగా సేకరించిన చెత్తలో మానవ మనుగడ, పర్యావరణకు ముప్పు చేసే వ్యర్థాలను శాస్ర్తియంగా ల్యాండ్‌ఫీల్ చేసి, అందులో రీ సైక్లింగ్‌కు పనికొచ్చే వాటిని వేరు చేసి వాటితో ప్రత్యామ్నాయంగా ఇతర వస్తువులను తయారు చేసే బాధ్యత ఐటిసి సంస్థ తీసుకుంది. ఈ ప్రక్రియతో పర్యావరణ పరిరక్షణ సాధ్యం కావటంతో పాటు చెత్తే కదా! అనుకోకుండా ప్రధాని మోదీ చెప్పినట్లు వేస్ట్ ఈజ్ ఎనర్జీ అన్న మాటను స్పూర్తిగా తీసుకుని పారవేసే దానిలో కూడా రీ సైక్లింగ్ కోసం పనికొచ్చే వాటిని సేకరించి, వాటితో ప్రత్యామ్నాయంగా వస్తువులను తయారు చేసుకోవచ్చు. అంతెందుకు స్వీడన్ దేశం విద్యుత్ తయారీ కోసం ఇతర దేశాల నుంచి చెత్తను కొనుగోలు చేసిన సందర్భాలు సైతం లేకపోలేవు. చెత్తలోని వ్యర్థాలతో ఎక్కువగా కాగితాన్ని తయారు చేసుకోవచ్చునని నిపుణలంటున్నారు. అంతేగాక, చాలా వరకు చెట్లను కాపాడుకునే ఆస్కారమేర్పడుతోంది. అలాగే వేస్ట్ కలెక్టర్స్, చిత్తుకాగితాలు ఏరుకునే వారికి ఈ విధానం ఉపాధి కల్పించనుంది.

విద్యార్థి సంఘాల
అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం
అడ్డుకున్న పోలీసులు
పలువురు విద్యార్థుల అరెస్టు

హైదరాబాద్, డిసెంబర్ 23: రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్శిటీలకు అనుమతించొద్దంటూ శుక్రవారం విద్యార్థిసంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ప్రైవేట్ వర్శిటీలతో పేద, మధ్యతరగరతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారని, విద్యావ్యవస్థ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, గన్‌పార్క్ నుంచి అసెంబ్లీలోకి దూసుకుపోయేందుకు యత్నించారు. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అసెంబ్లీ వద్ద కాస్సేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు పలువురు విద్యార్థి సంఘం నేతలను అరెస్టు చేసి సైఫాబాద్, గోషామహల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు పురుషోత్తం, శ్రీ్ధర్ మీడియాతో మాట్లాడుతూ, విద్యను ప్రైవేటీకరణ చేయడంలో భాగంగానే తెలంగాణలో కొత్తగా ప్రైవేట్ యూనివర్శిటీల ఏర్పాటుకు అనుమతించేందుకు ప్రభుత్వం యోచిస్తుందని ఆరోపించారు. ఇప్పటికే పలు సంస్థల్లో కార్పొరేట్ సంస్థలు చొరబడి ఉపాధిని దెబ్బతీశాయని, ఇప్పుడు యూనివర్శిటీలు ఏర్పడితే విద్యావ్యవస్థ ఛిద్రమైపోతుందని నిశితంగా విమర్శించారు. వెంటనే ప్రైవేట్ యూనివర్శిటీల ఏర్పాటు యోచనను ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.