హైదరాబాద్

ఎంజిబిఎస్‌లో వ్యాపారుల ‘రూటే’ సప‘రేటు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాదర్‌ఘాట్, డిసెంబర్ 25: అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో మాత్రం పరిస్థితులు మారడం లేదు. చివరి ప్రయత్నంగా జరిమానా విధించినా స్టాల్స్ నిర్వహణలో నామమాత్రపు స్పందన కూడా కనిపించడం లేదు. ఎక్కువ ధరలకు తిరుబండారాలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న నిర్వాహకులపై తరచూ ఫిర్యాదులు అందుతున్నా అధికారులు చర్యలు చేపడుతున్నా వ్యాపారుల్లో నామమాత్రమైనా నెరవకుండా ‘దంచుడు’ వ్యవహారంగా వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఎంతమాత్రం జంకూ, భయం లేకుండా అందినంత దోపిడీ చేస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసిన అనంతరం రెండురోజులు సవ్యంగా నిర్వాహకులు స్టాల్స్‌ను నడుపుతారే తప్ప, మిగతా ఏ సందర్భంలోనూ మీనమేషాలు లెక్కచేయడం లేదు. పార్కింగ్ నిర్వహణ నుంచి మొదలుపెడితే బస్‌స్టేషన్‌లో అణువణువునా మోసాల బారినపడటం ప్రయాణికుల వంతైంది. ఇష్టారాజ్యంగా ధరలు విధిస్తూ అందినంత దోచుకుంటున్న వైనంపై కొందరు అధికారులు కూడా చూసిచూడనట్లు వదిలేయడం దోపిడికి తెరలేపినట్లుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయ. బయటి మార్కెట్‌లో 20 రూపాయలకు లభ్యమయ్యే మినరల్ వాటర్ బాటిల్ ఇక్కడ 25 రూపాయల నుండి కూల్‌ని బట్టి 30 రూపాయలవరకు వసూలు చేస్తున్నారు. సికింద్రాబాద్ లాంటి అతి పెద్ద రైల్వే స్టేషన్‌లో సైతం వాటర్ బాటిల్ రొ.15 కే అమ్మడం గమనించాలని ప్రయాణికులు అంటున్నా వాటిని స్టాల్స్‌యా జమానులు, కానీ విక్రయదారులు గానీ పట్టించుకోకుండా అక్కడే తెచ్చుకోండి అంటూ భగ్గుమంటున్నారని ప్రయాణి కులు వాపోతున్నారు.
మరీ తినుబండారాలైతే ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించని లోకల్ కంపెనీలకు చెందిన వాటిని అక్రమ ధరలకు ప్రయాణికులకు అంటగడుతున్నారు. ఎంఆర్‌పి ధరలకు మించి ఎక్కువ రేట్లను గుంజితే అధికారులకు ఫిర్యాదు చేయాలని అక్కడక్కడా బోర్డులు కనిపించినా వ్యాపారులు నిసిగ్గుగా నెరవకుండా విక్రయాలు జరుపుతున్నారు. నిత్యం వేలాదిమంది ప్రయాణికుల రాకపోకలతో కళకళలాడే బస్‌స్టేషన్‌లో ఇలాంటి దుకాణాలపై అధికారులు పైపై చర్యలు తీసుకోవడంలో ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు. సంస్థకు అందాల్సిన అద్దెలు సక్రమంగా చెల్లిస్తే చాలులే అనీ భ్రమలో సిబ్బంది, వ్యాపారులు చేసే అక్రమాలను వెనకేసుకొస్తున్నారు. ఎన్ని పర్యాయాలు హెచ్చరించినా ఇదే రీతిన మోసాలకు తెగబడుతూ ప్రయాణికులను దోచేస్తున్నారు. ఇక్కడి క్యాంటీన్లలోనూ రుచి, శుచి గాలికొదిలేసి వాటి నిర్వాహకులు అపరిశుభ్రత వాతారణంలో ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచుతున్నారు. సవ్యంగా శుభ్రం చేయని పాత్రలతో వ్యాపారులు ఆహార పదార్థాలను తయారు చేస్తున్నా... వీటి గురించి ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదు చేసినా... వ్యాపారులు, అధికారులు కుమ్మక్కయి ఎవరి ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో దోపిడీని అరికట్టే దిశగా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సాయబాబా ఆలయ నూతన కమిటీ ఎన్నిక

దిల్‌సుఖ్‌నగర్, డిసెంబర్ 25: దక్షిణ షిరిడీగా పేరుగాంచిన దిల్‌సుఖ్‌నగర్ శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం నూతన కార్యవర్గ ఎన్నికలను బాబా ఆలయ సంస్థాన్ ట్రస్ట్ ఎన్నికల కమిటీ అధ్యక్షులు ఎన్.శివారెడ్డి, కమిటీ సభ్యులు ఎస్‌పివి సత్యనారాయణరావు, బి.పరమేశ్వర్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో బి.వెంకటయ్య, డాక్టర్ కె.లింగయ్యలు చైర్మెన్‌లుగా ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గం 2017నుండి 2019వరకు కొనసాగుతుందని తెలిపారు. రెండు సంవత్సరాల కాలవ్యవధిలో మొదటి ఏడాది బి. వెంకటయ్య, ద్వితీయ సంవత్సరం డాక్టర్ కె.లింగయ్య చైర్మెన్‌లుగా కొనసాగుతారు.
వైస్ చైర్మన్‌లుగా జి.్భమయ్య, బి.గంగాధర్, టి.సురేందర్‌రెడ్డి, జనరల్ సెక్రెటరీ పి.రఘుకుమార్, కోశాధికారి ఇవివి నాగేశ్వరరావు, జాయింట్ సెక్రెటరీలుగా ఎం.శ్యామల రావు,పి.వీరప్ప, ఎం.సాయికుమార్, ఆర్. ఎస్ శంకర్‌రావు, కె.కళ్యాణ్‌సాయి, కార్యవర్గ సభ్యులుగా పి.లక్ష్మీదుర్గ, బివిశ్యామ్‌కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బాబా ఆలయ అభివృద్ధికి పాటుపడుతామని అన్నారు. ఎంతో విశిష్టతకలిగిన బాబా ఆలయ కమిటిలో చోటుదక్కడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.